BigTV English

Vijay Devarakonda : విజయ్ దేవరకొండ హెల్త్ అప్డేట్..అప్పటివరకు హాస్పిటల్లోనేనా?

Vijay Devarakonda : విజయ్ దేవరకొండ హెల్త్ అప్డేట్..అప్పటివరకు హాస్పిటల్లోనేనా?

Vijay Devarakonda : టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం అనారోగ్య సమస్యతో ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. డెంగ్యూ జ్వరంతో బాధపడుతూ వస్తున్న ఆయన హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారట. విజయ్ కి ఓపిక లేక చాలా నీరసంగా ఉండటం వల్లే హాస్పిటల్ కి వెళ్లాల్సి వచ్చిందని, ఆకలి లేకపోవడంతో ఎటువంటి ఆహారం తీసుకోలేక ఇబ్బంది పడుతున్నట్లు టాక్ నడిచింది.. విజయ్ దేవరకొండ ఆరోగ్యం ఎలా ఉంది అని ఆయన అభిమానులు ఇవి వార్తను విన్నప్పటి నుంచి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.. ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న విజయ్ దేవరకొండ ఆరోగ్యం ఇప్పుడు ఎలా ఉందో..? వైద్యులు ఏమంటున్నారో ఒకసారి మనం తెలుసుకుందాం..


విజయ్ దేవరకొండ ఆరోగ్యం ఎలా ఉందంటే..?

యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. నిన్న నీరసంగా ఉండడంతో ఆయన్ను ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు ఆయన పరీక్షించి డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్నట్లు ధృవీకరించారు. విజయ్‌కి పరీక్షలు చేసిన వైద్యులు విశ్రాంతి తీసుకోవాల్సిందిగా సూచించడంతో పాటు మూడు రోజులు ఆసుపత్రిలోనే ఉండాలని చెప్పినట్లుగా తెలుస్తోంది. అప్పటికి విజయ్ కండీషన్‌ను బట్టి వైద్యులు డిశ్చార్జ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరో రెండు మూడు రోజులు పాటు విజయ్ దేవరకొండ ఆసుపత్రిలో ఉండే అవకాశం ఉందని సమాచారం.. ఆ తర్వాతే కింగ్‌డమ్ ప్రమోషనల్ కార్యక్రమాల్లో విజయ్ దేవరకొండ పాల్గొననున్నారు. అయితే ఈ వార్తలపై విజయ్ కానీ, ఆయన కుటుంబ సభ్యులు కానీ స్పందించాల్సి ఉంది. మరోవైపై విజయ్ దేవరకొండ ఆసుపత్రిలో చేరినట్లు తెలియడంతో ఆయన అభిమానులు టెన్షన్ పడుతున్నారు..


Also Read :పెళ్లికి ముందే ప్రగ్నెంట్ అయిన సీరియల్ హీరోయిన్.. ఇదేం ట్విస్ట్ తల్లి..!

కింగ్డమ్ మూవీ..

వరుస ఫ్లాపులు నేపథ్యంలో కెరీర్‌లో ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఉన్నారు విజయ్ దేవరకొండ. ఈ నేపథ్యంలో గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ నటించిన చిత్రం కింగ్‌డమ్.. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించారు. సత్యదేవ్, కౌశిక్ మెహతాలు ఇతర కీలకపాత్రలు పోషిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ క్రియేషన్స్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్యలు రూ.100 కోట్ల బడ్జెట్‌తో సంయుక్తంగా నిర్మిస్తున్నారు.. ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుంది కానీ రిలీజ్ డేట్ మాత్రం వాయిదా వేసుకుంటూ వస్తుంది. మొత్తానికి మూవీ ని ఈ నెల 31న థియేటర్లోకి తీసుకొచ్చేందుకు మేకర్స్ డేట్ ని లాక్ చేసుకున్నారు. కేవలం కొద్ది రోజులు మాత్రమే ఉండడంతో సినిమా ప్రమోషన్స్ ని గట్టిగానే మొదలుపెట్టాలని అనుకున్నారు. కానీ ఈలోపు విజయ్ దేవరకొండకు డెంగ్యూ జ్వరం రావడంతో ఆసుపత్రిలో చేరారు. పట్టుమని 10 ఉండటంతో ప్రమోషన్స్ కి విజయ్ దేవరకొండ వస్తాడా? రాడా? అనే టెన్షను ఫాన్స్ లో మొదలైంది.. దీని గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి. ఏది ఏమైనా కూడా విజయ్ దేవరకొండకు ఈ మూవీ హిట్ అయితే కెరీర్ మళ్లీ ట్రాక్ లో పడుతుంది.. చూడాలి ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుందో..

Related News

Ilaiyaraaja : మైత్రి మూవీ మేకర్స్ కు దిమ్మతిరిగే షాక్.. 5 కోట్లు డిమాండ్..

Bollywood: బాలీవుడ్ లో దిగ్బ్రాంతి, ఆ ప్రముఖ నటుడు దూరమయ్యారు

Ar Muragadoss: ఇంక రిటైర్మెంట్ ఇచ్చేయండి బాసు, పెద్ద డైరెక్టర్లు వరుస ఫెయిల్యూర్స్

Nag Ashwin: ప్రధానికి నాగ్ అశ్విన్ కీలక రిక్వెస్ట్.. కొత్త జీఎస్టీ‌లో ఆ మార్పు చెయ్యాలంటూ…

Siima 2025 Allu Arjun: సైమా ఈవెంట్లో అల్లు అర్జున్, లుక్ అదిరింది భాయ్

17 Years of Nani : మామూలు జర్నీ కాదు, ఈ తరానికి నువ్వే బాసు

Big Stories

×