E-Paper
Advertisement

Sabarmati Express rail: పట్టాలు తప్పిన సబర్మతి ఎక్స్‌ప్రెస్, ప్రయాణికులు సేఫ్

Sabarmati Express rail: పట్టాలు తప్పిన సబర్మతి ఎక్స్‌ప్రెస్, ప్రయాణికులు సేఫ్
Advertisement

Sabarmati Express rail: సబర్మతి ఎక్స్‌ప్రెస్ రైలుకు పెను ప్రమాదం తప్పింది. యూపీలోని కాన్పూర్ వద్ద శనివారం అర్థరాత్రి దాటిన తర్వాత 2.35 నిమిషాలకు ట్రైన్ పట్టాలు తప్పింది. ట్రాక్‌పై ఓ వస్తువును రైలు ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. దీంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

వారణాసి నుంచి అహ్మదాబాద్‌కు ఈ రైలు వెళ్తోంది. శనివారం తెల్లవారుజామున 02:35 గంటలకు కాన్పూర్ సమీపంలో పట్టాలు తప్పింది. ట్రాక్‌పై ఉంచిన వస్తువును ఇంజిన్ ఢీకొట్టి పట్టాలు తప్పింది.

Advertisement

రైల్వే ట్రాక్‌లో ఎలాంటి పగుళ్లు లేవని ప్రాథమిక విచారణలో తేలింది. ఐబీ, యూపీ పోలీసులు సంయుక్తం గా ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. కొద్దిసేపు ఆ రూట్లో వెళ్లే రైళ్లకు అంతరాయం కలిగింది. ప్రస్తుతం యథావిధిగా రైళ్ల రాకపోకలు సాగుతున్నాయి.

ALSO READ: అటల్ సేతు బ్రిడ్జిపై మహిళ ఆత్మహత్యాయత్నం.. కాపాడిన డ్రైవర్, పోలీసులు

Advertisement

ఏడాదిగా పరిశీలిస్తే ఈ మధ్యకాలంలో తరచూ రైలు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. వందలాది మంది మృత్యువాతపడ్డారు. ఈ ఘటనల వెనుక కారణమెవరు? ఇలా రకరకాల ప్రశ్నలు రైజ్ అవుతున్నాయి. ఇప్పటికైనా కేంద్రప్రభుత్వం రైళ్ల ఘటనలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అంటున్నారు ప్రయాణికులు.

 

Related News

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

బ్యాంక్ ఉద్యోగాల కోసం చూస్తున్నారా? IBPS RRBలో 13,706 పోస్టులు ఖాళీ.. పూర్తి వివరాలవిగో

23 రోజుల్లో 9 చలాన్లు.. రూ.56 వేల జరిమానా.. నోయిడా రేప్ బస్సు పాపాల చిట్టా!

మమతా బెనర్జీకి బిగ్ షాక్.. 28 ఏళ్ల మేనకోడలు ఆత్మహత్య.. మరణానికి కారణం అదేనా?

Big Stories

Advertisement
×