BigTV English

Kalki 2898 AD OTT Release Date: ఇట్స్ అఫీషియల్.. ఓటీటీలోకి ‘కల్కి’.. డేట్ ఇదే..

Kalki 2898 AD OTT Release Date: ఇట్స్ అఫీషియల్.. ఓటీటీలోకి ‘కల్కి’.. డేట్ ఇదే..

Kalki 2898 AD OTT Release Date: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ‘కల్కి 2898 ఏడీ’. ఎన్నో అంచనాల నడుమ జూన్ 27న గ్రాండ్ లెవెల్లో విడుదలై సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఎన్నో రికార్డులను సైతం కొల్లగొట్టింది. అంతేకాకుండా కొత్త రికార్డులను నెలకొల్పింది. బాక్సాఫీసు దగ్గర సుమారు రూ.1200 కోట్ల భారీ కలెక్షన్లను రాబట్టింది. దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ విజువల్ వండర్ మూవీ సినీ ప్రియుల్ని కట్టిపడేసింది. ఈ మూవీలోని గ్రాఫిక్స్‌కు ఆడియన్స్ ఫిదా అయిపోయారు. అలాగే ప్రభాస్ లుక్‌ను చూసి నివ్వెరబోయారు.


దర్శకుడు నాగ్ అశ్విన్ తన క్రియేటివిటి కంటెంట్‌కి విజువల్ ఎఫెక్ట్స్ జోడించి చూపించిన తీరు ఎంతో మందిని మంత్రముగ్దులను చేసింది. దీంతో దర్శకుడు ఎంతోమంది చేత ప్రశంసలు అందుకున్నాడు. ఒక టాలీవుడ్ నుంచి ఇలాంటి ఒక విజువల్ వండర్ సినిమాను అందించిన నాగ్ అశ్విన్‌పై ప్రముఖ సినీ స్టార్ దర్శకులు ప్రశంసల వర్షం కురిపించారు. అలాగే ఈ మూవీలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్‌ను సరికొత్త లుక్‌లో చూపించి విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నాడు.

ముఖ్యంగా ఇందులో వచ్చే యాక్షన్ సన్నివేశాలు సినిమాను ఓ లెవెల్‌కి తీసుకెళ్లాయి. ప్రభాస్, అమితాబ్ బచ్చన్‌ల మధ్య వచ్చే ఈ యాక్షన్ సీన్లు అందరినీ కట్టిపడేశాయి. ఒక్కో ఫైట్ సీన్ దాదాపు 5నిమిషాల పైనే ఉంటూ థియేటర్లలో వీక్షించేవారికి గూస్ బంప్స్ తెప్పించాయి. ఇలా ఒక్కో క్యారెక్టర్‌కు అద్భుతమైన ఎలివేషన్స్ ఇచ్చి సినిమా రేంజ్‌ను మార్చేయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. వాటితో పాటు ఇందులో స్టార్ కాస్టింగ్‌ను తీసుకుని సినిమా పై ఆసక్తి పెంచాడు.


Also Read: ప్రభాస్ కల్కి ఆఫర్ ని రిజెక్ట్ చేశా.. నాగీ అడిగినా కూడా చేయనని చెప్పా

ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే, దిశా పటానీ ముఖ్య పాత్రల్లో కనిపించగా.. విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, దర్శకుడు రాజమౌళి, దర్శకుడు ఆర్జీవి, ఫరియా అబ్దుల్లా వంటి ఇతర నటీ నటులు గెస్ట్ రోల్‌లో నటించి మెప్పించారు. ఇక రీసెంట్‌గానే ఈ సినిమా 50 రోజులు పూర్తి చేసుకోవడం విశేషం. ప్రస్తుతం వస్తున్న సినిమాలేవి రెండు మూడు వారాలకు మించి థియేటర్లలో ఆడటం లేదు. అలాంటిది కల్కి ఏకంగా 50 రోజులు పూర్తి చేసుకోవడమంటే చిన్న విషయం కాదు. ఇందులో భాగంగానే తాజాగా దర్శకుడు నాగ్ అశ్విన్ అతని కుటుంబ సభ్యులతో కలిసి 50 రోజుల సక్సెస్ సెలబ్రేషన్స్ జరుపుకున్నారు.

అయితే ఈ మూవీ ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో అలాంటి ప్రియులకు తాజాగా ఓ గుడ్ న్యూస్ వచ్చింది. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫర్మ్ అయింది. ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ అమెజాన్‌ ప్రైమ్ వీడియోలో ఆగస్టు 22 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ అమెజాన్ ప్రైమ్ తాజాగా ఓ పోస్టర్ రిలీజ్ చేసింది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×