Bigg Boss Telugu 9 Day 3 – Promo 2: బుల్లితెరపై బిగ్ బాస్ సందడి మొదలైంది. బిగ్ బాస్ 9 తెలుగు కొత్త సీజన్ మూడో రోజుకు వచ్చింది. ఎపిసోడ్కి సంబంధించి వరుస ప్రొమోలు వదులుతూ హైప్ పెంచుతుంది బిగ్ బాస్ టీం. ఇప్పటికే మూడో రోజనుకి సంబంధించిన ఫస్ట్ ప్రొమో విడుదల చేయగా.. అందులో నామినేషన్స్ వాడి వేడిగా కనిపించాయి. టెనంట్స్ నుంచి భరణి సుత్తి అందుకోగా.. ఓనర్స్ (కామనర్స్) నుంచి శ్రీజ దమ్ముకు తన నామినేషన్ జడ్జీమెంట్ ఇచ్చాడు. భరణి సంజనను నామినేట్ చేస్తే.. ప్రియా తనూజను చేసింది. ఈ క్రమంలో దమ్ము శ్రీజ తన నామినేషన్ పై వివరణ ఇస్తూ తనూజపై విరుచుకుపడింది. నామినేషన్ పేరుతో వారిపై ఉన్న తన అభిప్రాయాన్ని బయటపెట్టింది. నామినేషన్లో తనని డిఫెండ్ చేసుకుంటున్న క్రమంలో మాస్క్ మ్యాన్, తనుజ మధ్య.. మాటల యుద్దమే జరిగింది.
ఈ వార్ బాడీ లాంగ్వేజ్ అంటూ పర్సనల్ ఎటాక్ వరకు వెళ్లింది. మాస్క్ మాటలకు నొచ్చుకున్న తనుజ ఏడుపు మొదలుపెట్టింది. ఫస్ట్ ప్రొమో ఆసక్తిగా సాగింది. ఇక తాజాగా విడుదలైన సెకండ్ ప్రొమోలో.. సుమన్ శెట్టి ‘సుత్తి‘ కొట్టి సత్తా చూపించాడు. నామినేషన్ అర్హతకు ఫ్లోరా సైనీ, సుమన్ శెట్టి పోటీ పడగా.. ముందుగా పోడియం చేరి సుత్తి అందుకున్నాడు సుమన్ శెట్టి. దీంతో సంజనను నామినేట్ చేశాడు. హౌజ్ లో తన బిహేవియర్ ఇరిటేటింగ్ గా ఉందని చెప్పాడు. తన నామినేషన్ జడ్జిమెంట్ని ప్రియకు ఇవ్వగా.. ఆమె అందరికి సంజన పాయింట్ రిపీట్ రిపీట్ అవుతుందని , తన నామినేషన్ ఛేంజ్ చేసింది. సంజన స్థానంలో రాము రాథోడ్ ని నామినేట్ చేసింది. ఫుడ్ విషయంలో తనకు నచ్చని పాయింట్ చెప్పి నామినేట్ చేస్తున్నట్టు చెప్పింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య చిన్నపాటి వార్ జరిగింది.
ఫుడ్ విషయంలో ఓనర్స్ రూల్ బ్రేక్ చేయలేదా? రామ్ తనని డిఫెండ్ చేసుకునే క్రమంలో ప్రియా, రాము మధ్య వాగ్వాదం జరిగింది. చివరికి ప్రియ.. నామినేషన్ అగ్రీ చేస్తూ.. ఫుల్ స్టాప్ పెట్టాడు రాము. ఆ తర్వాత ఓనర్స్ నుంచి డిమోన్ పవన్, మర్యాద మనీష్లు డెంజర్ జోన్లో ఉన్నారు. వారిద్దరిలో ఒకరిని నామినేట్ చేయమని బిగ్ బాస్ భరణికి చెప్పాడు. వారిలో భరణి.. డిమోన్ పవన్ నామినేట్ చేశాడు. డిమోన్ పవన్లో తనకు నిర్లక్ష్యం ఎక్కువగా ఉందని, ఆ యూటిట్యూడ్ని సరిచేసుకోవాలని చెబుతూ భరణి అతడిని నామినేట్ చేయడం ప్రొమోలో చూపించారు. నేను నెగ్లిజెన్స్ గా యాటిట్యూడ్తో ఉన్న అనడాన్ని నేను ఆక్సెప్ట్ చేయనంటూ పవన్ తనని తాను డిఫెండ్ చేసుకోవడంతో ప్రొమో ముగుస్తుంది. అయితే నేటి ఎపిసోడ్లో నామినేషన్స్ హీట్ మరింత పెరిగిందనిపిస్తోంది. ముఖ్యంగా తనూజ నామినేషన్ నేటి ఎపిసోడ్ ఆడియన్స్ కాస్తా ఆసక్తిని ఇచ్చేలా ఉంది. మరి ఈ రోజు హౌజ్లో ఏం జరిగిందనేది రాత్రి ఫుల్ ఎపిసోడ్లో చూద్దాం.