E-Paper
Advertisement

Satya Nadella Meets PM Modi: ప్రధానీతో సత్య నాదెళ్ల భేటీ.. భారత్‌లో మైక్రోసాఫ్ట్ రూ.1.5 లక్షల కోట్ల పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్

Satya Nadella Meets PM Modi: ప్రధానీతో సత్య నాదెళ్ల భేటీ.. భారత్‌లో మైక్రోసాఫ్ట్ రూ.1.5 లక్షల కోట్ల పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్
Advertisement

Satya Nadella Meets PM Modi: మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల మంగళవారం భారత ప్రధాని నరేంద్ర మోదీని కలుసుకున్నారు. ఈ భేటీ దేశ భవిష్యత్తుకు దిశానిర్ధేశం చేసే కీలక పెట్టుబడులకు మార్గం సుగమం చేసింది.

సత్య నాదెళ్ల ఈ భేటీలో భారత్‌లో 17.5 బిలియన్ అమెరికన్ డాలర్లు, అంటే సుమారు రూ.1.5 లక్షల కోట్ల భారీ పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించారు. ఆసియా ఖండంలో మైక్రోసాఫ్ట్ పెట్టబోయే పెట్టుబడులలో ఇది ఇప్పటివరకు నమోదైన అత్యంత పెద్ద పెట్టుబడి కావడం విశేషం. భారత ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తున్న AI అభివృద్ధి కార్యక్రమాలకు ఈ పెట్టుబడి నేరుగా సంబంధించినదని నాదెళ్ల తెలిపారు.

Advertisement

భారతదేశం ప్రపంచంలోనే వేగంగా ఎదుగుతున్న డిజిటల్ ఆర్థిక వ్యవస్థగా నిలుస్తోందని, ఇక్కడి యువతలో అపారమైన ప్రతిభ ఉందని సత్య నాదెళ్ల పేర్కొన్నారు. కృత్రిమ మేథస్సు రంగంలో భారత్‌ నడక వేగవంతం అవుతోందని, ఈ దిశలో మైక్రోసాఫ్ట్ కూడా కీలకంగా పనిచేస్తుందని ఆయన చెప్పారు.

భారతదేశం ఏఐ రంగంలో చేస్తున్న ప్రయాణం అభినందనీయం. దేశ ఆశయాలకు మద్దతుగా మైక్రోసాఫ్ట్ 17.5 బిలియన్ డాలర్లు పెట్టుబడిగా పెడుతోంది. ఏఐ ప్రథమ తరానికి అవసరమైన మౌలిక సదుపాయాల నిర్మాణం, నైపుణ్యాభివృద్ధి, సామర్థ్యాల పెంపు కోసం ఈ పెట్టుబడి వినియోగించబడుతుంది అని సత్య నాదెళ్ల ఎక్స్‌ వేదికగా ప్రకటించారు.

Advertisement

ఈ పెట్టుబడితో దేశవ్యాప్తంగా నూతన డాటా సెంటర్లు, క్లౌడ్ మౌలిక వసతుల విస్తరణ, ఎఐ స్కిల్ ట్రైనింగ్ కార్యక్రమాలు, స్టార్టప్‌లకు మద్దతు, ఇన్నోవేషన్ హబ్బులు వంటి పలు కార్యక్రమాలు ముందుకు సాగనున్నాయి.

సత్య నాదెళ్లతో జరిగిన భేటీ ఎంతో ఫలప్రదమైందని, భారత యువతకు మైక్రోసాఫ్ట్ అందిస్తున్న అవకాశాలు అభినందనీయం అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భారతదేశం AI రంగంలో ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోందని, రాబోయే సంవత్సరాల్లో ఇది భారత్‌కు భారీ అవకాశాల ద్వారాలు తీసుకువస్తుందని మోదీ అన్నారు. మైక్రోసాఫ్ట్ ఇప్పటివరకు ఆసియాలో అతిపెద్ద పెట్టుబడిని భారతదేశంలో చేయబోతోందని చూడటం సంతోషాన్నిస్తుందని తెలిపారు.

“భారతీయ యువత నూతన ఏఐ ఆవిష్కరణలతో ప్రపంచాన్ని మెప్పిస్తారని నమ్ముతున్నాను. మైక్రోసాఫ్ట్ పెట్టుబడి ఈ ప్రయాణాన్ని మరింత వేగవంతం చేస్తుంది” అని మోదీ ఎక్స్‌లో వ్యాఖ్యానించారు.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచంలో ముందంజలో నిలవాలన్న భారత్ సంకల్పానికి.. మైక్రోసాఫ్ట్ పెట్టుబడి మరింత బలం చేకూరుస్తుందని చెప్పాలి. విద్య, వైద్యం, వ్యవసాయం, రవాణా, తయారీ రంగాల్లోనూ ఏఐ ఆధారిత పెద్ద మార్పులు చోటు చేసుకోనున్నాయి.

Also Read: 90 శాతం సర్పంచ్ సీట్లు కాంగ్రెస్‌దే.. టీపీసీసీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు!

దేశ భవిష్యత్తు సాంకేతికతలలో పెట్టుబడులు పెరుగుతుండటం.. భారత ఆర్థిక వ్యవస్థకు ఒక శుభ సూచికంగా విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు.

Related News

ఆర్మీ రహస్యాలు చైనాకు లీక్.. జమ్ము కాశ్మీర్‌లో తెలంగాణ మహిళ అరెస్ట్!

చనిపోయింది నూడిల్స్ వల్ల కాదట.. అసలు నిజం తెలిసి పోలీసులే షాక్!

ఐక్యరాజ్యసమితిలో ఉద్యోగం.. డిగ్రీ చేసినవారికి సూపర్ అవకాశం.. అర్హతలు ఇవే

ఆలయంలో ఓ లారీ బీభత్సం, 12 మంది మృతి-30 మందికి గాయాలు, గ్వాలియ‌ర్‌లో ఘటన

దుర్గా మండపం కూలిన ఘటన..19 మంది మృతి, 25 మందికి గాయాలు, కోల్‌కత్తాలో ఘటన

రిలయన్స్, బ్లింకిట్, జొమాటో సిబ్బందిపై కేసు నమోదు.. ఎందుకంటే..?

మాజీ సీఎం కోసం.. 9 హత్యలు చేశా.. లైవ్‌లో ఒప్పుకున్న ఎమ్మెల్యే!

రాత్రి నూడుల్స్.. ఉదయానికి శవాలు.. ఒకే కుటుంబంలో 5 గురు మృతి!

Big Stories

Advertisement
×