E-Paper
Advertisement

Pakashala Pantham : రమ్యకృష్ణ – ఐశ్వర్య రాజేష్ ‘పాకశాల పంతం’… పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్

Pakashala Pantham : రమ్యకృష్ణ – ఐశ్వర్య రాజేష్ ‘పాకశాల పంతం’… పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్
Advertisement

Pakashala Pantham : పవర్ ఫుల్ రోల్స్ కు కేరాఫ్ అడ్రస్ రమ్యకృష్ణ. రొమాంటిక్ రోల్స్ తో పాటు లేడీ ఓరియెంటెడ్ రోల్స్ తో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది ఐశ్వర్య రాజేష్. ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్న ఈ ఇద్దరు హీరోయిన్లు కలిసి చేస్తున్న సినిమానే ‘పాకశాల పంతం’. తాజాగా ఈ మూవీ లాంచ్ ఘనంగా జరిగింది.

‘పాకశాల పంతం’ లాంచ్ 

Advertisement

‘కొల్లా’ సమర్పణలో ‘ఈటీవీ ఒరిజినల్స్’ నిర్మిస్తున్న మూవీ ‘పాకశాల పంతం’. ఈ సినిమా పూజా కార్యక్రమం ఈరోజు హైదరాబాద్ లో జరిగింది. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కు కరణ్ తుమ్మకొమ్మ దర్శకత్వం వహిస్తుండగా, ప్రవీణ్ కొల్లా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. చంద్రశేఖర్ మహదాస్ సహ నిర్మాత కాగా, ‘పాకశాల పంతం’ చిత్రంలో సీనియర్ నటి రమ్యకృష్ణ, స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ మెయిన్ లీడ్స్ గా నటిస్తున్నారు. సమీరా భరద్వాజ్, రాకేష్ రాచకొండ, మాయా నెల్లూరి, సంజయ్ స్వరూప్, మహత్ రాఘవేంద్ర, ఎస్.ఎస్. కాంచీ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కాగా మూవీ లాంచ్ సందర్భంగా రమ్యకృష్ణ, ఐశ్వర్య రాజేష్ సినిమా పూజా కార్యక్రమానికి హాజరై సందడి చేశారు. ఈ సినిమాకు ఆర్‌.హెచ్‌. విక్రమ్ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే మూవీ రెగ్యులర్ షూటింగ్ షురూ కానుంది.

కథ నేపథ్యం ఇదేనా ?

Advertisement

అత్తాకోడళ్ల గిల్లికజ్జాల టైప్ కథతో తెరకెక్కబోతున్న ఈ మూవీ ఫ్యామిలీ ఆడియన్స్ కు పక్కా మంచి ట్రీట్ అవుతుంది. టైటిల్ పోస్టర్ ను చూస్తుంటేనే ఆ విషయం స్పష్టంగా అర్థం అవుతోంది. ఆ పోస్టర్ లో కిచెన్ లో ఉండే వంట సామగ్రి, పొగలు కక్కుతున్న వేడి వేడి వంటకాలు కన్పించడం ఆసక్తికరంగా అన్పిస్తోంది. చూస్తుంటే ఈ వంట గదిలోనే రమ్యకృష్ణ, ఐశ్వర్య రాజేష్ మధ్య అంట్ల గొడవలు మొదలయ్యేలా కన్పిస్తోంది. ఏదేమైనా నిర్మాతలు టైటిల్ పోస్టర్ తోనే సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యారు. ఇక మూవీ థియేట్రికల్ రిలీజ్ డేట్ ను మేకర్స్ త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు.

ఈ ఏడాది మొదట్లో ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి బ్లాక్ బస్టర్ సినిమాను తన ఖాతాలో వేసుకుంది ఐశ్వర్య రాజేష్. దీంతో ఆమె అభిమానులు నెక్స్ట్ మూవీ గురించి ఈగర్ గా వెయిట్  చేస్తున్నారు. ప్రస్తుతం ఐశ్వర్య రాజేష్ ఖాతాలో ఈ మూవీతో పాటు రెండు తమిళ సినిమాలు, మరో కన్నడ మూవీ కూడా ఉంది. ఇక రమ్యకృష్ణ విషయానికొస్తే… రామ్‌గోపాల్ వ‌ర్మ తెర‌కెక్కిస్తున్న ‘పోలీస్ స్టేష‌న్ మే భూత్’ అనే సినిమాలో నటిస్తోంది. ఇటీవలే మూవీ నుంచి ఆమె ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా, అందరూ స్టన్ అయ్యారు.  మ‌నోజ్ బాజ్‌పాయ్, జెనీలియా ఇందులో కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది.

Read Also : తనూజాకు ఝలక్ ఇచ్చిన కళ్యాణ్… అమ్మను కాపాడుకోలేకపోయిన ఇమ్మూ… టార్గెట్ అయ్యి తల్లడిల్లిన సంజన

Related News

టాక్సిక్ ..500కోట్లు అయ్యే పనేనా ?

మా ఆయన కోసమే గాయమైనట్టుంది… పెళ్లి తర్వాత మూడు నెలలు కలవలేదంటూ!

శ్రీకృష్ణుడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు క్రేజీ రీమేక్ ప్లాన్

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

Big Stories

Advertisement
×