E-Paper
Advertisement

Bus: బస్సు డ్రైవర్‌కు గుండెపోటు.. స్టీరింగ్ పట్టుకున్న విద్యార్థిని.. తప్పిన పెను ప్రమాదం

Bus: బస్సు డ్రైవర్‌కు గుండెపోటు.. స్టీరింగ్ పట్టుకున్న విద్యార్థిని.. తప్పిన పెను ప్రమాదం
Advertisement

Bus: స్కూల్ బస్సు డ్రైవర్‌కు గుండెపోటు రావడంతో.. ఓ విద్యార్థిని అప్రమత్తంగా వ్యవహరించి స్టీరింగ్ పట్టుకొని విద్యార్థుల ప్రాణాలు కాపాడింది. ఈ ఘటన గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో చోటుచేసుకుంది.

శనివారం సాయంత్రం భరద్ పాఠశాలకు చెందిన బస్సు విద్యార్థులతో వెళ్తుండగా.. ఒక్కసారిగా డ్రైవర్‌కు గుండెపోటు వచ్చింది. దీంతో స్టీరింగ్ వదిలేసి పక్కకు వరిగిపోయాడు. ఈక్రమంలో అదుపు తప్పిన బస్సు ఎదురుగా వస్తున్న వాహనాలను ఢీ కొట్టింది. అలాగే రోడ్డు పక్కన ఉన్న ఓ కరెంట్ స్థంభాన్ని ఢీ కొనబోతుండగా.. పక్కనే ఉన్న భార్గవి వ్యాస్ అనే విద్యార్థిని తెలివిగా వ్యవహరించి స్టీరింగ్ పట్టుకొని బస్సును నియంత్రించింది. దీంతో పెను ప్రమాదం తప్పింది.

Advertisement

ప్రమాదం జరిగిన సమయంలో డ్రైవర్ పక్కనే కూర్చున్నానని.. ఆ సమయంలో ఏం జరుగుతుందో అర్థం కాలేదని భార్గవి తెలిపింది. గొండాల్ రోడ్డు వద్దకు రాగానే డ్రైవర్ మాటలు తడబడడంతో పాటు.. అతని ముక్కులో నుంచి రక్తం వచ్చిందని.. వెంటనే కిందపడిపోయాడని చెప్పింది. వెంటనే తాను స్థీరింగ్ పట్టుకొని కరెంట్ స్థంభానికి ఢీ కొనకుండా ఆపానని వివరించింది.

ఇక స్థానికులు డ్రైవర్‌ను ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో విద్యార్థులకు ఎటువంటి గాయాలు కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Tags

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×