BigTV English

School Bag Policy: బ్యాగ్ లేకుండానే స్కూల్‌కి.. మధ్యప్రదేశ్‌లో వారానికోసారి అమలు..

School Bag Policy: బ్యాగ్ లేకుండానే స్కూల్‌కి.. మధ్యప్రదేశ్‌లో వారానికోసారి అమలు..

Schools In Madhya Pradesh To Go ‘Bag Less’ Once A Week : పాపం పిల్లలు.. బడికెళ్లాలంటే బోలెడు పుస్తకాలు మోసుకెళ్లాలి. విద్యార్థులకు ఆ ‘బరువు’ బాధ్యతలను తప్పించాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇకపై వారానికోసారి బ్యాగులు లేకుండానే స్కూళ్లకు వెళ్లే అవకాశం కల్పించనుంది. ‘బ్యాగ్ లెస్ స్కూల్ ’ను వచ్చే విద్యాసంవత్సరం నుంచే అమలు చేస్తున్నట్టు ప్రకటించింది. 1-12 తరగతుల విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు వెల్లడించింది.


‘బ్యాగ్ లెస్ స్కూల్’ ను పాటించే రోజు మాత్రం విద్యార్థులు ఎంచక్కా ఆటలు ఆడుకోవచ్చు. పాటలు పాడుకోవచ్చు. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు. మధ్యప్రదేశ్‌లోని అన్ని ప్రభుత్వ స్కూళ్లలోనూ ఈ ఆటవిడుపు అమలు అవుతుంది.

Read more:  రూ.350 కోట్ల హెరాయిన్ పట్టివేత..


అంతే కాదండోయ్.. ఏ ఏ తరగతి విద్యార్థికి స్కూల్ బ్యాగ్ బరువు ఎంతెంత ఉండాలన్నదీ ప్రభుత్వం స్పష్టం చేసింది. 1-2 తరగతి విద్యార్థులకు 1.6 కిలోల నుంచి 2.2 కిలోల వరకు బరువు మాత్రమే ఉండాలి. 3, 4, 5 తరగతుల విద్యార్థులకు బరువు 1.7-2.5 కిలోలు మించరాదు. 6, 7 తరగతి విద్యార్థులు 2-3 కిలోల వరకు బరువున్న బ్యాగ్‌లను మోయొచ్చు.

8వ తరగతిలో గరిష్ఠంగా 2.4-4 కిలోల మధ్య, 9, 10 తరగతుల విద్యార్థులకు 2.5 కిలోల నుంచి 4.5 కిలోల వరకు మాత్రమే బరువును అనుమతిస్తారు. ఇక 11, 12 తరగతి విద్యార్థుల బ్యాగ్‌ల బరువును వారి స్ట్రీమ్‌లను బట్టి ఆయా స్కూళ్ల మేనేజ్‌మెంట్ కమిటీలే నిర్ణయించాల్సి ఉంటుంది.

Related News

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Big Stories

×