E-Paper
Advertisement

Black Magic Allegation: టీడీపీ ఎమ్మెల్యేపై క్షుద్రపూజలు? ఇంటి ముందు నిమ్మకాయలు.. ఏపీలో తీవ్రకలకలం!

Black Magic Allegation: టీడీపీ ఎమ్మెల్యేపై  క్షుద్రపూజలు? ఇంటి ముందు నిమ్మకాయలు.. ఏపీలో తీవ్రకలకలం!
Advertisement

Black Magic Allegation: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో క్షుద్రపూజలు కలకలం రేపాయి. అధికార టీడీపీకి చెందిన ఓ ఎమ్మెల్యేపై గుర్తు తెలియని వ్యక్తులు బ్లాక్ మ్యాజిక్ కు యత్నించినట్లు ఒక్కసారిగా ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఘటన ఏపీలో తీవ్ర కలకలానికి దారి తీసింది. మూఢనమ్మకాలను విశ్వసించే వారు.. తమ ప్రతర్థులను టార్గెట్ చేసేందుకు క్షుద్రపూజలు వంటి వాటిని ఆశ్రయిస్తుంటారు. ఇందుకు సంబంధించి ఘటనలు నిత్యం వార్తల్లో చూస్తూనే ఉంటాం. అయితే ఇప్పుడు ఏకంగా ఒక ఎమ్మెల్యేపైనే దీనిని ప్రయోగించబోయారని వార్తలు రావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

వివరాల్లోకి వెళ్తే..

అనంతపురం జిల్లా శింగనమల టీడీపీ మహిళా ఎమ్మెల్యే బండారు శ్రావణి (MLA Bandaru Sravani)పై కొందరు వ్యక్తులు క్షుద్రపూజలకు యత్నించారని తెలుస్తోంది. నిన్న (శుక్రవారం) ఉదయం నిందితులు.. స్విఫ్ట్ కారులో వచ్చి ఎమ్మెల్యే శ్రావణి ఇంటి ముందు నిమ్మకాయలు, తెల్లనువ్వులు విసిరేశారు. దీనిని గమనించిన ఎమ్మెల్యే అనచురులు.. కారు వద్దకు పరిగెత్తుకు వెళ్లారు. దీంతో దుండగులు అప్రమత్తమై.. అక్కడి నుంచి పారిపోయారు. దుండగులు వాడిన కారు AP 39 KX 0986 అనే నెంబర్ కలిగి ఉందని.. గుంటూరుకు చెందిన ఓ మహిళ పేరిట అది రిజిస్టర్ అయినట్లు సమాచారం.

Advertisement

ఎమ్మెల్యే ఏమన్నారంటే?

ఇంటిముందు నిమ్మకాయలు, నువ్వులు పారేసిన ఘటనపై ఎమ్మెల్యే శ్రావణి స్పందించారు. ఇది తెలిసిన వారి పనే అని ఆరోపించారు. గత కొన్ని రోజులుగా తనపై ఇలాగే జరుగుతూ వస్తోందని తెలియజేశారు. ఫలితంగా తమ కుటుంబ సభ్యులు తరుచూ అనారోగ్యానికి గురవుతున్నట్లు చెప్పుకొచ్చారు. అయితే క్షుద్రపూజల కుట్ర వెనుక.. తన నియోజకవర్గానికే చెందిన ఓ అసంతృప్త నేత హస్తం ఉండొచ్చని ఎమ్మెల్యే వర్గం అనుమానిస్తోంది. ఎమ్మెల్యే ఫిర్యాదు ఆధారంగా ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితులను పట్టుకునేందుకు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని దర్యాప్తు అధికారులు స్పష్టం చేస్తున్నారు.

Advertisement

Also Read: WhatsApp MeeSeva: ఇకపై వాట్సాప్‌లోనే మీసేవ, సేవలు.. ఈజీగా ఈ సర్టిఫికెట్లు క్షణంలో ఇలా పొందొచ్చు, ప్రాసెస్ ఇదే!

బండారు శ్రావణి రాజకీయ ప్రస్థానం

ఇక బండారు శ్రావణి రాజకీయ ప్రస్థానానికి వస్తే.. టీడీపీలోని యువ ఎమ్మెల్యేలలో ఆమె కూడా ఒకరు. అనంతపురం జిల్లాకు చెందిన ఆమె.. హైదరాబాద్ లోని సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజీలో మాస్ కమ్యూనికేషన్స్ చేశారు. 2019 ఎన్నికల్లో టీడీపీ తరపున తొలిసారి బరిలోకి దిగి.. వైసీపీ అభ్యర్థి జొన్నలగడ్డ పద్మావతి చేతిలో ఓటమిపాలయ్యారు. అనంతరం 2024 అసెంబ్లీ ఎన్నికల్లో 8,788 తేడాతో తన ప్రత్యర్థిని ఓడించి.. తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు.

Also Read: Municipal Elections 2026: కారుకు జోష్.. కమలానికి బ్రేక్..? హస్తం పార్టీ సరికొత్త వ్యూహం వెనుక అసలు మతలబు ఇదే!

Related News

ఈసారి దక్షిణాది వంతు.. వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు, హైదరాబాద్‌లో అయితే..

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Gym Trainer: అమరావతిలో ఘోరం.. యువతి పై జిమ్ ట్రైనర్ లైంగిక దాడి కలకం

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

Big Stories

Advertisement
×