Shiva Sena ‘Sudhir Suri’ Shot Dead : పంజాబ్ అమృత్‌సర్‌లో శివసేన నేత సుధీర్ సూరి దారుణ హత్యకు గురయ్యారు. ఓ నిరసన కార్యక్రమంలో ఆయన పొల్గొంటుండగా.. గుంపులో నుంచి వచ్చి ఆయనపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో సుధీర్ చారి అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనతో పంజాబ్ ఉలిక్కిపడింది. పంజాబ్ బీజేపీ నేతలను, శివసేన నేతలు ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు.
మృతి చెందిన శివసేన నేత సుధీర్ సూరి కొన్ని రోజుల క్రితం ఓ వర్గంపై తీవ్ర పదజాలంతో దూషించారు. ఆ వర్గానికి సంబంధించిన వ్యక్తులు సుధీర్ సూరిని అప్పుడే హెచ్చారు. సుధీర్ పోలీసులకు సమాచారం అందించడంతో.. ఆయనకు భద్రత కూడా కల్పించారు పోలీసులు. సూధీర్ తమ హిట్‌లిస్ట్‌లో ఉన్నట్లు.. త్వరలోనే అంతమొందిస్తామని లేఖలు కూడా విడుదల చేశారు.
కాల్పులు జరిగిన కొన్ని నిమిషాలు ముందు సుధీర్ ఫేస్‌బుక్‌లో ఓ లైవ్ వీడియో చేశాడు. దాంట్లో ఆలయానికి సంబంధించిన విగ్రహాలు చెత్తకుప్పల్లో పడేసిన అంశంపై మాట్లాడాడు. ఈ వీడియోలో సుధీర్ ఓ వర్గంపై తీవ్ర పదజాలం ప్రయోగించాడు. కొన్ని గంటల ముందే.. అక్కడే ఉన్న కొందరు నిరసన గుంపు నుంచి బయటకు వచ్చి సుధీర్ సూరీ పై కాల్పులు జరిపారు.