Twitter Employee Response on Laid Off : ప్రపంచంలో ఉన్న హాట్ టాపిక్స్‌లో ట్విట్టర్ ఇప్పుడు టాప్ ప్లేస్‌లో ఉంది. గత వారం నుంచి ఎక్కడ చూసినా ట్విట్టర్ గురించే చర్చ. ట్విట్టర్లో సగం మందికి పైగా ఉద్యోగులను తొలగించారు. కాస్ట్ కటింగ్‌లో భాగంగా తప్పదని ట్విట్టర్ ప్రకటించుకుంది. అయితే ఇలా ఉద్యోగం కోల్పోయిన వ్యక్తుల్లో యశ్ అగర్వాల్ ఒకరు. ఎవరి ఉద్యోగమైనా పోతే వారు కుంగి పోవడమో లేక ఏదో కోల్పోయిన ఫీలింగ్‌లో ఉంటారు. యశ్ అగర్వాల్ అందుకు భిన్నంగా సోషల్ మీడియాలో తన అనుభవాన్ని షేర్ చేసుకున్నారు.
ట్విట్టర్ మాజీ ఉద్యోగి యశ్ అగర్వాల్ ట్విట్టర్లో ట్వీట్ చేస్తూ.. “ఇప్పుడే ట్విట్టర్ నన్ను ఉద్యోగంలోంచి తొలగించింది.. బర్డ్ యాప్ నాకు అరుదైన గౌరవాన్ని ఇచ్చింది. ట్విట్టర్‌లో పనిచేయడం నా అదృష్టం.. ట్విట్టర్లో పనిచేసిన అనుభవాలని..అక్కడున్న గొప్ప సంస్కృతిని నేను ఎప్పటికీ మర్చిపోలేను అన్నారు.
యశ్ అగర్వాల్ పెట్టిన పోస్ట్ పై నెటిజన్లు ఆసక్తికరమైన కామెంట్స్ చేస్తున్నారు. నువ్వు అద్భుతమైన వ్యక్తివి.. నీలాంటి వ్యక్తిని ట్విట్టర్ కలిగి ఉండడం అదృష్టం అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. నీకు ఉద్యోగం కావాలంటే నేనున్నానన్న విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. ఇక ఎలాన్ మస్క్.. చెప్పినట్లుగానే సగం పైగా ఉద్యోగులను మెమో జారీ చేశారు. సుమారు 3వే 800 మంది ప్రస్తుతం ట్విట్టర్ నుంచి బయటకు వచ్చేసినట్లు తెలుస్తోంది. కంపెనీ కాస్ట్ కటింగ్‌లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మెమోలో పేర్కొంది ట్విట్టర్ సంస్థ. ఉన్న ఉద్యోగుల్లో అనేక మందిని కూడా ఆఫీసు నుంచి ఇంటికి పంపించివేసి వర్క్ ఫ్రం హోం చేయిస్తున్నారు. భవనం, అకామడేషన్ ఖర్చులను తగ్గించుకోవడానికి మస్క్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్విట్టర్ వర్గాలు తెలిపాయి.