E-Paper
Advertisement

కర్ణాటక అధికార కాంగ్రెస్ పార్టీలో మార్పులు.. సీఎం బ్రేక్ ఫాస్ట్ భేటీ, సిద్దరామయ్య నుంచి ఆశీర్వాదం తీసుకున్న డీకే

కర్ణాటక అధికార కాంగ్రెస్ పార్టీలో మార్పులు.. సీఎం బ్రేక్ ఫాస్ట్ భేటీ, సిద్దరామయ్య నుంచి ఆశీర్వాదం తీసుకున్న డీకే
Advertisement

Bengaluru: కర్ణాటక అధికార పార్టీలో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. లీడర్ షిప్ మారుతుందని ఆ పార్టీ నేతలు ఓపెన్‌గా చెప్పలేదు. కాకపోతే జరుగుతున్న పరిణామాలు ఆ దిశగా సాగుతున్నాయి. తాజాగా సీఎం సిద్ధరామయ్య నుంచి డీకే శివకుమార్ ఆశీర్వాదం తీసుకోవడం, ఆ తర్వాత ఆలింగనం చేసుకోవడం వంటి ఫోటోలు బయటకు వచ్చాయి. దీంతో అధికార ప్రభుత్వంలో నాయకత్వం మార్పు ఖాయమైంది.

కర్ణాటక అధికార కాంగ్రెస్ పార్టీలో మార్పులు

Advertisement

కర్ణాటకలో నాయకత్వ మార్పుకు రంగం సిద్ధమైంది. సీఎం పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు సిద్ధరామయ్య. గురువారం ఉదయం సీఎం సిద్ధరామయ్య తన నివాసంలో కేబినెట్ మంత్రులతో బ్రేక్‌ ఫాస్ట్‌ మీటింగ్ ఏర్పాటు చేశారు. తన నిర్ణయాన్ని కేబినెట్ మంత్రులకు వివరించారు సిద్దరామయ్య.

కాబోయే కొత్త ముఖ్యమంత్రి ఎవరన్నది కాంగ్రెస్ పార్టీ హైకమాండ్‌ నిర్ణయం తీసుకుంటుందని ఆయన చెప్పినట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్పాయి. అదే సమయంలో సీఎం సిద్ధరామయ్య నుంచి డీకే శివకుమార్ ఆశీర్వాదం తీసుకోవడం, ఇరువురు నేతలు ఆలింగనం చేసుకోవడం జరిగిపోయింది. వాటికి సంబంధించిన ఫోటోలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు ఆ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

Advertisement

రాజీనామా చేసిన సీఎం సిద్ధరామయ్య..  సిద్దరామయ్య నుంచి ఆశీర్వాదం తీసుకున్న డీకే

సిద్ధరామయ్య రాజీనామా తర్వాత కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ బాధ్యతలు తీసుకోనున్నారు. గురువారం గవర్నర్‌తో సిద్ధరామయ్య అపాయింట్‌మెంట్ కోరినట్టు సీఎం కార్యాలయ వర్గాలు తెలిపాయి. అయితే గవర్నర్ అందుబాటులో లేకపోవడంతో గురువారం మధ్యాహ్నం బెంగుళూరుకు చేరుకుంటారని సమాచారం. ఆ తర్వాత గవర్నర్‌ని కలిసి తన రాజీనామా లేఖను సిద్ధరామయ్య అందజేయనున్నారు.

అదే సమయంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు డీకే శివకుమార్ ఓ లేఖను గవర్నర్‌కు ఇవ్వనున్నారు. డీకే కేబినెట్‌లో ఎవరెవరు ఉంటారు? ఎంతమంది మంత్రులు ఉండనున్నారు? ఇప్పుడున్న మంత్రుల శాఖలు మారే అవకాశం ఉంది. అదే సమయంలో సిద్ధరామయ్య కొడుకు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపడతారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ALSO READ: బక్రీద్ పండగ వేళ.. మేక ధర రూ. 2.4 లక్షలు, మరొకటి రూ.1.8 లక్షలు, ఎక్కడో తెలుసా?

అదే సమయంలో సిద్ధరామయ్య కర్ణాటక రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉంటారా? లేకుంటే జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెడతారా? అనే దానిపై రకరకాల ఊహాగానాలు లేకపోలేదు. మిగతా రెండేళ్లు ఆయన ఎమ్మెల్యేగా ఉంటారని, రాబోయే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాజ్యసభ ద్వారా జాతీయ రాజకీయాల్లోకి వెళ్లవచ్చని అంటున్నారు.

రెండురోజుల కిందట కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకేలు ఢిల్లీకి వెళ్లారు. దాదాపు 8 నుంచి 10 గంటలపాటు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్‌తో ఇరువురు నేతలు చర్చించారు. బుధవారం ఉదయం సీఎం, డిప్యూటీ సీఎంలు బెంగుళూరుకు చేరుకున్నారు.  మరోవైపు గురువారం సాయంత్రం ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారట సీఎం సిద్ధరామయ్య. కాంగ్రెస్ పెద్దలు పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే,  అగ్రనేతలు సోనియా‌గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను కలవనున్నట్లు తెలుస్తోంది.

Related News

స్పామ్, ఫ్రాడ్ కాల్స్‌ టెన్షన్‌కు ఇక చెక్.. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం?

ప్రపంచాన్ని సైతం కదిలించిన చరిత్ర.. అక్టోబర్ 17 ప్రత్యేకత ఏమిటో మీకు తెలుసా..?

డేంజర్ బెల్స్.. ఏఐతో భారీగా పర్యావరణం విధ్వంసం.. ఎలానో తెలుసా..?

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. అభిజిత్ దీప్కే ‘తిరంగా యాత్ర’ అడ్డుకున్న పోలీసులు.. ఇంటికెళ్లి నోటీసులు అందజేత!

అమ్మబాబోయ్.. 75 ఏళ్ల తాతతో 30 ఏళ్ల యువతి పెళ్లి.. నిశ్చితార్థం వీడియో వైరల్!

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. రైల్వేలో 1,688 ఖాళీలు, సాలరీ, దరఖాస్తు పూర్తి వివరాలివిగో

నా ఇంటి చుట్టూ నిఘా పెట్టారు.. ఏ క్షణమైనా అరెస్ట్ చేయవచ్చు, సీజేపీ ఫౌండర్ అభిజిత్ దీప్కే

ఉక్రెయిన్ యుద్ధభూమిలో ఎలాన్ మస్క్ బిగ్ ట్విస్ట్..?

Big Stories

Advertisement
×