Vaibhav Sooryavanshi: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో Indian Premier League 2026 Tournament) అత్యంత భయంకరమైన ఆటగాడిగా 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi) నిలిచాడు. 13 ఏళ్ల వయసులోనే ఐపీఎల్లోకి ఎంట్రీ ఇచ్చిన వైభవ్, ఇప్పుడు వరల్డ్ క్లాసు బౌలర్లను కూడా వణుకిస్తున్నాడు. భువనేశ్వర్ కుమార్, హెజెల్ వుడ్, పాట్ కమిన్స్, బుమ్రా, మిచెల్ స్టార్క్ లాంటి భయంకరమైన బౌలర్ల బౌలింగ్ ను కూడా చీల్చి చెండాడాడు వైభవ్ సూర్యవంశీ. ఇక ఎలిమినేటర్ మ్యాచ్ సందర్భంగా నిన్న సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు నిద్ర లేకుండా చేశాడు. రాత్రుళ్ళు కూడా హైదరాబాద్ బౌలర్లు భయపడేలా నరకం చూపించాడని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే ఇంతలా బౌలర్లను భయపెట్టించిన రాజస్థాన్ రాయల్స్ 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్య వంశీని రాహుల్ ద్రావిడ్ తెరపైకి తీసుకువచ్చాడని అందరూ అంటూ ఉంటారు. కానీ అసలు వాస్తవం అది కాదు.
Also Read: Vaibhav-Parag: వైభవ్ పెద్ద హీరో ఏం కాదు..అసూయ బయటపెట్టిన రియాన్ పరాగ్, ఇదిగో షాకింగ్ వీడియో
ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంటుకు వైభవ్ సూర్యవంశీని పరిచయం చేసింది రాహుల్ ద్రావిడే కాదు. ఈ కీలక రోల్ చేసింది మరో స్టార్ ఆటగాడు. బీహార్ మాజీ స్పిన్నర్, రాజస్థాన్ రాయల్స్ నెట్ బౌలర్ సమర్ ఖాద్రి ( Samar Qadri) అనే వ్యక్తి.. బీహార్ వీధుల్లో తిరిగి మరి 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ తీసుకువచ్చాడు. అప్పట్లో బీహార్ లో ఒక లోకల్ మ్యాచ్ జరిగిందట. ఈ సందర్భంగా వైభవ్ సూర్యవంశీ భయంకరమైన సిక్సర్లతో రెచ్చిపోయినట్లు సమాచారం. అయితే అతని సిక్సర్ లను చూసిన సమర్ ఖాద్రి, ఫిదా అయ్యాడట. ఈ క్రమంలోనే ఓసారి రాజస్థాన్ రాయల్స్ మాస్టర్ మైండ్ జుబిన్ టాలెంటెడ్ ప్లేయర్లను గుర్తించాలని సమర్ కు సూచనలు చేయగా… ఆయన వైభవ్ సూర్యవంశీ పేరును చెప్పినట్లు నివేదికల ద్వారా తెలుస్తోంది.
చెన్నైలో స్కౌటింగ్ ట్రయల్ లో ఈ 15 ఏళ్ల వైభవ సూర్యవంశీ, 60 బంతుల్లోనే 150 పరుగులు చేశాడు. 150 కిలోమీటర్ల స్పీడ్ తో వచ్చిన బంతులను అవలీలగా సిక్సర్లను కొట్టాడు. ఇదంతా 2024 కంటే ముందే జరిగింది. ఈ క్రమంలోనే 1.10 కోట్ల రూపాయలు పెట్టి ఐపీఎల్ వేలంలో కొనుగోలు చేసింది రాజస్థాన్ రాయల్స్. వైభవ్ అద్భుతంగా ఆడతాడని రాహుల్ ద్రవిడ్ కూడా యాజమాన్యానికి చెప్పాడట. ఈ క్రమంలోనే వేలంలో కొనుగోలు చేశారు. అప్పుడు తీసుకున్న ఒక్క నిర్ణయం కారణంగా రాజస్థాన్ రాయల్స్ జట్టు ఇప్పుడు బలంగా తయారైంది. వైభవ్ సూర్య వంశీ ఒక్కడి వల్ల క్వాలిఫైయర్ దాకా రాజస్థాన్ రాయల్స్ వెళ్లగలిగింది. రేపు ఫైనల్స్ లో కూడా వైభవ్ సెంచరీ చేసే ప్రమాదం ఉంది. ఒకవేళ రాజస్థాన్ రాయల్స్ నుంచి బయటకు వెళితే, వేలంలో అతడికి 30 కోట్లు పెట్టి ఇతర ఫ్రాంచైజీలు కొనుగోలు చేసిన ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు.
Also Read: Abdul Razzaq: PSL అల్లా కంటే పవిత్రమైనది..ఐపీఎల్ అతిపెద్ద ఫిక్సింగ్ హబ్ Abdul Razzaq: PSL
Whilst appreciating Vaibhav Sooryavanshi, let’s not forget to Jharkhand player Samar Qadri, who scouted and recommended his name to RR for trials. Spotting a talent is one thing, but backing them against conventional notion at such a young age is what has made this story so… pic.twitter.com/z257VBNwlL
— Priyank Panchal (@PKpanchal09) May 27, 2026