Meta : మెటా సీఈవో మార్క్ జూకర్ బర్గ్ సంచలన ప్రకటన చేశారు. ఆ సంస్థ ఉద్యోగులకు షాక్ ఇచ్చారు. బుధవారం ఉదయం నుంచి కంపెనీ ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ధృవీకరించారు. మెటాలో భారీ సంఖ్యలో ఉద్యోగుల్ని తొలగించే అవకాశం ఉందని అంతకుముందే వాల్‌స్ట్రీట్ జర్నల్ కథనం ప్రచురించింది. కంపెనీ తీసుకున్న తప్పుడు నిర్ణయాలకు ఉద్యోగులను తొలగించాల్సి వస్తుందని పేర్కొంది. అయితే వాల్ స్ట్రీట్ జర్నల్ కథనాన్ని మెటా సంస్థ ఖండించింది.
మెటాలో 87 వేల మందిపైగా ఉద్యోగులు ఉన్నారు. వారంతా వివిధ విభాగాల్లో విధుల నిర్వహిస్తున్నారు. ఉద్యోగులను తొలగించే చర్యలు చేపట్టామని తాజా సమావేశంలో జుకర్ బర్గ్ ప్రకటించారు. కానీ ఎంత మందికి పింక్ స్లిప్ ఇచ్చే అవకాశం ఉందో తేల్చలేదు. రిక్రూటింగ్, బిజినెస్ టీమ్ ఉద్యోగులను ఎక్కువగా తొలగించే అవకాశం ఉందని సమాచారం. ఉద్యోగాలు కోల్పోయే సిబ్బందికి కనీసం 4 నెలల జీతాన్ని అందిస్తామని మెటా హెచ్‌ఆర్ విభాగం ప్రకటించింది. కంపెనీ 18 ఏళ్ల చరిత్రలో భారీగా ఉద్యోగాలను తొలగించడం ఇదే తొలిసారి .
ఉద్యోగుల తొలగింపునకు అనేక కారణాలున్నాయి. ఆర్ధిక మాంద్యం కారణంగా సంస్థలు అడ్వటైజ్‌మెంట్‌లకు కోసం పెట్టే ఖర్చును తగ్గించుకుంటున్నాయి.మెటా సంస్థ ఇదే బాటలో పయనిస్తోంది. టిక్‌టాక్ నుంచి పోటీ ఎక్కువగా ఉంది. యాపిల్ ప్రైవసీ పాలసీలో మార్పులు చేయడం మెటాకు ఇబ్బందిగా మారింది.వరుస వివాదాల కారణంగా సంస్థపై నియంత్రణ వంటి అంశాలు ప్రభావం చూపాయి. దీంతో
మెటాలో ఉద్యోగుల‍్ని తొలగించాల్సిన పరిస్థితి ఎదురైంది.