Ahmedabad Plane Crash : ఒక్కరూ మిగల్లేదు. విమానంలో ఉన్న 242 మంది మృతి చెందారు. డెడ్‌బాడీస్ సైతం గుర్తు పట్టలేకుండా కాలి పోయాయి. పీస్ పీస్ అయ్యాయి. ఫ్లైట్ పడిన మెడికల్ కాలేజ్ బిల్డింగ్‌లో మరో 20 మందికి పైగా చనిపోయారు. మొత్తం మృతుల సంఖ్య 300 వరకు ఉండొచ్చని అంటున్నారు. విమానంలో ఇంధనం ఫుల్‌గా ఉండటంతో భారీ పేలుడు జరిగింది. చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా మంటలు వ్యాపించి మరింత డ్యామేజ్ చేశాయి.
ఏడాదిలో రెండు సార్లు..
ఎయిర్ ఇండియా నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమైందా? విమానం కుప్పకూలడానికి మెయింటనెన్స్ ఇష్యూనే కారణమా? ఇప్పుడీ ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గతంలోనూ ఇదే విమానంలో రెండు సార్లు ప్రమాదం చోటుచేసుకుందని తెలుస్తోంది. గత డిసెంబర్‌లో ప్యారిస్ వెళుతుండగా.. సాంకేతిక లోపంలో షార్జాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. డీజీసీఏ హెచ్చరించినా ఎయిరిండియా పట్టించుకోలేదని తెలుస్తోంది.
సాంకేతిక సమస్యలే కారణమా?
ప్రమాదం ఎందుకు, ఎలా జరిగిందన్న దానిపై వివరాలను పరిశీలిస్తున్నామని అన్నారు ఎయిరిండియా ఉన్నతాధికారులు. పూర్తి విషయాలు తెలిసిన తర్వాత విమాన ప్రమాదంపై స్పందిస్తామని ప్రకటించారు. అయితే, ఏవియేషన్ ఎక్స్‌పర్ట్స్ తమదైన శైలిలో విశ్లేషణలు మొదలుపెట్టారు. ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ టేకాఫ్ జరిగేముందే పూర్తి స్థాయిలో సాంకేతిక పరీక్షలు, అన్ని రకాల చెకింగ్స్ చేస్తారని చెబుతున్నారు. అంతా ఓకే అనుకున్నాకే టేకాఫ్ కు అనుమతిస్తారని అంటున్నారు. సో, ఇంజిన్ ఫెయిల్యూర్, నావిగేషన్ లోపం, వాతావరణం లాంటి సమస్యలు కాకపోవచ్చని అంచనా వేస్తున్నారు. మరేంటి? అహ్మదాబాద్ విమానం కుప్పకూలడానికి కారణం ఏమై ఉండొచ్చు?
పక్షి ఢీ కొట్టిందా?
విమాన ప్రమాదానికి పక్షులు కారణం కావొచ్చనేది ఎక్కువగా వినిపిస్తున్న విశ్లేషణ. AI-171 ఫ్లైట్ రన్ వే నుంచి సరిగ్గానే టేకాఫ్ అయింది. కానీ, కాసేపటికే కిందకు వేగంగా పడిపోవడం మొదలైంది. అంటే, టేకాఫ్ అయిన తర్వాత పక్షులు విమానాన్ని ఢీకొని ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు. పైగా పైలట్లు మేడే కాల్ సైతం ఇచ్చారు. ఆపద పరిస్థితుల్లో తాము ఉన్నామని.. సాయం చేయమని పైలట్లు కోరారు. ఇది కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. అహ్మదాబాద్ ఎయిర్‌పోర్ట్ ప్రాంతంలో నివాస గృహాలు, చెట్లు ఎక్కువగానే ఉన్నాయి. పక్షులు ఢీకొనే అవకాశం ఎక్కువగా ఉందని చెబుతున్నారు. అసలు కారణం పూర్తి స్థాయి దర్యాప్తు తర్వాతనే తెలుస్తుంది.
డొక్కు విమానం వల్లేనా..?
మరోవైపు, సోషల్ మీడియాలో ప్రస్తుతం ఓ వీడియో వైరల్‌గా మారింది. ప్రమాదం జరగడానికి ముందు ఢిల్లీ నుంచి అహ్మాదాబాద్‌కు వచ్చింది AI 171 విమానం. అయితే ఈ విమానంలో ఎలాంటి సదుపాయాలు లేవని ఓ ప్రయాణీకుడు ఫిర్యాదు చేశాడు. దానికి సంబంధించిన వీడియోలను పోస్ట్ చేశాడు.
I was in the same damn flight 2 hours before it took off from AMD. I came in this from DEL-AMD. Noticed unusual things in the place.Made a video to tweet to @airindia i would want to give more details. Please contact me. @flyingbeast320 @aajtak @ndtv @Boeing_In #planecrash #AI171 pic.twitter.com/TymtFSFqJo
— Akash Vatsa (@akku92) June 12, 2025