Shraddha Walker : శ్రద్ధా వాకర్ మర్డర్ కేసులో మరో కీలక విషయం బయటపడింది. మెహ్రౌలీ అటవీ ప్రాంతంలో దొరికిన శరీర భాగాలు శ్రద్ధవేనని డీఎన్ఏ రిపోర్ట్‌లో నిర్ధారణ అయింది. శ్రద్ధ తండ్రి వికాస్ డీఎన్ఏ నమూనాతో దొరికిన శరీర భాగాల డీఎన్ఏ పోలడంతో అవి శ్రద్ధవేనని పోలీసులు నిర్ధారణకు వచ్చారు.
ఉన్మాది అఫ్తాబ్.. శ్రద్ధాను 35 ముక్కలుగా కోసి ఢిల్లీలోని మెహ్రౌలీ అటవీ ప్రాంతంలో పడేసాడు. వాటిలో కేవలం 13 శరీరభాగాలను మాత్రమే ఢిల్లీ పోలీసులు కనుగ్గొన్నారు. మిగతా భాగాల కోసం పోలీసులు వెతుకుతున్నారు. అఫ్తాబ్ పూనావాలను ఉరి తీయాలని శ్రద్ధా వాకర్ తండ్రి వికాస్ డిమాండ్ చేస్తున్నారు. ముంబయి పోలీసులు సరైన సమయంలో స్పందించి ఉంటే.. తన కూతురు శ్రద్ధా వాకర్ బతికి ఉండేదని శ్రద్ధ తండ్రి వికాస్ ఆవేదన వ్యక్తం చేశారు.