BigTV English

Sikkim Assembly Election Result 2024: సిక్కిం శాసనసభ ఎన్నికల ఫలితాలు, అధికార పార్టీకే ఛాన్స్..

Sikkim Assembly Election Result 2024: సిక్కిం శాసనసభ ఎన్నికల ఫలితాలు, అధికార పార్టీకే ఛాన్స్..

Sikkim Assembly Election Result 2024: కట్టుదిట్టమైన భద్రతా చర్యలతో ఆదివారం ఉదయం 6 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మొదట పోస్టల్ బ్యాలెట్ లను లెక్కించిన కౌంటిగ్ సిబ్బంది ఆ ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో నమోదైన ఓట్ల లెక్కింపుపై దృష్టి సారించారు. అధికారి సిక్కిం క్రాంతికారి మోర్చా (SKM)ఎక్కవ మెజార్టీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2019 అసెంబ్లీ ఎన్నికల్లోసిక్కిం 17 సీట్లు గెలుచుకోగా, SDF 15 సీట్లు గెలుచుకుంది. రాష్ట్రంలో సిక్కిం మళ్లీ అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి.


కాగా ఏప్రిల్ 19న అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ జరిగింది. 32 అసెంబ్లీ నియోజకవర్గాలకు, ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్, పవన్ కుమార్ చామ్లింగ్, భారత ఫుట్‌బాల్ మాజీ కెప్టెన్ భైచుంగ్ భూటియా, తమాంగ్ భార్య కృష్ణ కుమారి రాయ్ సహా 146 మంది అభ్యర్థులు పోటీ చేసారు.

ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే కనీసం 17 సీట్లు సాధించాల్సి ఉంటుంది. 2019 ఎన్నికల్లో సిక్కిం 17 సీట్లు గెలుచుకోవడంతో సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ 25 ఏళ్ల ఆధిపత్యానికి తెరపడింది.


Also Read: అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో.. మెజార్టీ మార్క్‌ దాటిన బీజేపీ..

సిక్కిం అసెంబ్లీ ఎన్నికల్లో 2024లో 79.88 శాతం ఓటింగ్ నమోదైంది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఇది 81.43 శాతం. సిక్కిం క్రాంతికారి మోర్చా (SKM) రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో అధికారాన్ని నిలబెట్టుకోవడానికి సిద్ధంగా ఉంది, 32 అసెంబ్లీ స్థానాల్లో 4 స్థానాల్లో విజయం సాధించింది, పార్టీ 27 అదనపు స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.

SKM చీఫ్ ప్రేమ్ సింగ్ తమాంగ్ ప్రస్తుతం రెనాక్ అసెంబ్లీ నియోజకవర్గంలో తన సమీప SDF పోటీదారు సోమ్ నాథ్ పౌడియాల్‌పై సుమారు 6,443 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మాజీ సిఎం సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎస్‌డిఎఫ్) అధినేత పవన్ కుమార్ చామ్లింగ్ నామ్‌చేబంగ్ సీటులో ఎస్‌కెఎం అభ్యర్థి కంటే 1,852 ఓట్ల తేడాతో వెనుకంజలో ఉన్నారు.

Related News

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Big Stories

×