BigTV English

Arunachal Pradesh Results 2024: అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో.. మెజార్టీ మార్క్‌ దాటిన బీజేపీ..

Arunachal Pradesh Results 2024: అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో.. మెజార్టీ మార్క్‌ దాటిన బీజేపీ..

Arunachal Pradesh Assembly Election Results 2024: అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జూన్ 2న ఉదయం 6 గంటలకు ప్రారంభమైంది. అరుణాచల్ ప్రదేశ్‌లో ఏప్రిల్ 19న ఒకేసారి అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. మొత్తం 60 సీట్లలో 50 అసెంబ్లీ స్థానాలకు ఓట్ల లెక్కింపు జరుగుతోంది.


రాష్ట్రంలోని 24 కేంద్రాల్లో, లోక్‌సభ స్థానాలకు జూన్ 4న 25 కేంద్రాల్లో నిర్వహించనున్నారు. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఇప్పటికే బొమ్‌డిలా, చౌకం, హయూలియాంగ్, ఇటానగర్, ముక్తో, రోయింగ్, సాగలీ, తాలి, సహా 10 స్థానాల్లో విజయం సాధించింది. అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో తాలిహా, జిరో-హపోలి అసెంబ్లీ స్థానాల్లో మొత్తం 133 మంది అభ్యర్థులు పోటీ చేశారు.

Also Read: సార్వత్రిక ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఇవే..


అసెంబ్లీ ఎన్నికల్లో 82.71 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోగా, రాష్ట్రంలోని రెండు లోక్‌సభ స్థానాలకు 77.51 శాతం పోలింగ్ నమోదైంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 41 సీట్లు గెలుచుకుంది. జెడియు 7 స్థానాలు, ఎన్‌పిపి 5, కాంగ్రెస్ 4, పిపిఎ 1 సీటు, స్వతంత్ర అభ్యర్థులు 2 గెలుచుకున్నారు. 60 స్థానాలున్న అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు 31 సీట్లు అవసరం. అరుణాచల్ ప్రదేశ్ లో మధ్యాహ్నానికి తుది ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంటుందని సీఈవో(ఎన్నికల అధికారి) పవన్ కుమార్ తెలిపారు.

కాగా రాష్ట్రంలోని రెండు లోక్ సభ స్థానాలకు జరిగిన ఓట్ల లెక్కింపు జూన్ 4న 25 కేంద్రాల్లో నిర్వహించనున్నారు. అయితే 2019 లో కూడా బీజేపీనే ఎక్కువ మెజార్టీ దక్కించుకుంది. రెండు లోక్ సభ స్థానాలు.. 41 అసెంబ్లీ స్థానాల్లో గెలుచుకుంది.

Related News

Bengaluru: బెంగుళూరులో ప్రధాని.. వందే భారత్ రైళ్లు ప్రారంభం, ఆ తర్వాత రైలులో ముచ్చట్లు

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Big Stories

×