Singer KS Chithra : అయోధ్య ఆలయ మహోత్సవం సందర్భంగా ప్రముఖ గాయని చిత్రపై నెట్టింట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఈ నెల 22న అయోధ్యలో రామాలయ ప్రాణప్రతిష్టాపన జరగనుంది. ఈ సందర్భంగా ప్రజలు రామ నామాన్ని జపించాలని.. సాయంత్రం వేళ 5 ఒత్తుల దీపాన్ని వెలిగించాలని ఆమె దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. అలాగే ప్రతిఒక్కరికి దేవుడి ఆశీస్సులు అందాలని ప్రార్థించిన ఆమె.. లోక సమస్త సుఖినో భవంతు అంటూ సందేశాన్నిచ్చారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఈ వీడియోపై కొందరు నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.
చిత్ర సందేశంపై గాయకుడు సూరజ్ స్పందించారు.లోక సమస్త సుఖినో భవంతు అని చెప్పే వారి అమాయత్వమే ఇక్కడ గొప్ప విశేషమని.. మసీదును ధ్వంసం చేసి ఆలయాన్ని నిర్మించిన వాస్తవాన్ని ఉద్దేశపూర్వకంగా మరిచిపోతున్నారని వ్యంగంగా కామెంట్ చేశారు. అలాగే చిత్ర ఒక రాజకీయ పక్షంవైపు మొగ్గు చూపుతున్నారని మరికొందరు మండిపడుతున్నారు. అయితే మరో గాయకుడు వేణుగోపాల్ చిత్రను సమర్థించారు. తన అభిప్రాయాలను వ్యక్తీకరించే హక్కు, స్వేచ్ఛ ఆమెకు ఉన్నాయని.. తన మనోభావాలను దెబ్బతీసేలా వ్యాఖ్యానించడం బాధాకరమన్నారు వేణుగోపాల్.
గాయని చిత్రను కొందరు సమర్థిస్తుంటే.. మరికొందరు విమర్శిస్తున్నారు. ఈ అంశంపై నెట్టింట డైలాగ్ వార్ నడుస్తోంది.