BigTV English

Trump : ఒకే వేదికపై ట్రంప్‌, వివేక్.. అందుకేనా..?

Trump : ఒకే వేదికపై ట్రంప్‌, వివేక్.. అందుకేనా..?

Trump : తొలి ప్రైమరీ పోరులో విజయంతో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ వర్గం ఫుల్‌ జోష్‌లో ఉంది. ఆయనకు మరో నేత వివేక్ రామస్వామి నుంచి పూర్తి మద్దతు దక్కుతోంది. భారతీయ అమెరికన్ వివేక్ రామస్వామి అధ్యక్ష అభ్యర్థిత్వ రేసు నుంచి వైదొలిగారు.


ట్రంప్‌తో కలిసి వివేక్ వేదిక పంచుకున్నారు. దీంతో కార్యకర్తలు అందరూ ఉపాధ్యక్షుడు అంటూ ఉత్సాహంగా కేకలు వేశారు. అయోవాలో తొలి ప్రైమరీ పోరులో విజయం సాధించిన ట్రంప్‌.. న్యూ హాంప్‌షైర్‌లో ప్రచారంలో పాల్గొన్నారు. ఆ ప్రచారం మొత్తం ఇద్దరు నేతలు ఒకరినొకరు ప్రశంసించుకున్నారు.

ఈ సందర్భంగా వివేక్‌ మాట్లాడుతూ.. అధ్యక్ష రేసులో ట్రంప్ కంటే మెరుగైన వారు ఇంకొకరు లేరన్నారు. అందుకే అధ్యక్షుడిగా ట్రంప్‌కు ఓటు వేయాలని పిలుపునిచ్చారు. దీనిపై ట్రంప్‌ వివేక్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. వివేక్ ఆమోదం లభించడం తనకు గర్వంగా ఉందని ట్రంప్ పేర్కొన్నారు.


వివేక్ రామస్వామి తమతో కలిసి పని చేస్తారని ట్రంప్ పేర్కొన్నారు. చాలాకాలం పాటు తమతో కలిసి ముందుకుసాగుతారని వెల్లడించారు. రామస్వామి ప్రచారం తీరును ట్రంప్ ప్రశంసించారు. ఈ సందర్భంగా ‘ఉపాధ్యక్షుడు’ అంటూ మద్దతుదారులు పలుమార్లు నినాదాలు చేస్తుంటే.. వారిద్దరూ చిరునవ్వులు చిందించారు. ఆయన తన ఉపాధ్యక్ష సహచరుడిగా ఉంటారని ట్రంప్ సూచనప్రాయంగా వెల్లడించారు.

రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం పోటీపడిన వివేక్‌ తొలి ప్రైమరీ పోరులో పెద్దగా ప్రభావం చూపించలేకపోయారు. ఆ ఎన్నికల్లో కేవలం 7.7 శాతం ఓట్లు మాత్రమే ఆయనకొచ్చాయి. 51 శాతం ఓటింగ్‌తో అయోవా చరిత్రలో ట్రంప్‌ ఎన్నడూ లేనంత మెజారిటీని దక్కించుకున్నారు. ఇతర అభ్యర్థులు ఆయన దరిదాపుల్లో కూడా లేరు.

Related News

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Big Stories

×