Big Stories

Bomb Threats: పలు పాఠశాలలకు బాంబు బెదిరింపులు.. విదేశాల నుంచి మెయిల్స్..!

Bomb Threats: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో దేశంలో వరుస బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. మరోవైపు సరిహద్దు ప్రాంతాల వద్ద సైన్యంపై దాడులు కూడా జరగుతుండడంతో దేశంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవలే ఢిల్లీలోని పలు పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. తాజాగా ఇదే తరహాలో గుజరాత్ రాష్ట్రంలోని పలు పాఠశాలలకు కూడా ఇలాంటి బెదిరింపులే రావడంతో యావత్ భారతదేశం మరోసారి ఉలిక్కిపడింది.

- Advertisement -

పలువిడతల్లో దేశంలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో వరుస బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. ఇటీవలే దేశ రాజధాని ఢిల్లీలోని దాదాపు 200 పాఠశాలలకు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బాంబు బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. దీన్ని మరువక ముందే సోమవారం ఉదయం గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ లోని పలు పాఠశాలలకు ఇదే తరహాలో బాంబు బెదిరింపులు వచ్చాయి.

- Advertisement -

బాంబు బెదిరింపులు వచ్చిన వెంటనే ఈ పాఠశాలల యాజమాన్యాలు అప్రమత్తపై వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు హూటాహుటినా అక్కడికి చేరుకున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు పాఠశాలల వద్ద డాగ్ స్వ్కాడ్, బాంబ్ స్వ్కాడ్ సాయంతో తనిఖీలు చేపట్టారు.

అయితే పోలీసులు చేసిన తనిఖీల్లో బాంబు బెదిరింపులు వచ్చిన ఆ పాఠశాలల పరిధిలో ఎటువంటి అనుమానస్పద వస్తువులు, పదార్థాలు కనిపించకలేదని తెలిపారు. దీంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఈ బాంబు బెదిరింపులపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. దాదాపు ఆరు పాఠశాలలకు గుర్తు తెలియని వ్యక్తి నుంచి బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. రష్యా డొమైన్ నుంచి ఈ-మెయిల్స్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు.

గత బుధవారం ఢిల్లీలోని సుమారు 200 పాఠశాలలకు కూడా ఇదే తరహాలు రష్యా డొమైన్ నుంచి బాంబు బెదిరింపులు వచ్చినట్లు పోలీసులు గుర్తు చేశారు. ఆ రోజున కొన్ని పాఠశాలల్లో పరీక్షలు కూడా జరుగుతుండడంతో వాటిని మధ్యలో ఆపి మరీ.. విద్యార్థులను యాజమాన్యాలు ఇంటికి పంపాయి.

Also Read: అమేథిలో దారుణం, కాంగ్రెస్ పార్టీ.. కార్లపై దాడులు

అయితే ఢిల్లీ, అహ్మదాబాద్ బాంబు బెదిరింపులు రష్యాకు చెందిన మెయిల్ నుంచి రావడంతో రెండూ.. ఒకే వ్యక్తి పంపినట్లు పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బెదిరింపు మెయిల్ రష్యా డొమైన్ నుంచి రావడంతో దీనిపై వివరణ ఇవ్వాలంటూ భారత ప్రభుత్వం అక్కడి ప్రభుత్వాన్ని కోరినట్లు తెలుస్తోంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News