E-Paper
Advertisement

విద్యుత్తు స్తంభాన్ని ఢీ కొట్టిన కారు, ఆరుగురు సజీవ దహనం, యూపీలో షాకింగ్ ఘటన

విద్యుత్తు స్తంభాన్ని ఢీ కొట్టిన కారు, ఆరుగురు సజీవ దహనం, యూపీలో షాకింగ్ ఘటన
Advertisement

Car Hit Electric Pole: దేశంలో యాక్సిడెంట్ల సీజన్ మొదలైంది. శీతాకాలం రావడంతో దట్టమైన పొగ కారణంగా ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించలేదు. ఫలితంగా వాహనాలు ప్రమాదాలకు గురవుతున్నాయి. తాజాగా అలాంటి ఘటన యూపీలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో కారులోని ఆరుగురు వ్యక్తులు సజీవ దహనమయ్యారు. అసలు ఘటన ఎలా జరిగింది?

యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం

ఉత్తరప్రదేశ్‌ ముజఫర్‌నగర్ జిల్లాలో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. షామ్లీ హైవేపై విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టింది ఓ కారు. వెంటనే మంటలు కారుని చుట్టుముట్టాయి. ఈ ఘటనలో కారులోని ఆరుగురు వ్యక్తులు సజీవ దహనం అయ్యారు. ఈ విషయాన్ని ఆ జిల్లా పోలీసులు వెల్లడించారు. ఘటన గురించి సమాచారం అందిన వెంటనే పోలీసు సిబ్బంది అగ్నిమాపక బృందాలతో కలిసి ఘటన ప్రాంతానికి చేరుకున్నారు.

విద్యుత్ స్థంభాన్ని ఢీ కొట్టిన కారు, ఆరుగురు సజీవదహనం

Advertisement

వాహనాల్లోని బాధితులను జిల్లా ఆసుపత్రికి తరలించామని, అప్పటికే మరణించినట్టు వైద్యులు ప్రకటించారని వివరించారు జిల్లా అధికారులు. మృతులను ఇంకా గుర్తించాల్సి ఉందని, వారి గుర్తింపును నిర్ధారించి కుటుంబాలకు సమాచారం అందించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నట్లు ఓ అధికారి తెలిపారు.

ALSO READ: దీపావళి ఎఫెక్ట్.. డేంజర్ స్థాయిలో ఢిల్లీ వాయు కాలుష్యం, నాలుగు రాష్ట్రాల ప్రజలు ఉక్కిరిబిక్కిరి

Advertisement

ప్రాథమిక సమాచారం మేరకు.. బాధితులు హర్యానాలోని హిసార్ నుంచి హరిద్వార్ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. కారుకు నిప్పంటుకోవడంతో అందులోని ప్రయాణికులు చిక్కుకుపోయారని స్థానికులు తెలిపారు. వేగంగా వస్తున్న కారుకు, ఎదురుగా ఏముందో కనిపించకపోవడంతో ఈ ఘటన జరిగిందని అంటున్నారు.

 

 

Related News

దీపావళి ఎఫెక్ట్.. డేంజర్ స్థాయిలో ఢిల్లీ వాయు కాలుష్యం, నాలుగు రాష్ట్రాల ప్రజలు ఉక్కిరిబిక్కిరి

కూర రుచిగా లేదన్నందుకు.. కత్తితో పొడిచి భర్తను చంపి ఆ తర్వాత, అహ్మదాబాద్‌లో విచిత్ర ఘటన

4 లక్షల మందికి విందు, గుర్రాల రేసు, విజేతకు కారు బహుమతి.. కూతురు పెళ్లిలో ఎమ్మెల్యే హంగామా

పార్కింగ్ వివాదం.. సాఫ్ట్‌వేర్ కంపెనీ సీఓఓ దారుణ హత్య, 19 రౌండ్లు కాల్పులు

మావోయిస్టుల గడ్డపైకి ప్రధాని.. బలగాలతో కలిసి దీపావళి వేడుకలు.. ‘దిమాగీ నక్సల్స్’పై సంచలన వ్యాఖ్యలు!

దీపావళి ముందు తీవ్ర విషాదం.. రోడ్డుపై లేడీ డ్రైవర్ బీభత్సం.. బైకర్‌ను 30 మీటర్లు ఈడ్చుకెళ్లిన థార్!

నిద్రపోవడమే ఉద్యోగం.. 60 రోజులు నిద్రపోతూ రూ.9.6 లక్షలు సంపాదించిన యువతి

Big Stories

Advertisement
×