E-Paper
Advertisement

పాకిస్తాన్ ప్లేయ‌ర్ షూ లేస్ క‌ట్టిన టీమిండియా ప్లేయ‌ర్..షాకింగ్ వీడియో వైర‌ల్

పాకిస్తాన్ ప్లేయ‌ర్ షూ లేస్ క‌ట్టిన టీమిండియా ప్లేయ‌ర్..షాకింగ్ వీడియో వైర‌ల్
Advertisement

IND VS PAK:  ఆసియా కప్ అండర్ 19 2026 టోర్నమెంట్ లో (ACC Men’s U19 Asia Cup 2026 Tournament) భాగంగా టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ ( India U19 vs Pakistan U19, 8th Match) మధ్య కీలక మ్యాచ్ జరిగింది. ఇందులో అద్భుతంగా రాణించిన పాకిస్తాన్ అండ‌ర్ 19 టీమ్… టీమిండియాలో మూడు వికెట్ల తేడాతో చిత్తు చేసింది. సరిగ్గా 10 రోజుల కిందట హాంకాంగ్ సిక్సెస్ లో భాగంగా టీమిండియాను ఓడించిన పాకిస్తాన్…. ఇప్పుడు అండర్ 19 ఆసియా కప్ లోనూ ఓడించింది. దీంతో పది రోజుల్లో పాకిస్తాన్ చేతిలో రెండు సార్లు టీమిండియా ఓడిపోయింది.

అయితే ఆదివారం జరిగిన అండర్ 19 టీం ఇండియా వర్సెస్ పాకిస్తాన్ 8వ మ్యాచ్ సందర్భంగా పాకిస్తాన్ ఆటగాడు హుజైఫా ఆహ్స‌న్ షూ లేస్ ఊడిపోతే… టీమిండియా యువ క్రికెటర్ కిషన్ కుమార్ సింగ్ కట్టినట్టు ఓ వీడియో వైరల్ అవుతోంది. అయితే ఈ వీడియో వైరల్ అయిన నేపథ్యంలో టీమిండియా జట్టుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. షేక్ హ్యాండ్ కూడా ఇవ్వద్దని చెబితే.. ఇప్పుడు షూ లేస్ కట్టే వరకు దిగజారారా ? అంటూ అభిమానులు మండిపడుతున్నారు.

నిజంగానే పాకిస్తాన్ ప్లేయ‌ర్ షూ లేస్ టీమిండియా ప్లేయ‌ర్ క‌ట్టాడా?

Advertisement

ఆసియా కప్ అండర్ 19 టోర్నమెంట్ లో భాగంగా పాకిస్తాన్ బ్యాటర్ హుజైఫా ఆహ్స‌న్ షూ లేస్ ను టీమిండియా ఆటగాడు కిషన్ కుమార్ సింగ్ కట్టినట్టు వైరల్ అవుతున్న వీడియో నిజం కాదు. ఇది గతంలో జరగగా ఇప్పుడు వైరల్ చేస్తున్నారు. 2025 డిసెంబర్ లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య అండర్ 19 ఆసియా కప్ 2025 సందర్భంగా మ్యాచ్ జరిగింది. ఈ సందర్భంగా పాకిస్తాన్ ఆటగాడు హుజైఫా ఆహ్స‌న్ షూ లేస్ ఊడిపోయాయి.

Pakistan Team Former Captain Shahid Afridi Shocking Comments On Abhishek Sharma Goes Viral  నా కంటే అభిషేక్ భయంకరంగా ఆడుతున్నారు..ప్రతీ సిక్సర్ స్టేడియం బయటే పడుతోంది

Advertisement

అతని చేతులకు గ్లౌజ్ ఉండడంతో షూ లేస్ క‌ట్టు కోలేకపోయాడు. ఇది గమనించిన టీమిండియా లెఫ్ట్ ఆర్మ్ ఫేసర్ కిషన్ కుమార్ సింగ్ వెంటనే అతని వద్దకు వెళ్లి షూ లేస్ కట్టాడు. అయితే ఈ పాత వీడియోను ఇప్పుడు వైర‌ల్ చేస్తూ, నిన్న‌టి మ్యాచ్ సంద‌ర్బంగా జ‌రిగిన‌ట్టు చూపిస్తున్నారు. కానీ నిన్న‌టి మ్యాచ్ లో హుజైఫా ఆహ్స‌న్, కిష‌న్ కుమార్ సింగ్ (kishan Kumar singh) ఇద్ద‌రూ ఆడ‌లేదు. ఆడ‌కున్నా ఆడిన‌ట్టు ఫేక్ వీడియోలు పెట్టి భార‌త ప‌రువు తీసే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఈ విష‌యం తెలియ‌క భార‌త క్రికెట్ ఫ్యాన్స్.. కిష‌న్ కుమార్ సింగ్ ను బండ బుతూలు తిడుతున్నారు.

Harbhajan Singh Reaction On Ricky Ponting smashes World Cup-winning ton vs India: 2003 వ‌ర‌ల్డ్ క‌ప్ లో పాంటింగ్ ను క్లీన్ బౌల్డ్ చేసేవాడిని…కానీ గంగూలే ప్లాన్ చెడ‌దొబ్బాడు

 

?utm_source=ig_web_copy_link&xtok=NTc4MTIwNjQ2YQ==

Related News

ఛీ.. మీది ఓ గెలుపేనా? 35 ఏళ్ల అలీ రజాను తీసుకొచ్చి టీమిండియా కుర్రాళ్ల‌ను ఓడించారు

దీపావ‌ళి రోజున 150 కోట్ల భార‌తీయుల‌కు నిద్ర‌లేకుండా చేశాం…త‌న్వీర్ అహ్మ‌ద్ సంచ‌ల‌నం!

దీపావ‌ళి రోజున అడ్డంగా దొరికిన ధోని భార్య సాక్షి..రొమాంటిక్ ఫోటోలు లీక్!

ఒరేయ్ ర‌జ‌త్ పాటిద‌రా.. RCB కోసం టీమిండియా ఛాన్స్ వ‌దులుకుంటావా?- హర్ష భోగ్లే ఫైర్‌

అర్థ సెంచ‌రీ అని రాసి శ‌త‌కం బాదేశాడు.. పాక్ ప్లేయ‌ర్ ‘పేప‌ర్ నోట్’ సెల‌బ్రేష‌న్ వైర‌ల్

సెంచ‌రీతో చెల‌రేగిన హంజా జహూర్…పాకిస్తాన్ చేతిలో టీమిండియా ఘోర ఓట‌మి

టీమిండియా కొంప‌ముంచిన నో-బాల్…పాకిస్తాన్, అంపైర్ల మ‌ధ్య ఫిక్సింగ్ అంటూ!

Big Stories

Advertisement
×