BigTV English

Smart Phones:ఈ దేశాలు స్మార్ట్ ఫోన్లకు బానిసలు

Smart Phones:ఈ దేశాలు స్మార్ట్ ఫోన్లకు బానిసలు

Smart Phones using countries survey China occupaid first place


స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి వచ్చాక మన నిత్యజీవన విధానంలో అంతర్భాగమైపోయాయి. ఎంతలా ఉంటే మన పరిసరాలను సైతం గమనించనంత స్థాయిలో..ఇంటికి ఎవరైనా చుట్టం వచ్చినా సరే పట్టించుకోనంత పరిస్థితికి తీసుకొచ్చాయి స్మార్టు ఫోన్లు. ఆరు నెలల పిల్లాడు సైతం స్మార్ట్ ఫోన్ చేతికి ఇవ్వకపోతే గుక్కపట్టి ఏడ్చేస్తాడు. రేడియోలు కాస్తా టీవీలు వచ్చాక కనుమరుగయ్యాయి. ఇప్పుడు టీవీ కార్యక్రమాలు కూడా మొబైల్ ఫోన్ లోనే చూసేస్తున్నారు జనం వార్తలు కావాలన్నా, వినోదం చూడాలన్నా స్మార్ట్ ఫోన్ వాడాల్సిందే. ఒక పక్క చేతిలో ఫోన్ పట్టుకునే ఇంటి ఇల్లాలు వంట చేస్తూ ఉంటుంది. సెల్ ఫోన్ చూసుకుంటూనే భోజనం చేసేస్తున్నారు భర్తలు, పిల్లలు తాము ఏం తిన్నామో కూడా తెలియనంతగా. పొద్దున్న లేచినప్పటినుంచి రాత్రి పడుకోబోయేదాకా మన చేతికి హస్త భూషణంగా మారిపోయింది సెల్ ఫోన్. అయితే ప్రఖ్యాత మెక్ గిల్ విశ్వవిద్యాలయం ప్రపంచ వ్యాప్తంగా ఓ సర్వే నిర్వహించింది.

చైనా ఫస్ట్ ప్లేస్


విశ్వవ్యాప్తంగా సెల్ ఫోన్ కు బానిసలయిన దేశాలలో నిర్వహించిన సర్వే ఆధారంగా టాప్ టెన్ దేశాల లిస్ట్ బయటపెట్టింది. అందులో ఆశ్చర్యం కలిగించే అంశాలు బయటపడ్డాయి. ప్రపంచవ్యాప్తంగా సెల్ ఫోన్ ఎక్కువగా వాడే దేశాలలో అగ్రస్థానం చైనాదే. జనాభాలోనే కాదు సెల్ ఫోన్ల వాడకంలోనూ మేమే గొప్ప అంటోంది ఆ దేశం. ఆ తర్వాత స్థానం సౌదీ అరేబియా ఆక్రమించింది. టాప్ టెన్ సెల్ ఫోన్ వాడకం దారుల దేశాలలో సౌదీ అరేబియా రెండో స్థానంలో ఉంది. నేపాల్ పదవ స్థానంలో ఉంది. అయితే అంతా ఊహించినట్లుగా భారత్ ఈ టాప్ టెన్ లిస్ట్ లో లేకపోవడం సంతోషించదగిన అంశం అని సామాజిక విశ్లేషకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భారతదేశం 17వ స్థానంలో ఉంది సెల్ ఫోన్ల వాడకంలో.

రేడియేషన్ ప్రభావం

స్మార్ట్ ఫోన్ వినియోగం మంచికి ఉపయోగపడాలే తప్ప చేటు తెచ్చేదిగా ఉండకూడదంటున్నారు పెద్దలు. సెల్ ఫోన్ల నుంచి వెలువడే రేడియేషన్ తరంగాలతో శరీరంలో భారీ మార్పులు చోటుచేకుంటున్నాని వైద్యులు చెబుతున్నారు. వీటి ప్రభావంతో సైడ్ ఎఫెక్టులు వస్తున్నాయని మానసికంగా, శారీరకంగా సెల్ ఫోన్ల వినియోగం తీవ్ర ప్రభావం చూపుతోందని వైద్యులు అంటున్నారు. అధిక రక్తపోటు, షుగర్,తీవ్ర ఒత్తిడికి లోనవడం, వినికిడి సమస్య, హృద్రోగాల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని వైద్య నిపుణులు అంటున్నారు. మనుషుల ఆయుష్షు కూడా దీనివలన తగ్గిపోతోందని అంటున్నారు. ఇకనైనా వీటి వాడకాన్ని తగ్గించుకుని ఆరోగ్యవంతమైన జీవన విధానాన్ని కొనసాగించాలని మనమంతా మనసారా కోరుకుందాం.

Related News

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Big Stories

×