BigTV English

India Vs Pakistan War : జుజుబీ.. ఈ నవ్వులు చూస్తే పాక్ చచ్చిపోవాల్సిందే.. వార్ వన్‌సైడ్

India Vs Pakistan War : జుజుబీ.. ఈ నవ్వులు చూస్తే పాక్ చచ్చిపోవాల్సిందే.. వార్ వన్‌సైడ్

India Vs Pakistan War : భారత్‌-పాక్‌ మధ్య వార్‌ వన్‌ సైడే. భారత్‌పైకి పాకిస్థాన్.. ఎన్ని ఫైటర్ జెట్లు వదిలినా.. డ్రోన్లతో దొంగదెబ్బ తీసే ప్రయత్నం చేసినా.. అవన్నీ భారత బలగాల ముందు జుజుబీనే. మన ముందు పాక్‌ ఎంత.. ఏనుగు ముందు ఎలుక పిల్లంత. గట్టిగా గాండ్రిస్తేనే.. ఆ దెబ్బకు పారిపోయే, గజగజ వణికిపోయే పాక్‌.. మనతో యుద్ధం చేసి గెలుస్తుందా..? వార్‌ వన్‌ సైడ్ అని గురువారం రాత్రే తేలిపోయింది. అందుకు.. ఈ ఫోటోనే బెస్ట్ ఎగ్జాంపుల్. బోర్డర్‌లో ఎంతో సీరియస్‌గా వార్ జరుగుతుంటే.. రక్షణమంత్రి రాజ్‌‌నాథ్‌ సింగ్, త్రివిధ దళాధిపతుల మీటింగ్‌లో ఈ నవ్వుల సీన్ కనిపించింది. అంటే.. పాక్‌తో యుద్ధం మనకు చిన్నపిల్లలాట అనేగా.. అంతేగా.


పిక్చర్ ఆఫ్ ది డే..

ఢిల్లీలో త్రివిధ దళాధిపతులతో రక్షణ శాఖ మంత్రి రాజ్‌ నాథ్ సింగ్ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాజ్‌ నాథ్‌ సింగ్, భారత సాయుధ దళాల అధిపతులు.. చాలా ప్రశాంతంగా.. నవ్వుతూ కనిపించారు. ఈ నవ్వు సాధారణ నవ్వు కాదు. 140 కోట్ల భారతీయుల శక్తిగా అభివర్ణించొచ్చు. ఈ నవ్వులు చూస్తేనే అర్థమై పోతోంది పాక్‌తో జరుగుతున్న యుద్ధంలో భారత్‌ ఏవిధంగా పై చేయి సాధిస్తుందో. పాకిస్థాన్‌ కుట్రలను ఏ విధంగా భగ్నం చేస్తుందో.


వార్ మీటింగ్‌లో కూల్ కూల్

పాకిస్తాన్.. భారతదేశ పశ్చిమ సరిహద్దులో డ్రోన్, క్షిపణి దాడులను ప్రారంభించిన 24 గంటలలోపు రాజ్‌నాథ్‌ సింగ్ రక్షణ సిబ్బంది చీఫ్ జనరల్ అనిల్ చౌహాన్, ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్, నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ త్రిపాఠితో అత్యవసర సమావేశం నిర్వహించారు. వారంతా ప్రశాంతంగా, నమ్మకంగా, సమాయత్తంగా.. ఉల్లాసంగా కనిపించారు. ఇందుకు సంబంధించిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

దేశానికి భరోసా..

దేశానికి ఈ ఫోటో ఒక స్పష్టమైన భరోసాను ఇచ్చిందనే చెప్పాలి. భారతీయులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.. పాక్‌కు సరైన బుద్ది చెప్తున్నాం.. వార్‌ వన్‌ సైడే అన్న సందేశం ఇస్తోంది ఈ ఫోటో. అంతేకాకుండా ప్రత్యర్థుల నుంచి రెచ్చగొట్టే చర్యలు ఎదురైనప్పుడు.. దేశ నాయకత్వం ఆందోళనకు బదులు.. ప్రశాంతంగా ఆలోచిస్తూ బలాన్ని పుంజుకోవడాన్ని సూచిస్తుంది.

Also Read : ఇంకా కశ్మీర్ కోసమే కక్కుర్తా? పాక్ బుద్ది మారదా?

Related News

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Sunil Ahuja: ఐటీ రైడ్స్ భయం.. దేశం వదిలిన సునీల్ ఆహుజా? ఏం జరిగింది?

Breaking: కుప్పకూలిన హెలికాప్టర్.. మంత్రులు మృతి

MP News: పట్టించుకోని వాహనదారులు.. పెట్రోల్ కష్టాలు రెట్టింపు, ఏం జరిగింది?

Tariff War: 50శాతం సుంకాలపై భారత్ ఆగ్రహం.. అమెరికాను మనం నిలువరించగలమా?

Big Stories

×