BigTV English
Advertisement

Single OTT : ‘సింగిల్’ ఓటటీ పార్ట్నర్ లాక్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Single OTT : ‘సింగిల్’ ఓటటీ పార్ట్నర్ లాక్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Single OTT : టాలీవుడ్ హీరో శ్రీ విష్ణు తాజాగా నటించిన చిత్రం సింగిల్.. నేడు ఈ మూవీ భారీ అంచనాల తో థియేటర్లలోకి వచ్చేసింది. లవ్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుందని తెలుస్తుంది. డైరెక్టర్కార్తిక్ సుబ్బరాజు ఈ మూవీకి దర్శకత్వంలో వహించగా.. కేతికా శర్మ, ఇవానా హీరోయిన్లుగా నటించారు. వెన్నెల కిశోర్ కీలకపాత్ర పోషిస్తున్నారు.. ఈ సినిమా ఓటీటీ డీటెయిల్స్ గురించి ఆసక్తికర విషయాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. ఏ ప్లాట్ ఫామ్ ఈ సినిమా హక్కులను సొంతం చేసుకుందో ఒకసారి వివరంగా తెలుసుకుందాం.


ఓటీటీ డీటెయిల్స్..

సామజవరాగమన మూవీతో హీరోగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయిన శ్రీవిష్ణు హీరోగా వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. తాజాగా ఈ హీరో నటించిన చిత్రం సింగిల్.. ఇవాళ థియేటర్లలో సందడి చేస్తుంది. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’ సొంతం చేసుకుంది. థియేట్రికల్ రన్ తర్వాత ఓటీటీలోకి స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఉంది. సాధారణంగా ఏ సినిమా అయినా థియేటర్‌లో రిలీజ్ అయిన నెల రోజుల తర్వాత ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంటే ఓటీటీలోకి రావడం కాస్త ఆలస్యం అవుతుంది.. జూన్ రెండో వారంలో ఈ సినిమా ఓటీటీలోకి రాబోతుందని సమాచారం. అయితే ఈ డేట్ మారే అవకాశం కూడా ఉంది. గీతా ఆర్ట్స్ అధినేత, మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో కళ్యా ఫిలిమ్స్ సంస్థతో కలిసి విద్య కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి సంయుక్తంగా నిర్మించారు..


Also Read : అక్కడ ప్రాణాలు పోతుంటే.. ఇక్కడ మీ సినిమా గోలేంట్రా బాబు..

ఈ మూవీ టాక్ ఎలా ఉందంటే..

హీరో శ్రీవిష్ణు హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. అంతకు ముందు వచ్చిన ఓం బీమ్ బుష్ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. గతేడాది స్వాగ్ సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. అయితే ఆ సినిమా మిక్స్డ్ టాక్ ని అందుకోవడంతో పెద్దగా హిట్ అవ్వలేదు. ఇక కలెక్షన్ల పరిస్థితి కూడా అదే విధంగా ఉండడంతో ఈ సినిమా ఎక్కువ రోజులు థియేటర్లలో ఉండలేకపోయింది. ఇక ఈ ఏడాది సింగిల్ మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ సినిమాపై నెటిజన్లు పెదవిరుస్తున్నారు. కొందరేమో కొత్తదనం కోరుకునేలా సినిమాలు తీస్తున్నాడు అంటూ ప్రశంసలు కురిపిస్తే.. మరికొందరేమో కామన్ స్టోరీలతో బోర్ కొట్టిస్తున్నారంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికి అయితే ఈ సింగిల్ మూవీ సింగిల్ డే లో పాజిటివ్ టాక్ ను అయితే అందుకుంది.. మరి ఈ వీకెండ్ లో ఈ సినిమాకు ఎలాంటి కలెక్షన్స్ వస్తాయో చూడాలి..

ఈ మూవీ తర్వాత మరో రెండు సినిమాల్లో నటించేందుకు శ్రీ విష్ణు రెడీ అవుతున్నాడని తెలుస్తుంది. అంతేకాదు సామజవర్గమన సినిమాకు సీక్వెల్ గా మరో మూవీ వచ్చే అవకాశాలు ఉన్నాయని టాక్..

Related News

OTT Movie : ఒంటిపై నూలు పోగు లేకుండా భగభగ మండే మంటల్లోకి పరుగు… ఇదెక్కడి దిక్కుమాలిన పని సామీ

OTT Movie : మిస్టీరియస్ మనిషితో ముసలావిడ రొమాన్స్… ఇలాంటి సినిమాను ఎక్కడా చూసుండరు భయ్యా

OTT Movie : భర్తకు బాయ్ ఫ్రెండ్ తో అడ్డంగా దొరికిపోయే భార్య… ఐఎండీబీలో రేటింగ్ 8… క్రైమ్ మూవీ లవర్స్ కు పండగే

OTT Movie : IMDb లో 9.7 రేటింగ్… స్కూల్ పుస్తకాల్లో స్కామ్… ఈ తండ్రి గట్స్ కు దండం పెట్టాల్సిందే భయ్యా

OTT Movie : బ్రోతల్ హౌస్ నుంచి తప్పించుకుని 17 ఏళ్ల అమ్మాయితో ఆ పాడు పనులు… ఈ మూవీ స్ట్రిక్ట్లీ సింగిల్స్ కు మాత్రమే

OTT Movie : స్కూల్ పాప డ్రెస్సుకు బటన్స్ పెట్టే మాస్టార్… డోర్ వేస్తానని చెప్పి ఆమె చేసే పనికి ఫ్యూజులు అవుట్

OTT Movie : అడవిలో వేలాడే తల లేని శవం… తవ్వుతున్న కొద్దీ బయటపడే నేరాల చిట్టా… కేక పెట్టించే క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : 16 ఏళ్ల అబ్బాయికి అతీంద్రీయ శక్తులు… దయ్యాల ఆవాసంగా మారే అపార్ట్మెంట్… కల్లోనూ వెంటాడే హర్రర్ మూవీ

Big Stories

×