BigTV English

Kollywood Hero : భార్యకు విడాకులు ఇచ్చి… సింగర్‌తో ఎఫైర్… ఈ వీడియోతో అడ్డంగా దొరికిపోయారు

Kollywood Hero : భార్యకు విడాకులు ఇచ్చి… సింగర్‌తో ఎఫైర్… ఈ వీడియోతో అడ్డంగా దొరికిపోయారు

Kollywood Hero: కోలీవుడ్ స్టార్ హీరో, టాలీవుడ్‌లోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో రవి మోహన్ అలియాస్ జయం రవి వ్యక్తిగత జీవితం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. భార్య ఆర్తి రవితో విడాకుల వ్యవహారం కోర్టుకు చేరినప్పటి నుంచి ఆయనపై అనేక రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా ప్రముఖ సింగర్ కెనీషా ఫ్రాన్సిస్‌తో ఆయన ఎఫైర్‌లో ఉన్నారంటూ గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, ఈ వార్తలను రవి మోహన్ ఖండించినప్పటికీ.. తాజాగా బయటకొచ్చిన ఒక వీడియో మాత్రం ఆయనను అడ్డంగా బుక్ చేసింది!


ప్రముఖ సింగర్ తో ఎఫైర్‌..నిజమేనా ..

వివరాల్లోకి వెళితే… రవి మోహన్ తన భార్య ఆర్తి రవితో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్న తర్వాత, సింగర్ కెనీషా ఫ్రాన్సిస్‌తో ఆయన సన్నిహితంగా ఉంటున్నారనే వార్తలు కోలీవుడ్ మీడియాలో జోరుగా వినిపించాయి. అయితే, అప్పట్లో ఇవన్నీ కేవలం స్నేహం మాత్రమేనని రవి మోహన్ కొట్టిపారేశారు. కానీ, తాజాగా నిన్న జరిగిన ఒక వెడ్డింగ్ ఈవెంట్‌లో వీరిద్దరూ కలిసి కనిపించిన తీరు, వారి మధ్య ఉన్న బంధాన్ని మరోసారి తెరపైకి తెచ్చింది.


ఈ వేడుకలో రవి మోహన్ , కెనీషా ఫ్రాన్సిస్ చాలా క్లోజ్‌గా ఉండటమే కాకుండా… ఇద్దరూ ఒకే రంగు దుస్తులు ధరించి ప్రత్యేకంగా నిలవడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ దృశ్యాలు అక్కడున్న కొందరు వీడియో తీయడంతో అవి కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ వీడియోలో వీరిద్దరూ ఒకరితో ఒకరు ఎంతో ఆప్యాయంగా మాట్లాడుకుంటూ, నవ్వుకుంటూ కనిపించడం వారి మధ్య స్నేహానికి మించిన బంధం ఉందనే అనుమానాలకు తావిస్తోంది.

ఆమెతో విడాకులు ..ఈమెతో పెళ్లి ..

ఈ వీడియో వైరల్ కావడంతో కోలీవుడ్ మీడియా మరోసారి రవి మోహన్ , కెనీషా ఫ్రాన్సిస్ ఎఫైర్‌పై కథనాలు ప్రచురిస్తోంది. అంతేకాదు, ఆర్తి రవితో విడాకులు పూర్తయిన వెంటనే వీరిద్దరూ పెళ్లి చేసుకునే అవకాశం కూడా ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గతంలో రూమర్లను ఖండించిన రవి మోహన్, ఈ వీడియోపై ఎలా స్పందిస్తారో చూడాలి.

ఒకవైపు వ్యక్తిగత జీవితంలో ఈ వివాదాలు కొనసాగుతుండగా, రవి మోహన్ మాత్రం తన సినీ కెరీర్‌లో దూసుకుపోతున్నారు. ఆయన నటించిన చిత్రాలు మంచి విజయాన్ని అందుకుంటున్నాయి. అయితే, ఈ తాజా వీడియో మాత్రం ఆయన వ్యక్తిగత జీవితాన్ని మరోసారి చర్చనీయాంశంగా మార్చింది. అభిమానులు సైతం ఈ విషయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

మొత్తానికి, ఈ వైరల్ వీడియోతో రవి మోహన్ , కెనీషా ఫ్రాన్సిస్ ఎఫైర్ రూమర్స్‌కి మరింత బలం చేకూరినట్లైంది. మరి దీనిపై రవి మోహన్ ఎలా స్పందిస్తారో, వీరి బంధం ఎక్కడి వరకు వెళ్తుందో వేచి చూడాలి. కోలీవుడ్ మీడియా మాత్రం ఈ వ్యవహారాన్ని నిశితంగా గమనిస్తోంది.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×