Software Egineer Murdered: టెక్కీ వయస్సు కేవలం 25 ఏళ్లు. చదువు తర్వాత ఐటీ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. ఇప్పుడిప్పుడే ప్రపంచాన్ని చూస్తున్నాడు. అనుకోకుండా ఆ టెక్కీ జీవితంలో ప్రియురాలు ఎంట్రీ ఇచ్చింది. జీవితంలో ఏదో సాధించాలనుకునే లోపు ఆ టెక్కీని ఈ లోకం నుంచి పైలోకాన్ని పంపేసింది సహజీవనం చేస్తున్న భాగస్వామి. సంచలనం రేపిన ఈ ఘటన కోల్‌కతాలో వెలుగుచూసింది.
బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని గరియా ప్రాంతంలో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది.ఈ ప్రాంతంలో 25 ఏళ్ల సార్థక్ సర్కార్ నివాసం ఉంటున్నాడు. ఓ ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. ప్రియురాలు సంచాలికతో కలిసి ఫర్తాబాద్‌లోని అద్దె ఫ్లాట్‌లో సహజీవనం చేస్తున్నాడు. వీరితోపాటు ప్రియురాలు సంచాలికతోపాటు తల్లి మౌమిత ఆ ఇంట్లో ఉంటోంది. శనివారం రాత్రి సార్థక్-సంచాలిక మధ్య వాగ్వాదం జరిగింది.
అది కాస్త తీవ్రరూపం దాల్చింది. నువ్వెంత అంటే నువ్వెంత అనే స్థాయిలో కేకలు వేసుకున్నారు. ఆ క్రమంలో ప్రియురాలు సంచాలిక ఆగ్రహానికి గురైంది. పదునైన ఆయుధంతో సర్కార్ భుజంపై దాడి చేసింది. దీంతో సార్థక్ అరుపులు విన్న ఇరుగుపొరుగు వారు పరుగెత్తు కొచ్చారు. గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే సార్థక్ మరణించినట్లు డాక్టర్లు ప్రకటించారు. స్థానికుల ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు కోల్‌కత్తా పోలీసులు.
సార్థక్ ప్రియురాలు సంచాలికను అరెస్ట్ చేశారు. ఈ ఘటన వెనుక సంచాలిక తల్లి మౌమిత పాత్ర ఉండొచ్చన్న అనుమానంతో.. ఆమెని కూడా అరెస్ట్ చేశారు.టెక్నో ఇండియా ఇన్‌స్టిట్యూట్‌లో చదువుకున్నాడు సార్థిక్ సర్కార్. వాగ్వాదానికి గల కారణం ఇంకా అస్పష్టంగా ఉన్నాయి. ఈ దాడి కేవలం ఆ వాగ్వాదం వల్ల జరిగిందా? ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ హత్యలో నిందితుడి తల్లి పాత్ర గురించి లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
ALSO READ: యూపీలో తీవ్ర విషాదం.. రీల్స్ చేసే ఇద్దరు మైనర్ బాలికలు ఒకే చెట్టుకు ఉరి! అసలేం జరిగింది?
ఆదివారం తెల్లవారుజామున సుమారు 1.30 గంటలకు సహాయం కోసం ఆ మహిళ చేసిన కేకలు విని అక్కడికి చేరుకున్నట్లు ఇరుగుపొరుగు వారు చెబుతున్నారు. సంచాలిక మెడపై గీతలు ఉన్నట్లు గుర్తించారు. మేము ఫ్లాట్‌కు పరుగెత్తుకెళ్లి చూడగా మంచం మీద యువకుడు రక్తపు మడుగులో పడి ఉన్నాడని తెలిపారు. ఆ దంపతులు కొంతకాలంగా ఆ ప్రాంతంలో నివాసం ఉన్నప్పటికీ పొరుగువారితో చాలా అరుదుగా మాట్లాడేవారని మరో నివాసి గుర్తు చేసుకున్నారు.