E-Paper
Advertisement

పెళ్లైన 9 నెలలకే, వధువు ఆత్మహత్య వెనుక షాకింగ్ విషయాలు, కాన్పూర్‌లో దారుణం

పెళ్లైన 9 నెలలకే, వధువు ఆత్మహత్య వెనుక షాకింగ్ విషయాలు, కాన్పూర్‌లో దారుణం
Advertisement

Kanpur:  ఆ జంటకు పెద్దలు పెళ్లి చేశారు.. మొదట్లో అంతా బాగానే జరిగింది. రానురాను అత్తమామలు, భర్త ప్రవర్తనలో మార్పులు మొదలయ్యాయి. ఆ తర్వాత  నల్లగా ఉన్నావంటూ భర్త వేధించేవాడు. ఈ టార్చర్ తట్టుకోలేక పెళ్లైన 9 నెలలకే ఈ లోకాన్ని విడిచిపెట్టింది ఓ మహిళ. సంచలన రేపిన ఈ ఘటన యూపీలో వెలుగుచూసింది.

యూపీలోని కాన్పూర్‌లో దారుణం

ఉత్తర ప్రదేశ్‌లోని కాన్పూర్‌లో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. పెళ్లైన 9 నెలలకే అత్తారింట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది రుచి మిశ్రా అనే మహిళ. కాన్పూర్ జిల్లాలోని బైకుంత్‌పూర్ గ్రామంలో నివాసం ఉండేవారు సుశీల్ త్రివేది. ఆయన ప్రైవేట్ రంగంలో ఉద్యోగం చేసేవారు. ఆయనకు భార్య మంజు త్రివేది, కొడుకులు మనీష్, అశ్వని, కూతురు రుచి ఉన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 18న సిసమౌలో ఉండే రాజేష్ మిశ్రా కొడుకు గోపాల్ మిశ్రా-రుచి మిశ్రాకు వివాహం జరిగింది. దాదానగర్‌లోని ఒక ఫ్యాక్టరీలో టెలివిజన్ సర్క్యూట్‌లను తయారు చేస్తాడు రాజేష్ మిశ్రా. ఆ ఫ్యాక్టరీలో తండ్రికి సహాయం చేస్తాడు కొడుకు గోపాల్ మిశ్రా.

Advertisement

వివాహం జరిగిన 9 నెలలకే వధువు ఆత్మహత్య

గోపాల్-రుచి మిశ్రా దంపతుల విషయానికి వద్దాం. వివాహం జరిగిన మొదటి మూడు నాలుగు నెలల వరకు అంతా బాగానే జరిగింది. ఆ తర్వాత నుంచి రుచికి కష్టాలు మొదలయ్యాయి. అత్తమామలు కోడల్ని వేధించడం మొదలుపెట్టారు. కొన్ని సార్లు కోడలు రంగు గురించి ఎగతాళి చేసేవారు. మరి కొన్నిసార్లు తగినంత కట్నం తేలేదని అవమానించారు. నువ్వు నల్లగా ఉన్నావని భర్త కూడా పదే పదే అనేవాడు. దాన్ని నిరసన తెలిపినప్పుడు ఆమెపై దాడులు చేసిన సందర్భాలు ఉన్నాయి. అత్తింట్లో జరుగుతున్న వ్యవహారాలను ఎప్పటికప్పుడు రుచి తన తల్లిదండ్రులతో షేర్ చేసుకునేది.

Advertisement

చివరకు ఈ టార్చర్ తట్టుకోలేక అత్తింట్లో ఉరేసుకుని ఆ లోకాన్ని విడిచిపెట్టింది రుచి మిశ్రా. కూతురు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలియగానే తల్లిదండ్రులు షాకయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన తల్లిదండ్రులు.. నా కూతుర్ని ఆమె అత్తమామలు పదే పదే వేధించారని ఆరోపించారు. నా అల్లుడు ఆమెను నల్లగా ఉందని ఎగతాళి చేసేవాడని, తరచుగా దాడి కూడా చేశారన్నాడు. నా కూతురు ఆత్మహత్య చేసుకోలేదని, ఆమె హత్య చేశారని అన్నారు.

ALSO READ: మధ్యప్రదేశ్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు సజీవదహనం!

శనివారం రాత్రి పొద్దుపోయాక రుచి తన తల్లికి ఫోన్ చేసి తనను వేధిస్తున్నారని చెప్పిందని వివరించారు. నన్ను ఇక్కడి నుండి తీసుకువెళ్ళాలని చెప్పిందని, దీపావళి తర్వాత ఇంటికి తీసుకువస్తానని తల్లి హామీ ఇచ్చింది, కానీ మరుసటి రోజు కూతురు మరణ వార్త వస్తుందని ఊహించలేక పోయాయని కన్నీరుమున్నీరు అయ్యారు తల్లిదండ్రులు. పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం పరీక్ష కోసం పంపించారు. ఈ ఘటనపై రుచి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Related News

మధ్యప్రదేశ్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు సజీవదహనం!

విద్యుత్తు స్తంభాన్ని ఢీ కొట్టిన కారు, ఆరుగురు సజీవ దహనం, యూపీలో షాకింగ్ ఘటన

దీపావళి ఎఫెక్ట్.. డేంజర్ స్థాయిలో ఢిల్లీ వాయు కాలుష్యం, నాలుగు రాష్ట్రాల ప్రజలు ఉక్కిరిబిక్కిరి

కూర రుచిగా లేదన్నందుకు.. కత్తితో పొడిచి భర్తను చంపి ఆ తర్వాత, అహ్మదాబాద్‌లో విచిత్ర ఘటన

4 లక్షల మందికి విందు, గుర్రాల రేసు, విజేతకు కారు బహుమతి.. కూతురు పెళ్లిలో ఎమ్మెల్యే హంగామా

పార్కింగ్ వివాదం.. సాఫ్ట్‌వేర్ కంపెనీ సీఓఓ దారుణ హత్య, 19 రౌండ్లు కాల్పులు

మావోయిస్టుల గడ్డపైకి ప్రధాని.. బలగాలతో కలిసి దీపావళి వేడుకలు.. ‘దిమాగీ నక్సల్స్’పై సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×