BREAKING NEWS : కాంగ్రెస్ మాజీ చీఫ్ సోనియా గాంధీ అస్వస్థతకు గురయ్యారు. సిమ్లాలో విశ్రాంతి తీసుకుంటుండగా.. సడెన్‌గా సోనియా ఆరోగ్యం క్షీణించింది. వెంటనే హాస్పిటల్‌కు తరలించారు. ఇందిరా గాంధీ మెడికల్ కాలేజ్ హాస్పిటల్‌లో వైద్య పరీక్షలు చేస్తున్నారు. విషయం తెలియగానే హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖవిందర్ సింగ్ ఆసుపత్రికి చేరుకున్నారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలకు సమచారం అందించారు.
ఇటీవల సోనియా గాంధీ తరుచూ జబ్బు పడుతున్నారు. గత ఫిబ్రవరిలోనూ ఆమెకు హెల్త్ ప్రాబ్లమ్ రావడంతో ఢిల్లీలోని గంగారాం హాస్పిటల్లో చికిత్స పొందారు. సోనియా ఆరోగ్య పరిస్థితిపై కాంగ్రెస్ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.