Secunderabad Train Accident: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో దారుణం జరిగింది. హనీమూన్ కోసం వెళ్తున్న నవ వరుడు రైల్లో నుంచి జారిపడి చనిపోయాడు. నిండు నూరేళ్లు కలిసి తనతో జీవించాలనుకున్న అమ్మాయి జీవితంలో తీరని విషాదాన్ని నింపాడు. కొత్త పెళ్లి కూతురు రోదనలు అక్కడున్న వారందరినీ కంటతడి పెట్టించాయి.
ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?
వరంగల్ జిల్లా ఉరకొండకు చెందిన 28 ఏళ్ల సాయికి తాజాగా పెళ్లి అయ్యింది. హనీమూన్ కోసం గోవాకు వెళ్లాలి అనుకున్నాడు. పనిలో పనిగా తన భార్యతో పాటు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి వెకేషన్ కు వెళ్లాలని భావించాడు. అందరూ కలిసి వాస్కోడగామా ఎక్స్ ప్రెస్ ఎక్కారు. రైలు ఇంకా కదలకపోవడంతో సాయి వాటర్ బాటిల్ తెచ్చేందుకు వెళ్లాడు. అతడు వెళ్లగానే రైలు కదలడం మొదలయ్యింది. అతడి భార్య, బావ, బంధువులు రైల్లోనే ఉన్నారు. రైలు నెమ్మదిగా వేగం పుంజుకుంది. సాయి కదులుతున్న రైలును ఎక్కేందుకు ప్రయత్నించాడు. కోచ్ పక్కనే పరిగెడుతూ జారిపడ్డాడు. రైలు, ఫ్లాట్ ఫారమ్ మధ్యలో పడిపోయాడు. తీవ్రంగా గాయపడ్డాడు.
Read Also: విశాఖ నుంచి రైల్లో నేరుగా.. ఈ అందమైన ప్రాంతాలకు వెళ్లిపోవచ్చు.. ఈ 4 మిస్ కావద్దు!
హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతి
వెంటనే అతడిని బంధువులు సమీపంలో ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. ఐసీయూలో చికిత్స అందించారు. ట్రీట్మెంట్ కొనసాగుతుండగానే సాయి చనిపోయాడు. కలిసి జీవితాన్ని పంచుకోవాలనుకునే వ్యక్తి అర్థారంతరంగా చనిపోవడంతో సదరు కొత్త పెళ్లికూతురు గుండెలవిసేలా రోధించింది. సంతోషంగా గడపాలని వెళ్తూ ప్రాణాలు కోల్పోవడంతో బంధుమిత్రులు ఆవేదనలో ముగినిపోయారు. అమ్మాయిని ఓదార్చుతూ, వాళ్లు కూడా కంటతడి పెట్టారు. వారి బాధను చూసి చుట్టుపక్కల వాళ్లంతా కంటతడి పెట్టారు. పోస్టుమార్టం అనంతరం సాయి మృతదేహాన్ని ఆయన స్వస్థలానికి తీసుకెళ్లనున్నట్లు బంధువులు తెలిపారు. ఈ విషయం తెలియడంతో ఆయన స్వగ్రామంలోనూ విషాద ఛాయలు అలుముకున్నాయి. అటు ఈ ఘటనకు సంబంధించి రైల్వే అధికారులు ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు.
Read Also: రైల్వే ప్రయాణంలో ఆధార్ ధృవీకరణ, అనుమానం వస్తే అంతే సంగతులు!