Karmabhoomi Express: పంజాబ్‌లో ఒక పెద్ద రైలు ప్రమాదం చోటుచేసుకుంది. అమృత్‌సర్ నుంచి జల్పాయ్‌గుడి వెళ్తున్న కర్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో ఒక్కసారిగా అగ్నిప్రమాదం సంభవించింది. రైలు ప్రయాణిస్తున్న సమయంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో నాలుగు కోచ్‌లకు వ్యాపించాయి. దీంతో బోగీల్లో దట్టమైన పొగలు అలుముకుని ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందో అర్థం కాక కేకలు వేస్తూ రక్షణ కోసం పరుగులు తీశారు. అయితే, ప్రయాణికులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే అప్రమత్తమవ్వడం కలిసొచ్చింది. రైలు వేగం తగ్గగానే సమయస్ఫూర్తితో చకచకా దిగిపోవడంతో తృప్తిలో భారీ ప్రాణనష్టం తప్పినట్లయింది. ప్రమాదాన్ని గమనించిన రైల్వే సిబ్బంది వెంటనే స్పందించి సరాయ్ బంజారా రైల్వే స్టేషన్ సమీపంలో రైలును నిలిపివేశారు.
కర్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం
అమృత్‌సర్ నుంచి జల్పాయ్‌గుడి వెళ్తున్న కర్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో ప్రమాదవశాత్తూ అగ్నిప్రమాదం సంభవించింది. 4 కోచ్‌లకు మంటలు వ్యాపించాయి. ప్రమాదాన్ని గమనించి సరాయ్ బంజారా రైల్వే స్టేషన్ సమీపంలో రైలును నిలిపివేశారు. విద్యుదాఘాతం వల్లే ఈ ప్రమాదం… pic.twitter.com/3AcggvbbLn
— BIG TV Breaking News (@bigtvtelugu) November 6, 2026
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది క్షణాల్లో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం రైలులో షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు భద్రతా బలగాలు, రైల్వే పోలీసులు రంగంలోకి దిగి ప్రయాణికులను సురక్షితంగా వేరే ప్రాంతాలకు తరలించేందుకు సహాయక చర్యలను వేగవంతం చేశారు. స్థానికులు కూడా ఈ సహాయక చర్యల్లో పాలుపంచుకుంటున్నారు.
Also Read: బంగాళాఖాతంలో మరో తుఫాను అలజడి.. ఆక్వాన్ వస్తుందా?