E-Paper
Advertisement

26/11 తరహా దాడికి స్కెచ్.. స్కూబా డైవర్లుగా లష్కరే ఉగ్రవాదులకు ట్రైనింగ్!

26/11 తరహా దాడికి స్కెచ్.. స్కూబా డైవర్లుగా లష్కరే ఉగ్రవాదులకు ట్రైనింగ్!
Advertisement

LeT Terror Plot: భారత్‌లో మరో భారీ సముద్ర మార్గ దాడికి లష్కరే తోయిబా (LeT) కుట్ర పన్నుతోందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. కరాచీకి కేవలం 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రసిద్ధ పర్యాటక ప్రాంతమైన చార్నా దీవి (Charna Island) వేదికగా ఇందుకు శిక్షణ సాగుతున్నట్లు సమాచారం అందింది. పర్యాటకులుగా నటిస్తూ వచ్చిన ఉగ్రవాదులకు స్కూబా డైవింగ్, కాంబ్యాట్ స్విమ్మింగ్, నీటి అడుగున దాడి సంబంధించి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు తెలిసింది.

‘దవా మెరైన్ వింగ్’ పేరుతో కొత్త దళం

నీటి మార్గంలో దాడికి శిక్షణ పొందుతున్న ఉగ్రవాదులు.. లష్కరే తోయిబాకు చెందిన ‘దవా మెరైన్ వింగ్’ లేదా ‘సదా యే హురియత్’ గ్రూప్ నకు చెందిన వారై ఉంటారని నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. పర్యాటకుల్లా స్కూబా డైవింగ్ చేస్తున్నట్లే నమ్మిస్తూ వీరు నీటి అడుగున జరిగే విధ్వంసకర కార్యకలాపాలపై శిక్షణ పొందుతున్నారు. లష్కరే తోయిబాకు ప్రత్యక్ష ప్రాక్సీ గ్రూప్‌గా వ్యవహరిస్తున్న ‘పాకిస్తానీ మార్కజీ ముస్లిం లీగ్’ (PMML) సభ్యులే వీరికి ట్రైనర్లుగా పనిచేస్తున్నట్లు నిఘా వర్గాలు స్పష్టం చేశాయి. గతంలో పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని మంగ్లా డ్యామ్, వివిధ లాంచ్ ప్యాడ్‌ల వద్ద ఉన్న స్విమ్మింగ్ పూల్స్‌లో వీరు శిక్షణ పొందిన దాఖలాలు ఉన్నాయి.

26/11 తరహా దాడులకు కుట్ర!

Advertisement

2008లో జరిగిన ముంబై ఉగ్రదాడుల సమయంలో కూడా లష్కర్ ఉగ్రవాదులు సముద్ర మార్గంలోనే నగరంలోకి ప్రవేశించారు. నాటి నుంచి చిన్నపాటి మెరైన్ వింగ్‌ను మాత్రమే నిర్వహిస్తున్న లష్కర్.. ఇప్పుడు సముద్ర మార్గం గుండా మరింత భారీ స్థాయిలో దాడులకు తెగబడేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు భద్రతా దళాలకు సమాచారం అందింది. అయితే భారత నిఘా, భద్రతా సంస్థలు ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తూ సముద్ర మార్గంలో వచ్చే ఎలాంటి ముప్పునైనా ఎదుర్కొనేందుకు పూర్తి సిద్ధంగా ఉన్నాయని అధికారులు తెలిపారు.

కాశ్మీర్‌లో లష్కర్ మాడ్యూల్ ధ్వంసం

మరోవైపు జమ్మూ కాశ్మీర్‌లో సోషల్ మీడియా ద్వారా యువతను తీవ్రవాదం వైపు ఆకర్షిస్తూ రిక్రూట్ చేసుకుంటున్న లష్కర్ నెట్‌వర్క్‌పై కౌంటర్ ఇంటెలిజెన్స్ కాశ్మీర్ (CIK) ఉక్కుపాదం మోపింది. శ్రీనగర్, బుద్గామ్, బిజ్‌బెహరా, మట్టన్, పుల్వామా పరిసరాల్లో సీఐకే అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించి.. అనేక డిజిటల్ పరికరాలు, వివాదాస్పద పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో 22 ఏళ్ల గ్రాడ్యుయేట్ మహమ్మద్ యాసీన్ మీర్ నివాసాన్ని కూడా సోదా చేశారు.

Advertisement

Also Read: చదువు, మేధస్సులో ప్రపంచానికే బాస్‌లు.. టాప్-5 తెలివైన దేశాలు.. భారత్ స్థానం ఎక్కడంటే?

పాక్ లోని తల్లితో సంబంధాలు

పాకిస్తాన్ మూలాలున్న యాసిన్ తల్లి తబస్సుమ్ షాహీన్ గత ఏడాది పాకిస్తాన్ వెళ్లి తిరిగి రాలేదని అధికారులు గుర్తించారు. ఆమెతో మీర్ నిరంతరం టచ్ లో ఉన్నట్లు కనుగొన్నారు. దీనిపై ప్రస్తుతం జమ్మూ పోలీసులు మరింత లోతుగా విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది. కాగా 2025 మేలో చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్’ ద్వారా మురిడ్కేలోని లష్కర్ ప్రధాన కార్యాలయంతో సహా పాక్ సరిహద్దుల్లోని 9 ప్రధాన ఉగ్రవాద క్యాంపులను భారత సైన్యం ధ్వంసం చేసింది.

Also Read: Airtel గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. రూ.219కే 12 నెలల ఉచిత సబ్‌స్క్రిప్షన్.. వివరాలు ఇవే!

Tags

Related News

కర్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో భారీ అగ్నిప్రమాదం.. 4 బోగీల్లో ఎగిసిపడిన మంటలు!

ఇది భారత్ లేకుంటే బంగ్లాదేశా? బాబోయ్.. ఈ రష్ ఏంటి? రైల్వేశాఖ ఏం చేస్తోంది?

ఒకే కుటుంబంలో ఏడుగురి హత్య.. బెంగళూరులో షాకింగ్ ఘటన, ఏడేళ్ల బాలుడితోపాటు..

ఇండియన్ బ్యాంక్‌లో 1,500 జాబ్స్.. డిగ్రీ ఉంటే చాలు..వెంటనే అప్లై చేయండి

ఆర్టీసీ బస్సుని ఢీ కొట్టిన వ్యాన్.. స్పాట్‌లో 50 మంది, తమిళనాడులో ఘోర ప్రమాదం

షాకింగ్ ఘటన.. భార్యని కుర్చీకి కట్టేసి తగలబెట్టిన భర్త, అసలు మేటర్ అదే!

18 సవర్ల బంగారం.. బిడ్డ, భర్తతో కిడ్నాప్ డ్రామా.. ‘లేడీ డాన్’ ప్లాన్ రివర్స్!

Big Stories

Advertisement
×