BigTV English

Intermediate English Paper: అలెర్ట్.. ఇంటర్ ఇంగ్లిష్ పేపర్‌లో మార్పులు.. ఆందోళనలో స్టూడెంట్స్..

Intermediate English Paper: అలెర్ట్.. ఇంటర్ ఇంగ్లిష్ పేపర్‌లో మార్పులు.. ఆందోళనలో స్టూడెంట్స్..

Intermediate English Paper: ఇంటర్ ఇంగ్లిష్ పేపర్‌కు సంబంధించి ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లిష్ పేపర్ లో ఒక ప్రశ్నను అదనంగా చేర్చింది. వచ్చే నెలలో జరిగే ఇంటర్ పరీక్షల నుంచి ఇది అమలులోకి రానుంది. అయితే ఇది రెగ్యులర్ స్టూడెంట్స్ కు మాత్రమే వర్తిస్తుంది. ఇంతకుముందు ఇంగ్లిష్ పేపర్ లో ప్రశ్నల సంఖ్య 16 ఉండేవి. ఇప్పుడు వాటి సంఖ్య 17 కు పెంచుతున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. ఈ అదనపు ప్రశ్నను సెక్షన్ సీలో ఇచ్చేందుకు అధికారులు రెడీ అయ్యారు. ఈ సెక్షన్ లో గతంలో ఐదులు ప్రశ్నలు ఉండగా.. ఇప్పుడు ఆరు ప్రశ్నలను ఇవ్వనున్నారు. మ్యాచ్ ది ఫాలోయింగ్(జతపరచండి) ప్రశ్నను అదనంగా చేర్చారు. మార్చిన మోడల్ పేపర్ ను వచ్చే పరీక్షల్లో అందుబాటులోకి తేవాలని ఇంటర్ బోర్టు ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది.


సెక్షన్ -సీలో మ్యాచ్ ది ఫాలోయింగ్ ప్రశ్నగా..

ఇంతకుముందు ఇంగిష్ పేపర్ లో సెక్షన్ సీ లో ఒక ప్రశ్నకు 8 మార్కులు ఉండేవి. రిమైనింగ్ ప్రశ్నలకు 4 మార్కులు ఉండేవి. అయితే కొత్తగా సవరించిన ప్రశ్నాపత్రంలో 8 మార్కుల ప్రశ్నను 4 మార్కులకు తగ్గిలంచి.. కొత్తగా జతచేసిన ప్రశ్నకు 4 మార్కులు కేటాయించారు. అంతే కాకుండా.. దాన్ని మ్యాచ్ ది ఫాలోయింగ్(జతపరచడం) కిందగా చేర్చారు. దానిలో 10 ఇస్తే 8 జతపరచాలి. ఒక్కో దానికి అర మార్కు చొప్పున అంటే 4 మార్కులకు ఆ ప్రశ్నను కేటాయించారు. ఇంటర్ స్టూడెంట్స్ ఏడాదంతా నేర్చుకున్న ఇంగ్లిష్ పేపర్ ను ఒక ప్రశ్నతో కొంత ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉందని స్టూడెంట్స్ తల్లిదండ్రులు, కాలేజీల అధ్యాపకులు భావిస్తున్నారు.


స్టూడెంట్స్‌కు ఒత్తిడికి లోనయ్యే అవకాశం..

సడెన్ గా పరీక్షలకు ముందు ఇంగ్లిష్ పేపర్ లో మార్పులు తీసుకొస్తే నష్టం చేకూరే అవకాశం ఉంటుందని కాలేజీల ప్రిన్సిపాల్స్, లెక్చరర్లు ప్రశ్నిస్తున్నారు. ఇలా సడెన్ మార్పులు తీసుకొస్తే చాలా మంది విద్యార్థులకు అంత త్వరగా అర్థం కావని చెబుతున్నారు. ముఖ్యంగా గవర్నమెంట్ జూనియర్ కాలేజీల్లో స్టూడెంట్స్ సగం మంది మాత్రమే క్లాసెస్ కు హాజరవుతారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ మార్పును ఎలా వివరించాలో అద్యాపకులు ఇంటర్ బోర్డును నిలదీస్తున్నారు. ఎగ్జామ్స్ కు నెల ముందు ఇలాంటి మార్పులు, చేర్పులు చేస్తే విద్యార్థులు మిగిలిన పేపర్లపై ఫోకస్ సరిగ్గా పెట్టలేరని ఇంటర్ విద్యాశాఖ అధికారులు నిలదీస్తున్నారు. పరీక్షలకు సమయం దగ్గర పడుతుండడంతో క్లాసెస్ కు వచ్చే వారి సంఖ్య క్రమంగా తగ్గుపోతుంది. ఎగ్జామ్స్ దగ్గరవుతోన్న కొద్ది స్టూడెంట్స్ కొంత ఆందోళనకు గురవుతారు. ఇంకా ప్రశ్నా పత్రం సవరిస్తే ఒత్తడి మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంటుందని విద్యావేత్తలు చెబుతున్నారు. ఎగ్జామ్స్ దగ్గర సమయంలో ఇలాంటి మార్పులు చేయడం సరికాదని వారు విమర్శిస్తున్నారు.

Also Read: Sankranthiki Vasthunam : ‘గోదారి గట్టుపైన రామ చిలకవే…’ ఫుల్ వీడియో వచ్చేసిందిగా

ప్రాక్టికల్స్‌లో నో ఇంప్రూవ్‌మెంట్..

అలాగే, ఇంటర్ ఇంగ్లిష్ ప్రాక్టికల్స్ లో ఇంప్రూవ్ మెంట్ ఎగ్జామ్ ఉండదని బోర్డు వెల్లడించింది. స్టూడంట్స్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో అన్ని సబ్జెక్టులకు ఎగ్జామ్స్ రాయాలనకుంటే మాత్రం ఇంగ్లిష్ ప్రాక్టికల్ మార్కులను మెరుగు పరుచుకోవచ్చని బోర్డు తెలిపింది. ఇంటర్ ఇంగ్లిష్ లో గతేడాది నుంచి ప్రాక్టికల్స్ ను తీసుకొచ్చిన విషయం తెలిసందే. లాస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ ప్రాక్టికల్ ప్రవేశ పెట్టగా.. ఈ ఏడాది సెకండియర్ లో కూడా ప్రవేశపెట్టారు.

Related News

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Big Stories

×