Adah Sharma: ఎవరు ఎంత చెప్పినా కూడా స్టార్ కిడ్స్‌కు సినీ పరిశ్రమలో ప్రత్యేకమైన స్థానం ఉంటుంది అనేది అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్. నెపో కిడ్స్ మాత్రం ఇదంతా నిజం అని ఒప్పుకోకపోయినా కూడా ప్రేక్షకులకు మాత్రం ఆ తేడా స్పష్టంగా కనిపిస్తోంది. అంతే కాకుండా ఎంత టాలెంట్ ఉన్నా.. ఎన్ని మంచి సినిమాల్లో నటించినా కూడా ఈ నెపో కిడ్స్‌తో పోటీపడలేక వెనక్కి తగ్గిన నటీనటులు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వారిలో చాలామంది ఎప్పటికప్పుడు నెపో కిడ్స్‌పై తమ ఫ్రస్ట్రేషన్ చూపిస్తూనే ఉంటారు. తాజాగా ఆ లిస్ట్‌లో అదా శర్మ కూడా యాడ్ అయ్యింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అదా శర్మ.. ఓపెన్‌గా షాకింగ్ కామెంట్స్ చేసింది.
అలా జరిగేదేమో
‘1920’ అనే హిందీ హారర్ సినిమాతో హీరోయిన్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది అదా శర్మ. ఆ సినిమా వల్ల అదాకు అంతగా గుర్తింపు ఏమీ రాలేదు. చాలాకాలం తర్వాత పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘హార్ట్ ఎటాక్’తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. అయితే తాను నెపో కిడ్ కాకపోవడం వల్ల ఎలాంటి పరిస్థితి ఎదుర్కున్నాను అనే విషయంపై ఓపెన్ కామెంట్స్ చేసింది అదా. ‘‘నేను ఒక స్టార్ కిడ్ అయ్యింటే వేరే జోనర్ సినిమాతో లాంచ్ అయ్యేదాన్నేమో. ప్రేక్షకులకు ఎక్కువగా రీచ్ అయ్యేదాన్నేమో. చాలామంది హారర్ లాంటి బోల్డ్ కంటెంట్‌తో లాంచ్ అవ్వాలని అనుకోరు’’ అంటూ తన డెబ్యూ గురించి గుర్తుచేసుకుంది అదా శర్మ.
ప్రతీదాంట్లో ప్రేమకథ
‘‘నేను స్టార్ కిడ్ కాదు కాబట్టి నాకు వచ్చిన అవకాశాన్ని అందుకున్నాను. ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే నేను చాలా లక్కీ అనిపిస్తుంది. చాలామంది తమ మొత్తం కెరీర్‌లో చేయలేని పనులు నేను చేశాను. అరిచాను, గోడలపై నుండి దూకాను, ఆన్ స్క్రీన్ మనుషులను చంపేశాను’’ అంటూ నవ్వుకుంది అదా శర్మ (Adah Sharma). ‘‘నేను నా కెరీర్‌ను హారర్‌తో ప్రారంభించాను కానీ ప్రతీ కథలో ఎంతో కొంత రొమాన్స్ ఉంటుందని నమ్ముతాను. హారర్‌లో కూడా ఒక లవ్ స్టోరీ ఉంటుంది. ది కేరళ స్టోరీలో కూడా ప్రేమకథ ఉంటుంది కానీ అది తప్పుదోవ పట్టింది. ప్రతీ జోనర్‌లో నేనొక ప్రేమకథను వెతుక్కుంటాను. ఎందుకంటే రొమాన్స్ అనేది నా ఫేవరెట్’’ అంటూ బయటపెట్టింది అదా శర్మ.
Also Read: సినిమా ఆఫర్ పేరుతో మోసపోయిన మాజీ సీఎం కూతురు… కోట్లు కొల్లగొట్టిన కేటుగాళ్లు
ఛాలెంజింగ్‌గా అనిపించింది
ప్రస్తుతం తన కెరీర్ గురించి మాట్లాడుతూ ‘‘నేను రీసెంట్‌గా నాలుగు సినిమాల్లో కనిపించాను. ది కేరళ స్టోరీ, బస్తర్, రీతా సాన్యల్, సన్‌ఫ్లవర్ సీజన్ 2. రీతా సాన్యల్ అనేది చాలా కష్టంగా అనిపించింది. ఎందుకంటే ఆ ఒక్క షోలోనే నేను 10 వేర్వేరు క్యారెక్టర్స్ ప్లే చేశాను. అది ఛాలెంజింగ్‌గా అనిపించినా కూడా అదొక డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ అనిపించింది’’ అని తన కెరీర్ విషయంలో సంతోషంగా ఉన్నానని చెప్పుకొచ్చింది అదా శర్మ. ప్రస్తుతం దేశమంతటా మహా కుంభమేళ గురించి మాట్లాడుతోంది కాబట్టి తనకు కూడా కుంభమేళలో పుణ్యస్నానం చేయాలని ఉందని మనసులోని కోరికను బయటపెట్టింది ఈ యంగ్ బ్యూటీ.