BigTV English

CM Revanthreddy: స్కిల్ వర్సిటీ, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ డిజైన్స్.. మార్పులు చేర్పులు.. పరిశీలించిన సీఎం రేవంత్

CM Revanthreddy: స్కిల్ వర్సిటీ, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ డిజైన్స్.. మార్పులు చేర్పులు.. పరిశీలించిన సీఎం రేవంత్

CM Revanthreddy: నాలుగో సిటీపై దృష్టి సారించారు సీఎం రేవంత్‌రెడ్డి. దీనికి సంబంధించిన పనులపై ఫోకస్ చేశారు. ఇప్పటికే మెట్రోని శంషాబాద్ నుంచి ముచ్చర్ల వరకు పొడిగింపుపై నిర్ణయం తీసుకున్నారు. తాజాగా స్కిల్ యూనివర్సిటీ పనులపై దృష్టి కేంద్రీకరించారు. ఇందులో‌భాగంగా శుక్రవారం సచివాలయంలో స్కిల్ యూనివర్సిటీ, ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల డిజైన్లను పరిశీలించారు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.


స్కిల్ యూనివర్సిటీ, ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల డిజైన్లను పరిశీలించారు. స్కిల్ యూనివర్సిటీ డిజైన్ల విషయానికొస్తే.. అకడమిక్ బ్లాక్ జీ ఫ్లస్ 4, అడ్మినిస్టేషన్ బ్లాక్ జీ ప్లస్ 10, బాయ్స్-గాళ్స్‌కు వేర్వేరు హాస్టళ్లు ఉండనున్నాయి. వాటిని జీ ప్లస్-10గా నిర్మించనున్నారు. ఇక డైనింగ్ బ్లాక్, మరిన్ని డిజైన్ల చూసి, స్వల్ప మార్పులు చేశారు. ఈ సందర్భంగా డిజైన్లపై ఆర్కిటెక్ట్స్‌కు కీలక సూచనలు చేశారు. వారం లేదా 10 రోజుల్లో డిజైన్లు పూర్తి కాగానే మిగతా పనులు ప్రారంభం కానున్నాయి.

మరోవైపు హైదరాబాద్ బయట కొత్త జూ పార్క్‌కు ప్లాన్ చేస్తున్నారు. దీన్ని వెయ్యి ఎకరాల్లో నిర్మించ నున్నట్లు తెలుస్తోంది. కొత్త జూ పార్క్ ఎక్కడన్నది ఆసక్తికరంగా మారింది. వివిధ ప్రాంతాల నుంచి జంతువులు, పక్షుల తీసుకొచ్చి ఇందులో ఉంచుతారు.


ALSO READ: ఆకాశం ముసురేసింది.. ఊరంతా ముసిగేసింది.. ఏపీ, తెలంగాణకు వర్ష సూచన

వికారాబాద్ జిల్లా అనంతగిరిలో అద్భుతమైన అటవీ ప్రాంతం ఉంది. దీనికి సంబంధించిన భూములు సైతం ఉన్నాయి. ఇక్కడ నేచర్ వెల్‌సెన్ సెంటర్ బాగుంటుందని ఆలోచన చేస్తోంది ప్రభుత్వం. అవసరమైతే పారిశ్రామిక వేత్తల సలహాలు తీసుకోవాలని సూచన చేశారు. గుజరాత్‌లోని జామ్ నగర్‌లో అనంత్ అంబానీ ఏర్పాటు చేసిన వన్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

దేశంలో అందరి దృష్టి ఆకర్షించేలా హైదరాబాద్‌ను మెడికల్ టూరిజం హబ్‌గా తీర్చిదిద్దాలని తెలిపారు. ఇక తిరుమల తిరుపతి దేవస్థానం మాదిరిగా యాదగిరిగుట్ట ఆలయ బోర్డును ఏర్పాటు చేయాలని అధికారులకు సూచన చేశారు. ఆలయం రాజగోపురానికి బంగారు తాపడం పనులను ప్రారంభించాలని ఆదేశించారు. గుట్టపై చేపడుతున్న అభివృద్ధి ఆశించిన స్థాయిలో లేవని, అర్థాంతరంగా ఆడిపోవడానికి వీల్లేదన్నారు. అలాగే కీసరగుట్టపై రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని రామప్ప ఆలయం తరహాలో పునర్నించాలని ముఖ్యమంత్రి చెప్పారు.

Related News

Hyderabad News: హైదరాబాద్‌ వాసులకు సూచన.. ఆ ప్రాంతాల్లో 24 గంటలపాటు తాగునీటి సరఫరా బంద్

Medaram: నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారం పర్యటన

Former DSP Nalini: మాజీ డీఎస్పీ నళిని ఆవేదనపై సీఎం రేవంత్ రియాక్షన్.. కలెక్టర్‌ను ఇంటికి పంపి..?

Sammakka Sagar: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు ఎన్ఓసీ.. ఛత్తీస్‌గఢ్ సీఎంను ఒప్పించిన మంత్రి ఉత్తమ్

HMWSSB: హైదరాబాదీలకు బిగ్ అలర్ట్.. బుధవారం ఈ ప్రాంతాల్లో మంజీరా వాటర్ బంద్, కారణం ఇదే

Weather News: మళ్లీ వర్షాలు స్టార్ట్.. ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగుల వర్షం..

CM Revanth Reddy: హైవే ప్రాజెక్టులపై.. సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష

Suryapet News: సూర్యాపేటలో హై టెన్షన్.. పోలీసులను ఉరికించి ఉరికించి.. బీహార్ బ్యాచ్ అరాచకం

Big Stories

×