BigTV English

Russia bans Americans: అమెరికన్లపై నిషేధం విధించిన రష్యా..ఎందుకో తెలుసా?

Russia bans Americans: అమెరికన్లపై నిషేధం విధించిన రష్యా..ఎందుకో తెలుసా?

Russia bans entry to dozens of American journalists.. including WSJ.. NYT and Washington Post: గత రెండున్నరేళ్లుగా ఉక్రెయిన్-రష్యా పరస్పర దాడుల నేపథ్యంతో ఉక్రెయిన్ కు అండగా నిలుస్తూ వస్తోంది అమెరికా. అయితే అమెరికాకు మొదటినుంచి ఇతర దేశాల వ్యవహారాలలో తలదూర్చడం కొత్తేమీ కాదు. పరోక్షంగా ఉక్రెయిన్ కు మద్దతునిస్తూ రష్యాకు వ్యతిరేక వైఖరిని ఇప్పటికీ అవలంబిస్తూనే ఉంది. ఇలాంటి పరిస్థితిలో రష్యా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు 92 మంది అమెరికన్ పౌరులపై నిషేధం విధించింది. వీరంతా గతంలో రష్యాలో జర్నలిస్టులుగా, వ్యాపారవేత్తలుగా ఉంటూ వచ్చారు. ముఖ్యంగా రష్యాలో ఉపాధి పొందుతున్న అమెరికాకు చెందిన జర్నలిస్టులు రష్యాకు వ్యతిరేకంగా కొన్ని ఫేక్ వార్తలు ప్రచారం చేశారు.అలాగే కొందరు వ్యాపారులు సైతం అమెరికాకు లాభం చేకూర్చేలా ప్రవర్తించారు.


జర్నలిస్టులపై చర్యలు

ప్రఖ్యాత వాల్ స్ట్రీట్ జర్నల్ నుంచి 11 మంది జర్నలిస్టులు రష్యా నిషేధిత లిస్టులో ఉన్నారు. ఏకంగా వాల్ స్ట్రీట్ జర్నల్ ఎడిటర్ కూడా ఇందులో ఉండటం గమనార్హం. వీరితో సహా మరో ఐదుగురు న్యూయార్క్ టైమ్స్ జర్నలిస్టులు, అలాగే వాషింగ్టన్ పోస్టు కు చెందిన మరో నలుగురు జర్నలిస్టులను నిషిధిస్తూ రష్యా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంకా రష్యా నిషేధిత బాధితుల లిస్టులో విద్యావేత్తలు పలువురు వ్యాపారవేత్తలు కూడా ఉన్నారు. కాగా ఇప్పటిదాకా రెండు వేల మందికి పైగా అమెరికన్లు తమ దేశంలోకి ప్రవేశం లేకుండా వారి పాస్ పోర్టులను, రష్యా దేశపు సిటిజన్ షిప్ లను సైతం నిషేధించింది . వారిని రష్యా దేశానికి రాకుండా చర్యతీసుకోవాలని రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.


Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×