Stampede in Puri Rath Yatra: ఒడిశా పూరీ జగన్నాధుడి రథోత్సవంలో అపశృతి జరిగింది. వేలాదిమంది భక్తులు రథోత్సవ యాత్రకు తరలివచ్చారు. దీంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. 500మంది భక్తులు గాయపడగా.. 8 మంది భక్తుల పరిస్థితి విషమంగా ఉంది. శతాబ్దాల నాటి సంప్రదాయంలో కీలక ఆచారమైన ఉత్సవ రథోత్సవానికి వేలాది సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. బలభద్రుడి తాళ ధ్వజాన్ని లాగుతున్న క్రమంలో జనం కిందపడ్డారు. వేల సంఖ్యలో జనం గుమిగూడటంతో తొక్కిసలాటకు ఆస్కారం కలిగింది.
రథం తాళ్లను పట్టుకునేందుకు భక్తులు ఎగబడ్డారు. దీంతో తొక్కిసలాట జరిగింది. భక్తులు ఊపిరి ఆడక స్పృహ కోల్పోయారు. అశేష సంఖ్యలో భక్తులు వస్తారన్న అంచనాతో 10వేలకు పైగా భద్రతా సిబ్బందిని ఒడిశా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. భద్రతా విధుల్లో 8 CRP ఎఫ్ కంపెనీలను మోహరించారు. రద్దీ నియంత్రణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకున్నా ప్రమాదం జరిగింది. భారీ భద్రత ఏర్పాటు చేసినప్పటికీ భక్తుల రద్దీ కూడా అదే స్థాయిలో ఉండడంతో తొక్కిసలాట జరిగిందని అధికారులు చెబుతున్నారు.
ఈ యాత్ర దేశవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచినది. ప్రతి ఏడాది కోట్లాది మంది భక్తులు పాల్గొనే ఈ ఉత్సవం సందర్భంగా.. పెద్దఎత్తున భద్రతా ఏర్పాట్లు చేస్తారు. అయితే ఈసారి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేయడంతో ఏర్పాట్లు తలకిందులయ్యాయి. పోలీసులు, యంత్రాంగం నియంత్రణ కోల్పోవడంతో భక్తులు ఒకరిపై ఒకరు పడిపడి గాయపడ్డారు. గాయపడ్డవారిలో చిన్నారులు, వృద్ధులు, మహిళలు కూడా ఉన్నారు. కొంతమంది పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని వెంటనే పూరీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
అధికార వర్గాలు వెంటనే స్పందించి.. ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. అధికారులు, పోలీసులు, రెస్క్యూ టీంలు సమన్వయంతో క్షతగాత్రులకు ప్రాథమిక చికిత్స అందిస్తున్నారు. ప్రత్యేక మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయబడ్డాయి. ప్రభుత్వం ఈ ఘటనపై విచారణకు ఆదేశాలు జారీ చేసింది. భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా.. పూర్తి స్థాయిలో సాంకేతిక ఆధారాలతో భద్రతా ఏర్పాట్లు చేయనున్నట్లు.. అధికారిక వర్గాలు తెలిపాయి.
ఈ ఘటన పట్ల ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతీ సంవత్సరం ఇలా ప్రమాదాలు జరగడంపై భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఉత్సవాల్లో భద్రతా ఏర్పాట్లు మరింత పటిష్టంగా ఉండాలని డిమాండ్ చేస్తున్నారు.
Also Read: 241 మందిని చంపేసి.. పార్టీలా? వీళ్లకు సిగ్గుందా?
ఈ తొక్కిసలాట ఘటన పూరీ రథయాత్ర చరిత్రలో.. మరొక విషాద సంఘటనగా నిలిచింది. దేవుడి దర్శనం కోసం వచ్చిన భక్తులకు ఇలా ప్రమాదం జరగడం శోచనీయం. ప్రజల ప్రాణాలు కాపాడే విధంగా భవిష్యత్తులో మరింత ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
#WATCH | Odisha | A sea of devotees continue to gather for the divine Darshan and rejoice outside the Shri Jagannath Temple as Shri Jagannath Mahaprabhu's Rath Yatra is underway#JaggannathRathYatra pic.twitter.com/V9zgdGNutW
— Mint (@livemint) June 27, 2025