Vaibhav Suryavanshi : ప్రస్తుతం అండర్-19 వన్డే సిరీస్ జరుగుతోంది. హోవ్ లో నిన్న జరిగిన మ్యాచ్ లో భారత యువ జట్టు శుభారంభం చేసింది. తొలి వన్డేలో ఇంగ్లాండ్ అండర్ -19 జట్టు పై 6 వికెట్ల తేడాతో యంగ్ టీమిండియా(Team India) ఘన విజయం సాధించింది. యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ ( Vaibhav Suryavamshi) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 19 బంతుల్లోనే 3 ఫోర్లు, 5 సిక్సర్లతో 48 పరుగులు చేసి టీమిండియా విజయానికి బలమైన పునాది వేశాడు. అంతేకాదు.. అతను భారత కీలక బ్యాటర్ విరాట్ కోహ్లీ ధరించే 18వ నెంబర్ జెర్సీని దరించి వైభవ్ ఈ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడటం విశేషం. ఇక ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ జట్టు కెప్టెన్ థామస్ రెవ్యూ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. భారత బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్ చేయడంతో ఇంగ్లాండ్ బ్యాటర్లు తడబడ్డారు. ఇంగ్లాండ్ దిగ్గజ ఆల్ రౌండర్ ఆండ్రూ ఫ్లింటాప్ కుమారుడు రాకి ఫ్లింటాప్ 90 బంతుల్లో 56 పరుగులు చేసి నిలకడగా ఆడాడు.
Also Read : West Indies : ఒకేసారి 11 మంది మహిళలతో రొమాన్స్… వెస్టిండీస్ స్టార్ అరాచకం !
శుభారంభం అందించిన వైభవ్..
అతనికి తోడు ఐజాక్ మహమ్మద్ 28 బంతుల్లో 42 పరుగులు చేశాడు. మిగతా బ్యాటర్లు అంతా విఫలం చెందారు. ఇంగ్లాండ్ జట్టు 42.2 ఓవర్లలో 174 పరుగులకే ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో కనిష్క్ చౌహాన్ అద్భుతంగా రాణించాడు. కేవలం 20 పరుగులు మాత్రమే ఇచ్చి 3 ముఖ్యమైన వికెట్లను పడగొట్టాడ. మహమమద్ ఎనాన్, హెనల్ పలేట్, ఆర్ఎస్ అంబరిష్ తలా రెండు వికెట్లు తీసి ఇంగ్లాండ్ ని తక్కువ స్కోరుకే పరిమితం చేసారు. అనంతరం 175 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టుకి ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ మంచి ఆరంభాన్ని అందించాడు. అతని దూకుడుతో భారత్ కేవలం 8 ఓవర్లలో 70 పరుగుల మార్క్ ను దాటేసింది. భారీ షాట్లతో చెలరేగిన వైభవ్, రాల్ఫీ అల్బర్ట్ లాంఛనాన్ని పూర్తి చేయడంతో భారత జట్టు మరో 26 ఓవర్లు మిగిలి ఉండగానే లక్షాన్ని ఛేదించింది.
వైభవ్ విధ్వంసం..
ఇక ఈ విజయం తో మూడు వన్డేల సిరీస్ లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. సిరీస్ లోని రెండో వన్డే జూన్ 30న జరుగనుంది. మూడో వన్డే జులై 02న నార్తాంప్టన్ లో జరుగనున్నాయి. ఇక ఆ తరువాత జులై 05, 07 తేదీలలో వొర్సెస్టర్ లో మరో రెండు వన్డేలు జరుగనున్నాయి. వైభవ్ సూర్యవంశీ ఇటీవల ఐపీఎల్ లో అధ్బుతమైన ఇన్నింగ్స్ ఆడిన విషయం తెలిసిందే. టీమిండియా బ్యాటర్ల రికార్డులను బ్రేక్ చేసిన విషయం విధితమే. 31 బంతుల్లోనే సెంచరీ చేసి విధ్వంసం సృష్టించాడు. వైభవ్ సూర్యవంశీ. వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడుతుండటంతో వచ్చే సీజన్ లో భారీ ధరకు అమ్ముడు పోనున్నట్టు తెలుస్తోంది. నిన్న జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ జెర్సీ వేసుకొని 48 పరుగులు సాధించడంతో మరో విరాట్ కోహ్లీ అని సోషల్ మీడియాలో అతని పై కామెంట్స్ చేయడం విశేషం.