BigTV English

Priyanka Chopra: మిస్ వరల్డ్ చేతిలో గ్లోబల్ స్టార్ కి ఘోర అవమానం.. స్పృహలో ఉండే మాట్లాడారా?

Priyanka Chopra: మిస్ వరల్డ్ చేతిలో గ్లోబల్ స్టార్ కి ఘోర అవమానం.. స్పృహలో ఉండే మాట్లాడారా?

Priyanka Chopra: ఒకప్పుడు కోలీవుడ్ సినిమా ద్వారా తన కెరీర్ ను ప్రారంభించి, బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా పేరు సొంతం చేసుకుంది ప్రియాంక చోప్రా(Priyanka Chopra) ఇప్పుడు హాలీవుడ్ లో సినిమాలు చేస్తూ గ్లోబల్ స్టార్ గా ఎదిగిపోయింది. ఇక అందులో భాగంగానే తాజాగా మహేష్ బాబు(Mahesh Babu), రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో వస్తున్న ‘ఎస్.ఎస్.ఎమ్.బి 29’ సినిమాలో భాగమయ్యింది. ఇప్పటికే తన పాత్రకు సంబంధించి కొంతమేర షూటింగ్ కూడా పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా తాజాగా ప్రియాంక చోప్రాపై మాజీ మిస్ వరల్డ్ చేసిన కామెంట్లు అభిమానుల ఆగ్రహానికి గురిచేస్తున్నాయి. అంతేకాదు స్పృహలో ఉండే గ్లోబల్ స్టార్ ప్రియాంక గురించి ఇలాంటి కామెంట్స్ చేశారా? అంటూ మండిపడుతున్నారు. మరి అసలు ఏమైందో ఇప్పుడు చూద్దాం.


ప్రియాంక చోప్రాపై మాజీ విశ్వసుందరి కీలక కామెంట్స్..

ఆమె ఎవరో కాదు 1999లో ప్రపంచ సుందరిగా కిరీటాన్ని ధరించిన యుక్తా ముఖి (Yukta Mookhey). అందాల పోటీల్లో పాల్గొన్న రోజుల్లో ప్రియాంక తన సూచనలు తీసుకుందని, అయితే ఆమెలో తనకు నచ్చిన విషయం ఏమీ లేదని, ఆమె తనతో స్నేహంగా ఉండేది కాదు అంటూ కూడా చెప్పుకొచ్చింది.


ఆమె నా సలహాలు తీసుకుంది – యుక్తా ముఖి

అసలు విషయంలోకి వెళ్తే.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న యుక్తా ముఖి మాట్లాడుతూ.. “1999లో నేను ప్రపంచ సుందరిగా కిరీటాన్ని ధరించాను. ప్రియాంక నా జూనియర్. 2000 సంవత్సరంలో ఆమె అందాల పోటీల్లో పాల్గొని తాను కూడా ప్రపంచ సుందరిగా విజయాన్ని సొంతం చేసుకుంది. పోటీలకు సిద్ధమవుతున్నప్పుడు ఆమె నన్ను సంప్రదించింది. నా నుంచి ఎన్నో సూచనలు, సలహాలు అడిగిమరీ తెలుసుకుంది..ఇక చాలా విషయాలలో ఆమెను నేను గైడ్ చేశాను.

ఆమెలో నాకు ఏ విషయం నచ్చలేదు – యుక్తా ముఖి..

ఆమె తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు నా కుటుంబ సభ్యులతో మాట్లాడే వారు. పోటీలకు సంబంధించి పలు విషయాలు కూడా అడిగి తెలుసుకున్నారు. వాస్తవానికి ఆమెలో నచ్చిన విషయాలంటూ నాకు ఏమీ లేవు. ఆమె నన్ను ఒక పోటీలా మాత్రమే చూసేది. నావల్ల తన ఫేమ్ కు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని కూడా ఆమె భయపడింది. నిజం చెప్పాలి అంటే ఆ సమయంలో ఆమె గురించి నన్ను అడగడం కూడా సరికాదు.. ఇక ఆమెలో ఏ ఒక్క విషయం కూడా నాకు నచ్చలేదు అంటూ కామెంట్లు చేసింది.

మాజీ విశ్వసుందరిపై ఫ్యాన్స్ ఫైర్..

ఇకపోతే ఈ విషయాలు అభిమానులకు ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి. ఎవరైనా ఏదైనా ఒక విషయంలో సలహాలు అడిగినప్పుడు చెప్పాలి. అది మీరు చెప్పారు ఓకే కానీ మీ వ్యక్తిగత అభిప్రాయాలను కూడా ఇలా పబ్లిక్ లో పెట్టి గ్లోబల్ స్టార్ ఇమేజ్ ను దెబ్బతీస్తున్నారు, ఆమె పరువు తీసేలా మాట్లాడుతున్నారు అంటూ మాజీ ప్రపంచ సుందరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

వాళ్లు నన్ను మర్యాదపూర్వకంగా చూసుకున్నారు – యుక్తా ముఖి

ఇకపోతే అదే ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..” 1984లో జూహీ చావ్లా భారత్ తరఫున అందాల పోటీలలో పాల్గొన్నారు. ఆమె నాకు చాలా సీనియర్. అయితే నేను ప్రపంచ సుందరిగా గెలుపొందిన తర్వాత ఆమె నాతో మాట్లాడారు. నేను చాలా అందంగా, ఎత్తుగా ఉన్నానని మెచ్చుకున్నారు. అలాగే ఐశ్వర్యరాయ్ (Aishwarya Rai), సుస్మితాసేన్ (Sushmita Sen)వంటి వారు కూడా నాకు సపోర్ట్ చేశారు. వాళ్ళు ఎవరు నన్ను పోటీగా తీసుకోలేదుకానీ ప్రియాంక మాత్రమే అంటూ యుక్తా ముఖి కామెంట్లు చేశారు.

ALSO READ:The Raja Saab: క్లైమాక్స్ అప్డేట్.. ఎక్కడో తెలిస్తే గూస్ బంప్స్ గ్యారెంటీ!

Related News

Jailer 2 : హైదరాబాదులో రజనీకాంత్, షూటింగ్ ఎక్కడ జరుగుతుంది అంటే?

Akhanda 2: అఖండ 2 లో ‘గంజాయి’… బాలయ్య నుంచి మరో మెసేజ్

Jr.NTR: ఎన్టీఆర్ సినిమాలు మాత్రమే కాదండోయ్.. సీరియల్ కూడా చేశారని తెలుసా.. ఏదంటే?

Actress: డైరెక్టర్ కట్ చెప్పినా.. ముద్దులు పెడుతూనే ఉన్న హీరోయిన్, పెళ్లయినా ఇదేం పాడుబుద్ధి

Rashmika Mandanna: నమ్మలేకపోతున్నా.. విజయ్‌ ఫొటోలతో రష్మిక అలాంటి కామెంట్స్, దాచినా దాగవులే!

Balakrishna: రైట్ .. రైట్..ఆర్టీసీ డ్రైవర్ గా మారిన బాలయ్య..వీడియో వైరల్!

Big Stories

×