Big Stories

Kejriwal House : లక్షలు ఖరీదు చేసే ఫర్నీచర్.. కేజ్రీవాల్ లగ్జరీ హౌజ్‌పై సుఖేష్ లెటర్..

- Advertisement -

Kejriwal House: ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. మోదీ తర్వాత ప్రధాని రేసులో జనామోదం ఉన్న నాయకుడు. నిజాయితీనే ఆయన నేపథ్యం. అవినీతి అంతు చూసే లోక్‌పాల్ బిల్లు కోసం అన్నా హజారేతో కలిసి పోరాడారు. ఆ తర్వాత ఆయనతో విభేదించి ఆప్‌ని స్థాపించి.. ముఖ్యమంత్రి అయ్యారు. ఉచితంగా నీళ్లు, ఉచిత విద్యుత్, గల్లీ దవాఖానాలు, మోడ్రన్ ప్రభుత్వ స్కూల్స్‌, మహిళలకు ఉచిత రవాణాతో ఢిల్లీవాసుల ఆదరణ చూరగొన్నారు. అందుకే, వరుసగా విజయాలు కట్టబెట్టారు. పంజాబ్‌లోనూ ఛాన్స్ ఇచ్చారు. అయితే, ఇటీవల ఆప్ ప్రాభవం క్రమంగా కనుమరుగవుతోంది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఇప్పటికే ఇద్దరు మంత్రులు జైలు కెళ్లారు. కేజ్రీవాల్ సైతం ఆ స్కాంలో చిక్కుకున్నారు. ఉన్న తలనొప్పులు చాలవన్నట్టు.. జైల్లో ఉన్న వైట్ కాలర్ క్రిమినల్ సుఖేష్ చంద్రశేఖరన్ వరుస లేఖలతో అరవింద్ కేజ్రీవాల్‌ను టార్గెట్ చేస్తున్నాడు. ఆయన టార్చర్ మామూలుగా లేదు ఈయనకు.

- Advertisement -

ఢిల్లీ లిక్కర్ స్కాంలో కేజ్రీవాల్ చెబితేనే బీఆర్ఎస్ లీడర్ కవితకు డబ్బులు ఇచ్చానంటూ పదే పదే చెబుతున్నాడు సుఖేష్. త్వరలోనే కేజ్రీవాల్ తనతో చేసిన వాట్సాప్ చాటింగ్ బయటపెడతానని హెచ్చరించాడు. ఇంకా ఆ చాటింగ్ అయితే రిలీజ్ చేయలేదు కానీ.. లేటెస్ట్‌గా మరో బాంబు పేల్చారు. ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్‌ లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తున్నారని.. అధికార నివాసంలో అత్యంత ఖరీదైన ఫర్మీచర్‌ను తానే సమకూర్చినట్టు.. దానిపై దర్యాప్తు చేయాలంటూ.. లేఖ రిలీజ్ చేశాడు సుఖేష్ చంద్రశేఖరన్.

ఆ లేఖలో సంచలన విషయాలే వెల్లడించాడు సుఖేష్. కేజ్రీవాల్ ఇంట్లో 45 లక్షల విలువైన డైనింగ్ టేబుల్, 34 లక్షల ఖరీదైన డ్రెస్సింగ్ టేబుల్స్, 18 లక్షల విలువైన అద్దాలు, 28 లక్షలు బెడ్ రూమ్ సామాగ్రి, 45 లక్షల విలువైన వాల్ క్లాక్స్ ఉన్నాయని అన్నారు. వీటన్నింటినీ ఇటలీ, ఫ్రాన్స్, ముంబై నుంచి కేజ్రీవాల్ ఇంటికి చేర్చారని తెలిపారు. వాట్సాప్, ఫేస్ టైమ్ చాట్లలో తాను పంపించిన ఫోటోల ఆధారంగా ఈ ఫర్నీచర్ ను కేజ్రీవాల్ తో పాటు సత్యేంద్ర జైన్ సెలక్ట్ చేశారని సుఖేష్ ఆరోపించారు.

90 లక్షల విలువైన వెండి సామాన్లను కూడా కేజ్రీవాల్ కోసం తాను కొనుగోలు చేసినట్టు లేఖలో తెలిపాడు సుఖేష్. కిక్ బ్యాక్ కరోల్ బాగ్ అనే ప్రాజెక్టు కింద.. వెండి వస్తువులను కొనుగోలు చేసినట్టు చెప్పాడు. తాను విడుదల చేసిన లేఖను.. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీతో దర్యాప్తు చేయించాలని లేఖలో ఎల్జీని కోరాడు. సుఖేష్ లీక్స్ మామూలుగా లేవుగా. మిగతా వాట్సాప్ చాట్స్ కూడా బయటికొస్తే.. ఇంకెలాంటి సంచలనాలు బయపడతాయో.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News