E-Paper
Advertisement

Superstition : బాలుడి ప్రాణంతీసిన మూఢనమ్మకం.. క్యాన్సర్ తగ్గుతుందని..

Superstition : బాలుడి ప్రాణంతీసిన మూఢనమ్మకం.. క్యాన్సర్ తగ్గుతుందని..
Advertisement

Superstition : కాలం మారింది. టెక్నాలజీ పెరిగింది. ఏం కావాలన్నా అరక్షణంలో ఇంటి గుమ్మం ముందుకి వచ్చే యుగంలో ఉన్నాం. కానీ.. ఇంకా కొందరుమాత్రం మూఢనమ్మకాల మాయలో పడి మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు. జబ్బు చేస్తే.. వైద్యుడికి చూపించి మందులు వాడాల్సింది పోయి.. ఎవరో చెప్పింది గుడ్డిగా నమ్మి దాన్నే పాటించారు. ఫలితంగా ఐదేళ్ల బాలుడి ప్రాణం పోయింది. మూఢనమ్మకానికి బాలుడి ప్రాణం బలైంది. ఈ ఘటన ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ లో జరిగింది.

బుధవారం (జనవరి24) జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఢిల్లీకి చెందిన ఐదేళ్ల బాలుడు బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్నాడు. ఎంతమంది వైద్యులకు చూపించినా ఫలితం లేదు. తాము కాపాడలేమని డాక్టర్లు చేతులెత్తేశారు. ఎలాగైనా తమ బిడ్డను కాపాడుకోవాలన్న తాపత్రయంతో.. ఎవరో చెప్పిన సలహాతో.. గంగలో ముంచితే రోగం నయం అవుతుందని భావించారు.

Advertisement

బాలుడిని తీసుకుని తల్లిదండ్రులు, బాలుడి మేనత్త హరిద్వార్ కు బయల్దేరారు. గంగానది వద్ద ఒకవైపు తల్లిదండ్రులు ప్రార్థనలు చేస్తుంటే.. మరోవైపు బాలుడి అత్త అతడిని చల్లగా ఉన్న గంగానదిలో ముంచింది. ఎంతసేపటికీ బాలుడిని నీటిలో నుంచి బయటకు తీయలేదు. ఇదంతా గమనించిన వారు ఆమెను అడ్డుకోగా.. వారిపై ఎదురుదాడి చేసింది. ఆమెను వారించి.. బాలుడిని నదిలో నుంచి బయటకు తీసి వెంటనే ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే బాలుడు మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి.. కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.

Related News

ఇరుముడి ఎఫెక్ట్.. ‘తులాభారం’ కోసం రవితేజ భారీ రెమ్యూనరేషన్..

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

‘కంచె చేను మేస్తున్న’ దారుణ హత్యలు! పని మనుషుల ముసుగులో నరరూప హంతకులు!

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

Big Stories

Advertisement
×