Big Stories

CAA: సీఏఏ అమలు వేగవంతం.. 14 మందికి తొలిసారి భారత పౌరసత్వం!

CAA Issued Citizenship Certificates for 14 Members: సీఏఏ అమలులోకి వచ్చిన తర్వాత కేంద్రం తొలిసారి 14 మందికి భారత పౌరసత్వం మంజూరు చేసింది. లోక్ సభ ఎన్నికల సమయంలో కేంద్ర ప్రభుత్వం పౌర సత్వ సవరణ చట్టం-2019 (CAA) అమలు ప్రక్రియను వేగవంతం చేసింది.

- Advertisement -

ఈ నేపథ్యంలోనే ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకున్న వారికి తొలి విడతలో 14 మందికి భారత పౌరసత్వం మంజూరు చేసింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా ఢిల్లీలో సీఏఏ క్రింద జారీ అయిన పౌరసత్వ సర్టిఫికెట్లను అందజేశారు. దేశంలో సీఏఏ అమలు కోసం ఈ ఏడాది మార్చిలో కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే 2019 డిసెంబర్ లో ప్రతిపక్షాల తీవ్ర నిరసనల మధ్య సీఏఏ చట్టం పార్టమెంట్ ఉభయ సభల్లో ఆమోదం పొందింది. దీనికి రాష్ట్రపతి సమ్మతి కూడా లభించింది.

- Advertisement -

సీఏఏ చట్టం ప్రకారం పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్గానిస్థాన్ నుంచి వలస వచ్చిన ముస్లిమేతర తరనార్థుల వద్ద సరైన పత్రాలు లేకపోయినా వారికి భారత పౌరసత్వం ఇచ్చేలా కేంద్రం నిబంధనలు రూపొందించింది. 2014 డిసెంబర్ 31 కంటే ముందు ఈ మూడు దేశాల నుంచి మన దేశానికి వచ్చిన హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్దులు, పార్సీలు, జైనులకు ఈ నిబంధనలు వర్తిస్తాయి. దీని దరఖాస్తు ప్రక్రియ అంతా ఆన్ లైన్ లోనే ముగుస్తుంది.

Also Read: స్వాతి మాలివాల్ పై కుట్ర, ప్రాణాలకు ప్రమాదం: ఆమె మాజీ భర్త నవీన్

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News