Commando Dowry Killing| చట్టం ముందు అందరూ సమానమే. న్యాయం అందరికీ ఒక్కటేనని సుప్రీం కోర్టు మంగళవారం నొక్కి చెప్పింది. దేశ సేవ చేసినంత మాత్రాన క్రిమినల్ కేసుల్లో మినమాయింపు నిచ్చేది లేదని తేల్చి చెప్పింది. 20 ఏళ్ల క్రితం వర కట్న వేధింపులు, భార్య హత్య కేసులో దోషిగా ఉన్న ఒక సైనికుడిపై సీరియస్ అయింది. అతని పిటీషన్ ని తిరస్కరించింది. అతను ఒక స్పెషల్ బ్లాక్ కాట్ కమాండో, ఇటీవల పాకిస్తాన్ పై భారత దేశం చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌లో పాల్గొన్నప్పటికీ అతడి దేశ సేవకు ఈ క్రిమినల్ కేసుకు ఏ సంబంధం లేదని చెప్పింది.
కేసు వివరాలు..
పంజాబ్ రాష్ట్రానికి చెందిన బల్జిందర్ సింగ్ అనే 45 ఏళ్ల వ్యక్తి 20 ఏళ్ల క్రితం తన భార్యను కట్నం కోసం వేధించాడు. తన తండ్రితో కలిసి ఆమె గొంతు నులిమి హత్య చేశాడు. ఆ సమయంలో అతని సోదరుడు వదిన కూడా అక్కడే ఉన్నారు. 2004లో ట్రయల్ కోర్టులో జరిగిన ఈ హత్య కేసు విచారణలో బల్జిందర్ దోషిగా తేలాడు. అతని కుటుంబ సభ్యులు ఈ కేసు నుంచి విడుదలయ్యారు. ఈ కేసులో అతని సమీప బంధువులు సాక్ష్యం చెప్పారు. బల్జిందర్ కట్నం కింద తనకు ఒక మోటార్ సైకిల్, నగదు డిమాండ్ చేశాడని చెప్పారు. కానీ బల్జిందర్ కు మాత్రం సెక్షన్ 340బి ప్రకరాం.. పదేళ్ల జైలు శిక్ష విధించబడింది. అయితే ఈ శిక్ష నుంచి తనకు మినహాయింపు ఇవ్వాలని బల్జిందర్ సిండ్ పంజాబ్ అండ్ హర్యాణా హై కోర్టులో అపీల్ చేశాడు.
భారత సైన్యం బ్లాక్ కాట్ కమాండో గా ఉద్యోగం చేస్తున్న బల్జిందర్ సింగ్ తన సేవలను గుర్తిస్తూ.. ఈ జైలు శిక్షను నిలువరించాలని చేసిన అపీల్ ని హై కోర్టు స్వీకరించింది. అతడి శిక్షను వాయిదా వేస్తూ వచ్చింది. బల్జిందర్ సింగ్ సరెండర్ చేయడానికి తగిన సమయం ఇస్తూ వచ్చింది. కానీ చివరికి ఇది హత్య కేసు కావడం, పైగా కట్నం వేధింపుల కేసు కావడంతో నేర తీవ్రతను బట్టి మే 2025న అతడిని వెంటనే సరెండర్ చేయాలని జైలు శిక్ష పూర్తి చేయాలని తీర్పు చెప్పింది.
అయితే పంజాబ్ హర్యాణా హై కోర్టు తీర్పుని సవాల్ చేస్తూ.. బల్జిందర్ సింగ్ సుప్రీం కోర్టులో పిటీషన్ వేశాడు. తన శిక్షను రద్దు చేయాలని కోరాడు. తాను ఇటీవలే పాకిస్తాన్ పై భారత దేశం చేసిన దాడుల్లో పాల్గొన్నానని, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడానని ఆ సేవలను గుర్తించాలని వాదించాడు. అయితే జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ వినోద్ చంద్రన్ లతో కూడిన సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం అతడి వాదనపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అతడి వాదనలను తప్పుబట్టింది.
Also Read: పరీక్షలో తక్కువ మార్కులు వచ్చాయని కూతురి హత్య.. హెడ్ మాస్టర్ తండ్రి నిర్వాకం
జస్టిస్ భూయాన్ ఈ కేసులో వ్యాఖ్యానిస్తూ.. “బ్లాక్ కమాండో గా మీరు ఉద్యోగం చేస్తున్నారు. మీరు శరీర దారుఢ్యం కలవారని తెలుస్తూనే ఉంది. మీరు దేశ సేవ కోసం పోరాడి ఉంటారు. అయినంత మాత్రాన ఇంట్లో మీరు ఘూరమైన నేరాల చేయడానికి ఆమోదం లభించదు. మీ ఫిట్ నెస్ చూస్తుంటే మీర ఒంటరిగానే మీ భార్యను హత్య చేసి ఉంటారని ఆమెను గొంతు నులిమి చంపేశారని తెలుస్తోంది.” అని బల్జిందర్ సింగ్ వాదనలను తిప్పికొట్టారు. కేవలం ఒక నెల నుంచి ఒక సంవత్సరం పాటు విధించే జైలు శిక్షలను మాత్రమే వాయిదా వేయగలమని హత్య లాంటి తీవ్రమైన నేరాలకు శిక్ష రిజర్వ్ చేయలేమని చెప్పారు. అతడి దేశ సేవ.. అతడు చేసిన దారుణ నేరాల శిక్షను అడ్డుకోలేదని స్పష్టం చేశారు.మరో రెండు వారాల్లో శిక్ష కోసం సరెండర్ చేయాలని కోర్టు బల్జిందర్ సింగ్ ను ఆదేశించింది.