OTT Movie : హాలీవుడ్ సినిమాలను ఫాలో అయ్యే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఈ సినిమాలు వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతాయి. వీటిలో సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలను చూడటానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు మూవీ లవర్స్ . అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా నరాలు కట్ అయ్యే థ్రిల్ ను ఇస్తుంది. క్షణ క్షణం ఉత్కంఠభరితంగా నడుస్తుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ అమెరికన్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ పేరు ‘డ్రాప్’ (Drop). 2025 లో వచ్చిన ఈ సినిమాకి క్రిస్టోఫర్ లాండన్ దర్శకత్వం వహించారు. బ్లంహౌస్ ప్రొడక్షన్స్ దీనిని నిర్మించింది. ఇందులో మేఘన్ ఫాహీ, బ్రాండన్ స్క్లెనార్, వైలెట్ మెక్‌గ్రా, జాకరీ లెవీ, గాబ్రియెల్ లాబెల్ నటించారు. ఈ సినిమా 2025 ఫిబ్రవరి 14న థియేటర్లలో విడుదలైంది. 2025 మే నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది. 1 గంట 32 నిమిషాల రన్ టైమ్ ఉన్న ఈ సినిమాకు IMDB లో 6.1 రేటింగ్ ఉంది.
స్టోరీలోకి వెళితే
బ్రీ అనే మహిళ ఒక ఫాస్ట్-ఫూడ్ రెస్టారెంట్‌లో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తుంటుంది. బ్రీ తన టీనేజ్ కుమార్తె లొరెలైతో కలిసి జీవితాన్ని గడుపుతూ, ఆర్థిక, వ్యక్తిగత సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఆమె జీవితం ఒక రోజు ఫోన్ కి వచ్చిన వీడియోతో అనూహ్య మలుపు తిరుగుతుంది. బ్రీ ఒక కస్టమర్‌తో మాట్లాడుతుండగా, ఆమె ఫోన్‌కు ఫోన్ రిక్వెస్ట్ వస్తుంది. దానిలో ఆమె రెస్టారెంట్‌లో జరుగుతున్న ఒక సన్నివేశంకి సంబంధించిన వీడియో ఉంటుంది. ఆమె గురించిన ఒక కెమెరా రికార్డింగ్ వీడియో బ్రీని భయాందోళనలోకి నెట్టివేస్తుంది. ఎందుకంటే అది ఆమె వ్యక్తిగత జీవితంలోని రహస్యాలను బయటకి వచ్చేలా చేసింది. ఆమె తన ఫోన్‌ను తనిఖీ చేసినప్పుడు, మరిన్ని వీడియోలు వస్తాయి. ప్రతి ఒక్కటి ఆమె గతం నుండి, ఆమె సమీపంలో ఉన్న వ్యక్తుల గురించి రహస్య సమాచారాన్ని వెల్లడిస్తాయి. ఈ వీడియోలు ఒక అనామక స్టాకర్ నుండి వస్తున్నట్లు తెలుస్తుంది. అతను బ్రీ జీవితాన్ని నాశనం చేయడానికి టెక్నాలజీని ఉపయోగిస్తుంటాడు.
ఈ స్టాకర్ ఆమెను మానసికంగా బాధించడమే కాక, ఆమె కుమార్తె లొరెలై, ఆమె సహోద్యోగి జోయెల్,ఒక డెలివరీ డ్రైవర్ ను కూడా లక్ష్యంగా చేసుకుంటాడు. బ్రీ దీని వెనుక ఉన్న వాళ్ళని కనిపెట్టడానికి ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో ఆమె తన రెస్టారెంట్ మేనేజర్ రాస్, పొరుగువాడైన లూక్ సహాయం తీసుకుంటుంది. రాస్ ఈ సమస్యను తేలిగ్గా తీసుకుంటాడు. అయితే లూక్ ఎయిర్‌డ్రాప్‌ల వెనుక ఉన్న టెక్నికల్ అంశాలను ఛేదించడానికి సహాయపడతాడు. చివరికి దీని వెనుక ఎవరున్నారో వీళ్ళు కనిపెడతారా ? ఇంతకీ ఆ వీడియోలో ఏముంది ? బ్రీ ఈ సమస్యను ఎలా ఎదుర్కుంటుంది ? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ అమెరికన్ కామెడీ థ్రిల్లర్ సినిమాని మిస్ కాకుండా చూడండి.
Read Also : ఓటీటీలో గత్తర లేపుతున్న రాధికా ఆప్టే మూవీ… ఇదెక్కడి అరాచకంరా అయ్యా