
Supreme court news today (daily news update):
ఎస్సీ వర్గీకరణ అంశంపై దేశ అత్యున్నత న్యాయస్థానం విచారణ మొదలైంది. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి దాఖలైన అన్ని పిటిషన్లు జత చేసిన సుప్రీ కోర్టు.. పంజాబ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలో ఏడుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపట్టింది.
ఎస్సీ, ఎస్టీ వర్గీకరణకు సంబంధించి రాజ్యాంగం అనుమతిస్తుందా..? లేదా అన్నది ఈ ఏడుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం తేల్చనుంది. మంగళవారం ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో పంజాబ్ అడ్వకేట్ జనరల్ వాదనలు ప్రారంభించారు.
ఎస్సీ వర్గీకరణకు రాష్ట్ర శాసనసభలు సిద్ధంగా ఉన్నాయా..? అని రాజ్యాంగ ధర్మాసనం ప్రశ్నించింది. రిజర్వేషన్లకు సంబంధించి అసమానతలను తొలగించడానికి ప్రభుత్వాలు తీసుకున్న చర్యలేమిటని..? ప్రశ్నించింది. అయితే ఎస్సీ వర్గీకరణపై రాజ్యాంగ ధర్మాసనం అన్ని రాష్ట్రాల అభిప్రాయాలను తెలుసుకోనున్నది.
ఇప్పటికే ఎస్సీ వర్గీకరణకు కేంద్రం ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీ వేసింది. కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో కేంద్ర హోం శాఖ, న్యాయశాఖ, సామాజిక న్యాయ శాఖ గిరిజన శాఖల కార్యదర్శులు సభ్యులుగా ఉన్నారు.