BigTV English

Popular Museums in India : మనదేశపు మేలైన మ్యూజియాలు..!

Popular Museums in India : మనదేశపు మేలైన మ్యూజియాలు..!
Museums in India

Museums in India (today’s latest news):


జాతి సంస్కృతిని, ప్రాచీన వైభవాన్ని చాటిచెప్పే వేదికలే మ్యూజియాలు. మనదేశంలో దేశం నలుమూలల్లో ఉన్న అలాంటి చూడదగిన అయిదు ముచ్చటైన మ్యూజియాలు ఇవే.

ఇండియన్‌ మ్యూజియం, కోల్‌కతా
దేశంలోని అతి పెద్ద మ్యూజియం ఇది. 1814లో కోల్‌కతాలో ప్రారంభమైన ఈ ప్రాచీన మ్యూజియం.. ఆసియా-పసిఫిక్‌ ప్రాంతంలోని అతిపెద్ద రిఫరల్ మ్యూజియంగా గుర్తింపు పొందింది. ఇక్కడి 35 గ్యాలరీలలో నిర్మాణపరంగా అచ్చెరువొందే కళాఖండాలు, పురాతన అవశేషాలు, నాటి పాలకులు వాడిన కవచాలు, అభరణాలు, మమ్మీలు, మొఘలుల చిత్రలేఖనాలున్నాయి. సోమవారం, ప్రభుత్వ సెలవు దినాల్లో మూసి ఉంటుంది. టికెట్ ధర పెద్దలకు రూ. 50, పిల్లలకు రూ. 20


నేషనల్‌ మ్యూజియం, ఢిల్లీ
స్వాతంత్ర్యానికి పూర్వం లండన్‌ రాయల్‌ అకాడమీ వారు బర్లింగ్‌టన్‌ హౌస్‌లో ఓ మ్యూజియాన్ని నిర్వహించారు. భారత్‌ నుంచి సేకరించిన అరుదైన కళాఖండాల ప్రదర్శన విజయవంతం కావటంతో, వీటినే తర్వాతి రోజుల్లో రాష్ట్రపతి భవన్‌లోనూ ప్రదర్శించారు. సుమారు 2 లక్షల ఈ కళాఖండాలను నేషనల్ మ్యూజియం పేరుతో ఏర్పరచారు. 5వేల ఏళ్లనాటి మన సాంస్కృతిక వైభవాన్ని చాటే ఈ మ్యూజియం జనపథ్ సమీపంలో ఉంది. సోమవారం సెలవు. టిక్కెట్టు ధర పెద్దలకు రూ. 20.

సాలార్‌జంగ్‌ మ్యూజియం, హైదరాబాద్‌
హైదరాబాద్‌లో మూసీనది ఒడ్డున గల ఈ మ్యూజియం ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది. 43వేల కళాఖండాలు, 50 వేల పుస్తకాలు, రాత ప్రతులున్న ఈ మ్యూజియం భారతీయ, పర్షియన్, యూరోపియన్ శైలికి సంబంధించిన కళాఖండాలే గాక మమ్మీలు, నూర్జహాన్‌, షాజహాన్‌, ఔరంగజేబు వంటి చక్రవర్తులు వాడిన ఆయుధాలు ఉన్నాయి. పబ్లిక్ హాలిడే, శుక్రవారం రోజుల్లో మూసి ఉంటుంది. టికెట్ ధర: 20

బీహార్‌ మ్యూజియం, పాట్నా
స్వాతంత్ర్య సంగ్రామానికి చెందిన అనేక విశేషాలను 1917లో స్థాపించిన ఈ మ్యూజియంలో చూడొచ్చు. ముఖ్యంగా మౌర్యులు, గుప్తుల కాలం నుంచి 18వ శతాబ్దపు చరిత్ర వరకు వివరించే అనేక కళాఖండాలు, ఆయుధాలు, చిత్రపటాలున్నాయి. సోమవారం సెలవు. టికెట్ ధర.. పెద్దలకు రూ. 100, పిల్లలకు రూ. 20.

ఇండో-పోర్చుగీస్‌ మ్యూజియం, కొచ్చి
కేరళలోని కొచ్చిలోని ఈ మ్యూజియం ఆ ప్రాంతంపై పోర్చుగీసుల చారిత్రక, సాంస్కృతిక ప్రభావాన్ని తెలియజెబుతుంది. 5 విభాగాలుగా ఉండే ఈ మ్యూజియంలోని కళాఖండాలలో ఎక్కువగా పోర్చుగీసు పాలనలో నిర్మించిన చర్చిల నుంచి సేకరించినవే. సోమవారం సెలవు. టికెట్ ధర పెద్దలకు రూ. 10, పిల్లలకు రూ. 5. ప్రతినెలా మొదటి గురువారం అందరికీ ప్రవేశం ఉచితం.

Tags

Related News

Modi Government: వాటిపై పన్ను కట్టాల్సిన పని లేదు.. రైతులకు కేంద్రం గుడ్ న్యూస్

Richest Village: ఆ ఊళ్లో ప్రతి రైతూ కోటీశ్వరుడే.. ప్రపంచంలోనే అత్యంత ధనిక గ్రామం ఎక్కడంటే!

Trump Tariffs Effect: అమెరికా 50% పన్ను ప్రభావం.. 40 దేశాల్లో స్పెషల్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తోన్న భారత్

High Alert In Bihar: రాష్ట్రంలో హైఅలర్ట్.. బీహార్‌లోకి జైషే ఉగ్రవాదుల చొరబాటు

US Drinks Ban: ట్రంప్ టారిఫ్.. అమెరికాకు షాకిచ్చిన వర్సిటీ, శీతల పానీయాలపై నిషేధం

Palghar Building Collapse: మహారాష్ట్రలోని విరార్‌లో కూలిన భవనం.. 15 మంది మృతి

Big Stories

×