BigTV English

National:‘నీట్’ తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ..నేడు సుప్రీంకోర్టు లో విచారణ

National:‘నీట్’ తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ..నేడు సుప్రీంకోర్టు లో విచారణ

Supreme Court to hear 38 petitions related to controversy ridden NEET UG 2024  Today
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘నీట్’ అర్హత పరీక్ష పేపర్ లీకేజ్ కేసు పై దాఖలు చేసిన పిటిషన్ ఈ నెల 8న సుప్రీం కోర్టు లో విచారణ జరగనుంది. వంద శాతం మార్కులు వచ్చిన వాళ్లు ఎక్కువ సంఖ్యలో ఉండటంతో నీట్ నిర్వహణపై అనుమానాలు రేకెత్తాయి. పోలీసుల విచారణలో గుజరాత్, బీహార్ రాష్ట్రాలలో లీక్ కుట్ర ఛేదించారు. తర్వాత ‘నీట్’ పరీక్ష రద్దు చేయాలని ప్రతిపక్షాలు, విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నాయి.రద్దు చేస్తే కష్టపడి చదివిన విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకమవుతుందని కేంద్రం తరపున కొందరు పరీక్షరద్దు చేయొద్దని సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రద్దు చేయాలని కోరుతో మరికొందరు సుప్రీం ను ఆశ్రయించారు. ఇదే అంశంపై దాదాపు 38 పిటిషన్లు దాఖలవడం గమనార్హం. ‘నీట్ ’ కేసును చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలో మనోజ్ మిశ్రా, జేపీ పార్థీవాలాలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టనుంది.


రద్దు చేయొద్దంటూ అభ్యర్థన

నీట్ రద్దు చేయొద్దంటూ కేంద్రం ఇప్పటికే సుప్రీం కోర్టుకు సూచించింది. అందరూ అనుకున్నట్లుగా అక్కడ అవకతవకలు ఏమీ జరగలేదని సుప్రీంకు తెలిపింది. పైగా సిన్సియర్ గా పరీక్ష రాసిన విద్యార్థులకు తీరని అన్యాయం జరుగుతుందని తెలిపింది.నీట్ రద్దు చేస్తే లక్షలాది విద్యార్థుల జీవితాలు ఆగం అవుతాయని కేంద్రం స్పష్టం చేసింది. లక్షలాది విద్యార్థుల ప్రయోజనానికి తాము కట్టుబడి ఉన్నామని సుప్రీంకు కేంద్రం తెలిపింది.


కౌన్సెలింగ్ వాయిదా

నీట్ యూజీ కౌన్సెలింగ్ కూడా పోస్ట్ పోన్ అయిన విషయం తెలిసిందే. సోమవారం కోర్టు తీర్పు నేపథ్యంలోనే వాయిదా వేయడం జరిగిందని మెడికల్ బోర్డు నిర్ణయం తీసుకుంది. కౌన్సెలింగ్ వాయిదా వేయడానికి సుప్రీం ససేమిరా ఒప్పుకోలేదు. అయినా కేంద్రం వాయిదా వెయ్యడానికే నిర్ణయిచుకుంది. ఏది ఏమైనా సుప్రీం తీర్పు తర్వాతే కౌన్సెలింగ్ పై మెడికల్ బోర్డు నిర్ణయం తీసకుంటుంది.

తీర్పుపై ఉత్కంఠ

సీయూఈటీ యూజీ ఎక్గామ్ ఆన్సర్ కీని రిలీజ్ చేసింది. త్వరలోనే వీటి ఫలితాలు వెల్లడించనున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి గందరగోళ పరిస్థితుల మధ్య సుప్రీం కోర్టు ఎలాంటి తీర్పునిస్తుందో అని అందరూ ఉత్కంఠగా ఉన్నారు. మంచిగా కష్టపడి చదివి ర్యాంకులు తెచ్చుకున్న విద్యార్థులు తమ పరిస్థితి ఏమిటో అని ఆందోళన పడుతున్నారు.

Related News

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Big Stories

×