BigTV English
Advertisement

Swati Maliwal Says No Resign: వెనక్కి తగ్గేది లేదన్న స్వాతి మలీవాల్.. ఆపై ఎంపీ సీటుకు..!

Swati Maliwal Says No Resign: వెనక్కి తగ్గేది లేదన్న స్వాతి మలీవాల్.. ఆపై  ఎంపీ సీటుకు..!

Swati Maliwal Says No Resignation: ఆప్ రాజ్యసభ సభ్యురాలు స్వాతిమలీవాల్ మళ్లీ లైమ్ లైట్‌లోకి వచ్చేశారు. ఆమెపై దాడి వ్యవహారం పార్టీ రెండుగా చీలినట్టు వార్తలొస్తున్నాయి. ఓ వర్గం ఆమెకి అనుకూలంగా, మరొకటి వ్యతిరేకంగా తయారైంది. ఈ క్రమంలో స్వాతి తన ఎంపీ పదవికి రాజీనామా చేయాలనే ఒత్తిడి ఓ వర్గం నుంచి ఊపందుకుంది. ఈ క్రమంలో ఆమె రియాక్టు అయ్యారు.


పార్టీ కోరితే సంతోషంగా రిజైన్ చేసేదానినని గుర్తు చేశారు ఎంపీ స్వాతిమలీవాల్. కావాలంటే తన ప్రాణం అడిగినా ఇస్తానని చెప్పుకొచ్చారు. ఎంపీ సీటు విషయం చాలా చిన్నదని, తాను ఏ రోజూ పదవుల కోసం ఆశపడలేదని కుండబద్దలు కొట్టారు. ఇప్పుడు రాజీనామా చేసే ప్రసక్తి లేదని తేల్చేశారు. ఇప్పుడు మరింత కష్టపడి చేస్తానని మనసులోని మాట బయటపెట్టారు.

పార్టీలో చేరినప్పుడు తాను ఎవరికీ తెలీయదని, అప్పట్లోనే ఆ వ్యక్తులతో కలిసి పనిచేశానన్నారు స్వాతి. ముఖ్యంగా ఇంజనీరింగ్ ఉద్యోగం వదిలి రాజకీయాల్లో జాయిన్ అయ్యానన్నారు. మొదట్లో ముగ్గురు మాత్రమే ఉండేవారమని, ఎలాంటి పదవులు ఆశించకుండా కిందస్థాయిలో పని చేశానన్నారు. తనకు ఏ పదవీ లేకపోయినా పని చేస్తానంటూనే, ఎంపీ పదవికి మాత్రం రాజీనామా చేసేది లేదన్నారు.


Also Read: 6th Phase Loksabha Elections 2024 : ఆరో విడత లోక్ సభ ఎన్నికలు.. 58 నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రారంభం

ఆప్ ఎంపీ స్వాతి మలీవాల్‌పై దాడి వ్యవహారం ఢిల్లీ రాజకీయాలను ఇప్పటికీ కుదిపేస్తూనే ఉంది. ఈనెల 13న సీఎం కేజ్రీవాల్ వ్యక్తిగత కార్యదర్శి బిభవ్‌కుమార్ తనపై దాడి చేశాడన్నది స్వాతి ప్రధాన ఆరోపణ. ఈ క్రమంలో స్వాతికి ఢిల్లీ ఎయిమ్స్‌లో పరీక్షలు చేయించారు పోలీసులు. కొట్టింది నిజమేనని నిర్ధారించుకున్న తర్వాత కేసు నమోదు చేశారు. ఆమె నుంచి డీటేల్స్ సేకరించిన తర్వాత కుమార్‌ను అరెస్టు చేశారు.

ఇంతవరకు వ్యవహారం బాగానే జరిగింది. అసలు కథ ఇక్కడి నుంచే మొదలైంది. ఈ క్రమంలో రాజ్యసభ పదవికి స్వాతి రాజీనామా చేయాలంటూ ఒత్తిడి పెరుగుతున్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ వార్తల నేపథ్యంలో ఆమె రియాక్ట్ అయ్యారు.

Tags

Related News

Delhi Air Pollution: వాయు కాలుష్యంతో దిల్లీ ఉక్కిరిబిక్కిరి.. సాయం చేసేందుకు ముందుకొచ్చిన చైనా

TVK Vijay: ఒంటరిగానే బరిలోకి టీవీకే.. సీఎం అభ్యర్థిగా హీరో విజయ్

UP Minor Girl: ఫాలోవర్స్ పెంచుకునేందుకు హిందూ దేవుళ్లపై చీప్ కామెంట్స్, టీనేజర్ తోపాటు పేరెంట్స్ అరెస్ట్!

Delhi Politics: ఓట్‌ చోరీపై కొత్త బాంబు పేల్చిన రాహుల్‌గాంధీ.. బ్రెజిల్‌ మోడల్‌‌కు ఓటు హక్కు, హవ్వా

Train Accident: రైల్వే స్టేషన్‌లో ప్రయాణీకుల మీదకు దూసుకెళ్లిన రైలు.. ఆరుగురు స్పాట్ డెడ్

Philippines: ఫిలిప్పీన్స్‌లో తుఫాను బీభత్సం.. 40 మందికి పైగా మృతి..

Muzaffarnagar: కళాశాల విద్యార్థినులకు వేధింపులు.. యూపీ పోలీసుల స్పెషల్ ట్రీట్‌మెంట్

Train Collides: ఘోర రైలు ప్రమాదం.. రెండు రైళ్లు ఢీకొని 10 మంది మృతి, పలువురికి గాయాలు

Big Stories

×