E-Paper
Advertisement

మందు బాబులకు వైద్యుల షాక్.. వైన్ షాపుల బయటే హెల్త్ క్యాంప్!

మందు బాబులకు వైద్యుల షాక్.. వైన్ షాపుల బయటే హెల్త్ క్యాంప్!
Advertisement

Liquor Health Camps: మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లాలో ఆరోగ్య, ఎక్సైజ్, పోలీసు శాఖలు సంయుక్తంగా వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. మద్యం కొనుగోలు చేయడానికి వచ్చే వారి ఆరోగ్య పరిస్థితిని అంచనా వేయడానికి వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు నేరుగా వైన్ షాపుల బయటే వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. నిత్యం మద్యం సేవించే వారిలో తలెత్తే ఆరోగ్య సమస్యలను ముందే గుర్తించి, మద్యపానాన్ని తగ్గించేలా వారిని ప్రోత్సహించేందుకు ఈ విధంగా చర్యలు చేపట్టారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ఆరోగ్య సిబ్బంది.. ముందుగా మద్యం షాపులకు వచ్చే వారితో మాట్లాడతారు. వారి మద్యపాన అలవాట్ల గురించి అడిగి తెలుసుకోవడంతో పాటు, వారికి గతంలో ఉన్న ఆరోగ్య సమస్యల వివరాలను నమోదు చేసుకుంటారు. అనంతరం వైద్యులు వారికి ప్రైమరీ టెస్టులు చేయడంతో పాటు అవసరమని భావిస్తే రక్త నమూనాలను కూడా సేకరించి సదరు ఆరోగ్య పరిస్థితిని అంచనా వేస్తున్నారు.

Advertisement

వైద్య బృందాలు కేవలం పరీక్షలకే పరిమితం కాకుండా.. అతిగా మద్యం సేవించడం వల్ల కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాయి. అవసరమైన వారికి మందులు, మల్టీవిటమిన్ మాత్రలను ఉచితంగా అందిస్తూ మద్యం అలవాటును తగ్గించుకునే మార్గాలపై కౌన్సెలింగ్ ఇస్తున్నాయి. ముఖ్యంగా పరగడుపున మద్యం తాగవద్దని అలాగే అప్పటికే మూత తెరిచి ఉంచిన సీసాల్లోని మద్యాన్ని సేవించవద్దని వైద్యులు సూచనలు చేస్తున్నారు.

Advertisement

కాగా, వైన్ షాపుల బయట వైద్యులు స్టెతస్కోప్‌లు, ఇతర వైద్య పరికరాలతో పరీక్షలు నిర్వహిస్తున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆసుపత్రులకు వెళ్లడానికి ఇష్టపడని వారిని నేరుగా కలుసుకోవడానికి ఇది మంచి మార్గమని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. అయితే మద్యం కొనే ఆలోచనతో అక్కడికి వచ్చే వారు ఆ సమయంలో వైద్యుల సలహాలను ఎంతవరకు స్వీకరిస్తారనే సందేహాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు.

Also Read: ద్వీపం కోసం గజరాజుల సాహసం.. సరస్సులో 7 కి.మీ మేర నాన్ స్టాప్ ఈత.. అద్భుత దృశ్యాలు వైరల్!

ఇదిలా ఉంటే గత కొద్దిరోజులుగా సాగర్ జిల్లాలో మద్యం సంబంధిత మరణాలు గణనీయంగా పెరుగుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమై ఈ నిర్ణయం తీసుకుందన్న అభిప్రాయాలు కూడా ఉన్నాయి. గత సెప్టెంబర్‌లో కల్తీ మద్యం ఘటనలో 20 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. వారికి నిర్వహించిన పోస్టుమార్టం రిపోర్ట్స్ లో కొందరికి అప్పటికే ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నట్లు వెల్లడైంది. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించిన జిల్లా యంత్రాంగం.. రెగ్యులర్‌గా మద్యం తాగే వారి ఆరోగ్యంపై దృష్టి సారించాలని నిర్ణయించింది.

Also Read: 1981 భాగ్యనగరానికి.. ఇప్పటి హైదరాబాద్‌కి ఎంత తేడా? లెక్కలు చూస్తే షాకే!

Tags

Related News

కోర్టు వెలుపలే దారుణం.. హత్య కేసు నిందితుడిపై వేటకొడవళ్లతో దాడి.. భయానక దృశ్యాలు వైరల్!

సుప్రీం ఆదేశాలు ఉన్నా.. తిరుప్పరంకుండ్రంలో వెలగని దీపం.. కారణాలేంటో కుండబద్దలు కొట్టిన మధురై కలెక్టర్!

‘బయటకు వెళ్దాం.. నేను చెప్పిన బట్టలు వేసుకో’.. విద్యార్థినికి టీచర్ అసభ్యకర మెసేజ్‌లు!

ఢిల్లీలో మరో ఘోరం.. కేఫ్‌లో యువతిపై సామూహిక అత్యాచారం.. తోటి ఉద్యోగులే కీచకులు!

అన్ని బంధాలు తెంచుకున్నాం.. బతికి ఉండగానే కూతురికి అంత్యక్రియలు, మధ్యప్రదేశ్‌లో దారుణమైన ఘటన

OYO గదిలో డిగ్రీ యువతి మృతి.. పత్తాలేని ప్రియుడు, హర్యానాలో షాకింగ్ ఘటన

ఆత్మాహుతి దాడికి భారీ కుట్ర.. మీరట్‌లో ఉగ్రవాది అరెస్ట్.. విచారణలో షాకింగ్ నిజాలు!

Big Stories

Advertisement
×